Kitchen Hacks: గ్యాస్ స్టవ్ బర్నర్న్‌ని ఇలా క్లీన్ చేయండి.. సింపుల్ టిప్స్ మీ కోసం..
మన వంటింట్లో ముఖ్యమైన వస్తువు ఏదైనా ఉందంటే అది గ్యాస్ స్టవ్. దీంతోనే మనకు వంట ఫాస్ట్ గా పూర్తి అవుతుంది. లేడీస్ కి హెల్ప్ చేసే వస్తువుల్లో ఇది కూడా ఒకటి. గ్యాస్ స్టవ్ క్లీన్ గా, నీట్ గా ఉంటేనే కిచెన్ మొత్తం క్లీన్ గా ఉన్నట్లు అనిపిస్తుంది. లేదంటే చిరాకుగా ఉంటుంది. సాధారణంగా మనం వంట చేసేటప్పుడు పదార్థాలు అటూ ఇటూ పడుతూ ఉంటాయి. వంట పూర్తి కాగానే.. ఓ ఐదు నిమిషాలు ఉపయోగించి స్టవ్ ని క్లీన్ చేసుకోవచ్చు. లేదంటే అది అలానే ఉంటుంది. దీంతో స్టవ్ మీదకు..

మన వంటింట్లో ముఖ్యమైన వస్తువు ఏదైనా ఉందంటే అది గ్యాస్ స్టవ్. దీంతోనే మనకు వంట ఫాస్ట్ గా పూర్తి అవుతుంది. లేడీస్ కి హెల్ప్ చేసే వస్తువుల్లో ఇది కూడా ఒకటి. గ్యాస్ స్టవ్ క్లీన్ గా, నీట్ గా ఉంటేనే కిచెన్ మొత్తం క్లీన్ గా ఉన్నట్లు అనిపిస్తుంది. లేదంటే చిరాకుగా ఉంటుంది. సాధారణంగా మనం వంట చేసేటప్పుడు పదార్థాలు అటూ ఇటూ పడుతూ ఉంటాయి. వంట పూర్తి కాగానే.. ఓ ఐదు నిమిషాలు ఉపయోగించి స్టవ్ ని క్లీన్ చేసుకోవచ్చు. లేదంటే అది అలానే ఉంటుంది. దీంతో స్టవ్ మీదకు బ్యాక్టీరియా, క్రిములు వంటివి వచ్చి చేరతాయి. క్లీన్ చేయవచ్చులే అని అలానే ఓ వారం పాటు వదిలేస్తే జిడ్డు బారిపోయి ఉంటుంది. ఇది అనారోగ్య సమస్యల్ని కూడా తెచ్చి పెడుతుంది. కాబట్టి గ్యాస్ స్టవ్ ఎప్పుడూ నీట్ గా ఎలా క్లీన్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
గ్యాస్ పై జిడ్డు పేరుకుపోతే ఇలా చేయండి:
సబ్బు లేదా సర్ఫ్ నీటిని ఉపయోగించి క్లీన్ చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ క్లీన్ చేయాలంటే.. ప్లేట్స్, బర్నర్స్ తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు సబ్బు నీళ్లను స్టవ్ పై వేసి కాసేపు నాననివ్వండి. ఇప్పుడు మెత్తటి క్లాత్ తీసుకుని మెల్లగా రుద్దుతూ క్లీన్ చేయాలి. ఇలా చేస్తే మూలల్లో ఉండే మురికి కూడా వచ్చేస్తుంది. అలాగే స్టవ్ తెల్లగా.. క్లీన్ గా ఉంటుంది.
గ్యాస్ స్టవ్ దుర్వాసన పోవాలంటే:
ఒక్కోసారి గ్యాస్ స్టవ్ వద్ద నుంచి దుర్వాసన వస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఏం చేయాలంటే.. సబ్బు నీటిలో సగం నిమ్మ చెక్కను పిండి స్టవ్ మీద వేయాలి. కాసేపు ఆగి.. క్లీన్ చేసిన వేస్ట్ క్లాత్ తో శుభ్రంగా తుడుచుకోవాలి. ఇలా చేస్తే స్టవ్ నుంచి దుర్వాసన రాకుండా.. మంచి స్మెల్ వస్తుంది.
బర్నర్ క్లీన్:
స్టవ్ లో ముఖ్యంగా బర్నర్స్ మెయిన్. వీటిని అప్పుడప్పుడు తీసి క్లీన్ చేసుకుంటూ ఉండాలి. లేదంటే మంట సరిగ్గా రాదు. అంతే కాకుండా గ్యాస్ కూడా లీక్ అవుతుంది. కాబట్టి బర్నర్స్ ని బ్రష్ తో క్లీన్ చేస్తూ ఉండాలి.
బర్నర్స్ క్లీన్ చేయడంలో అమ్మోనియా బాగా వర్క్ అవుతుంది. జిప్ లాగ్ బ్యాగ్స్ లో అమ్మోనియా వేసి.. అందులో ఓ నైట్ మొత్తం బర్నర్స్ ఉంచాలి. ఇలా చేస్తే.. బర్నర్స్ క్లీన్ అవుతాయి.
వారం రోజులకు క్లీన్ చేసుకోవాలి:
చాలా మంది గ్యాస్ స్టవ్ ను క్లీన్ చేయకుండా రోజుల తరబడి అలానే వదిలేస్తారు. అలా కాకుండా వీలైతే మూడు, నాలుగు రోజులకు ఓ సారి క్లీన్ చేసుకోవచ్చు. లేదంటే వారం రోజులకైనా క్లీన్ చేసుకుంటే స్టవ్ నీట్ గా ఉండడమే కాకుండా.. ఎక్కువ రోజులు మన్నుతుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.