Bicycle Ambulance: సైకిల్ అంబులెన్స్ తయారు చేసిన గుంటూరు విద్యార్ధి.. జాతీయ అవార్డుకు ఎంపిక!
అంబులెన్స్‌కు ఎంత ప్రాధాన్యత ఉందో మనందరికీ తెలుసు. ప్రమాదాలు జరిగినప్పుడు, తీవ్ర అనారోగ్య సమస్య తలెత్తినప్పుడె అంబులెన్స్ లు సకాలంలో రోగులను ఆసుపత్రికి చేరుస్తుంటాయి. అయితే కొండ ప్రాంతాల్లో, మారుమూల గ్రామాల్లో అంబులెన్స్‌లో లేకపోవడంతో ఇప్పటికీ రోగులను సకాలంలో ఆసుపత్రికి చేర్చలేక ప్రాణాలు కాపాడలేకపోతున్నాం. ఈ క్రమంలో కొత్త కొత్త అంబులెన్స్‌లను, వివిధ రూపాల్లో అన్ని వర్గాలకు అందుబాటులో ఉండే వాటిని తయారు చేస్తూనే..
గుంటూరు, అక్టోబర్ 12: అంబులెన్స్‌కు ఎంత ప్రాధాన్యత ఉందో మనందరికీ తెలుసు. ప్రమాదాలు జరిగినప్పుడు, తీవ్ర అనారోగ్య సమస్య తలెత్తినప్పుడె అంబులెన్స్ లు సకాలంలో రోగులను ఆసుపత్రికి చేరుస్తుంటాయి. అయితే కొండ ప్రాంతాల్లో, మారుమూల గ్రామాల్లో అంబులెన్స్‌లో లేకపోవడంతో ఇప్పటికీ రోగులను సకాలంలో ఆసుపత్రికి చేర్చలేక ప్రాణాలు కాపాడలేకపోతున్నాం. ఈ క్రమంలో కొత్త కొత్త అంబులెన్స్‌లను, వివిధ రూపాల్లో అన్ని వర్గాలకు అందుబాటులో ఉండే వాటిని తయారు చేస్తూనే ఉన్నారు. ఇలా వచ్చిందే బైక్ అంబులెన్స్.. దాని కంటే మరింత మెరుగ్గా సైకిల్ అంబులెన్స్‌ను తయారు చేశాడు పదవ తరగతి విద్యార్ధి.
గుంటూరు జిల్లా కొల్లిపర మండలం అత్తోటకు చెందిన గోవర్ధన నాయుడు జిల్లా పరిషత్ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నాడు. సైన్స్ టీచర్ రాయపాటి శివనాగేశ్వరావు గైడ్ గా వ్యవహరించగా గోవర్ధన నాయుడు సైకిల్ అంబులెన్స్‌ను తయారు చేశాడు. కొండ ప్రాంతాల్లో వినియోగించేందుకు వీలుగా ఈ సైకిల్ బైస్కిల్ ను రూపొందించాడు. కేవలం పది వేల రూపాయల ఖర్చుతో సైకిల్ అంబులెన్స్‌ను తయారు చేశాడు. సైకిల్ కు వెనుక భాగంలో ఒక స్ట్రెచర్ కు రెండు చక్రాలు అమర్చాడు. ఎండ వాన తగలకుండా దాని రూఫ్ ను అమర్చాడు. అంతేకాకుండా దానిలోనే ఒక ప్రథమిక చికిత్స చేసే కిట్, ఆక్సిజన్ సిలిండర్, పల్స్ మీటర్, బిపి మిషన్ ఉంటాయి. వీటితో పాటు సోలార్ తో పనిచేసే ఫ్యాన్, సైరన్, లైట్లు కూడా అమర్చాడు. ఇవన్నీ తన గైడ్ శివనాగేశ్వరావు టీచర్స్ ప్రోత్సాహంతో రూపొందించి మెరుగులు దిద్దారు.
ఈ మోడల్ ఇన్ స్పైర్ కార్యక్రమంలో జాతీయ స్థాయిలో బహుమతి సాధించింది. కేంద్రం మంత్రి జితేంద్ర సింగ్ చేతులుగా మీదుగా అవార్డు కూడా అందుకున్నాడు. త్వరలో జపాన్ లో జరగనున్న సైన్స్ ప్రదర్శనలో తన మోడల్ ప్రదర్శించే అనుమతి పొందాడు. దీనిపై పాఠశాలలో తోటి విద్యార్ధులు, తల్లిదండ్రులు, టీచర్లు సంతోషం వ్యక్తం చేశారు.
మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.