AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Spiritual Tips: ప్రతి శుక్రవారం ఇలా చేస్తే.. ఇంట్లో డబ్బు నిలుస్తుంది!

మహాలక్ష్మి దేవి అనుగ్రహం కోసం అనేక రకాలుగా పూజలు చేస్తారు. లక్ష్మీ దేవి అనుగ్రహం ఉంటే ఆ ఇంట సిరుల పంటే. తినడానికి, డబ్బుకు లోటు ఉండదు అంటారు. అందుకే ఆ అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి నానా తిప్పలు పడతారు. ముఖ్యంగా శుక్రవారం అంటే అమ్మావారికి ప్రీతికరమని ఆ రోజు మహిళలందరూ తమ శక్తి కొలదీ పూజలు చేస్తూంటారు. అయితే లక్ష్మీ దేవికి అలంకారం అంటే చాలా ఇష్టం. కాబట్టి ఇంట్లో ఉండే మహిళలు కూడా చక్కగా ఉంటే ఆవిడకు..

Spiritual Tips: ప్రతి శుక్రవారం ఇలా చేస్తే.. ఇంట్లో డబ్బు నిలుస్తుంది!
Lord Lakshmi
Chinni Enni
| Edited By: Ravi Kiran|

Updated on: Oct 13, 2023 | 6:36 AM

Share

మహాలక్ష్మి దేవి అనుగ్రహం కోసం అనేక రకాలుగా పూజలు చేస్తారు. లక్ష్మీ దేవి అనుగ్రహం ఉంటే ఆ ఇంట సిరుల పంటే. తినడానికి, డబ్బుకు లోటు ఉండదు అంటారు. అందుకే ఆ అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి నానా తిప్పలు పడతారు. ముఖ్యంగా శుక్రవారం అంటే అమ్మావారికి ప్రీతికరమని ఆ రోజు మహిళలందరూ తమ శక్తి కొలదీ పూజలు చేస్తూంటారు. అయితే లక్ష్మీ దేవికి అలంకారం అంటే చాలా ఇష్టం. కాబట్టి ఇంట్లో ఉండే మహిళలు కూడా చక్కగా ఉంటే ఆవిడకు నచ్చుతుందట. అయితే తంత్ర శాస్త్రంలో, సంపదను సంపాదించడానికి కొన్ని రకాల సాధారణమైన పద్ధలు ఉన్నాయని చెప్పబడ్డాయి. వాటిని క్రమం తప్పకుండా అనుసరిస్తే కనుక.. వారి ఇంట సంపదకు అస్సలు లోటు ఉండదని ఆ శాస్త్రంలో వివరించారు. మరి అవేంటో తెలుసుకుందాం.

పసుపు వస్త్రంలో టెంకాయను కట్టండి:

శుక్రవారం రోజను ఓ కొత్త పసుపు వస్త్రం తీసుకుని చిన్న కొబ్బరికాయను కట్టి వంట గది తూర్పు మూలలో వేలాడేలా ఉంచండి. ఇలా చేయడం ద్వారా ఆ ఇంట్లో డబ్బుకు, తిండికి లోటు ఉండదు.

ఇవి కూడా చదవండి

నెయ్యి దీపం:

ఇంట్లో సంపద పెరగాలంటే ప్రతి శుక్రవారం నెయ్యి దీపం వెలిగించండి. లక్ష్మీ దేవికి రెండు ముఖాల నెయ్యి దీపం వెలిగించి పూజించాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు.

తామర పువ్వులతో పూజ:

లక్ష్మీ దేవికి తామర పువ్వులన్నీ ఇష్టమే. కనుక శుక్రవారం రోజు లక్ష్మీ దేవిని తామర పువ్వులతో పూజిస్తే మంచి ఫలితాలు ఉంటాయి.

మల్లె పూల మాల:

అమ్మవారికి సువాసనతో కూడినవి అంటే చాలా ఇష్టం. మల్లె పూల నుంచి కూడా మంచి సువాసన వెదజల్లుతుంది. కాబట్టి ప్రతి శుక్రవారం మల్లెపూలతో అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది.

గంధం:

పని, వ్యాపారంలో రెట్టింపు అభివృద్ధి కావాలంటే.. ప్రతి శుక్రవారం బయటకు గంధంతో అమ్మవారిని పూజించాలి.

ఆవుకి గడ్డి, బెల్లం తినిపించాలి:

లక్ష్మీ దేవి అమ్మవారి అనుగ్రహం కలగాలంటే ప్రతి శుక్ర వారం ఆవుకు గడ్డి, బెల్లాన్ని ఆహారంగా ఇవ్వాలి. ఇలా చేస్తే లక్ష్మీ దేవి అనుగ్రమం తొందరగా కలుగుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.