Vastu Tips: ఇంట్లో ఇలాంటివి ఉంటే దుష్ట శక్తులు దరిచేరకుండా ఉంటాయి!

ఇంటిని అందంగా ఉంచుకోవాలని ఎవ్వరికైనా ఉంటుంది. ముఖ్యంగా మగువలు అయితే ఎక్కడికి వెళ్లినా.. ఇంట్లోకి డెకరేషన్ ఐటెమ్స్ ఏవో ఒకటి కొంటూనే ఉంటారు. తీసుకొచ్చి ఇంట్లో అలంకరిస్తారు. డెకరేషన్ ఐటెమ్స్ తో ఇంటికి ఒక కొత్త కళ వస్తుంది. ఇల్లు కూడా చూడానికి అందంగా కనిపిస్తుంది. అయితే కొన్ని రకాల వస్తువులను మాత్రం వాస్తు ప్రకారం కొన్ని చోట్ల మాత్రమే పెట్టాలి. ఇలా చేయడం వల్ల ఇంటికి అందంతో పాటు ఆనందం, సంపద కూడా వచ్చి చేరుతుంది. అయితే ఈ డెకరేషన్..

Vastu Tips: ఇంట్లో ఇలాంటివి ఉంటే దుష్ట శక్తులు దరిచేరకుండా ఉంటాయి!
Wind Chimes
Follow us
Chinni Enni

| Edited By: Ram Naramaneni

Updated on: Oct 13, 2023 | 7:06 PM

ఇంటిని అందంగా ఉంచుకోవాలని ఎవ్వరికైనా ఉంటుంది. ముఖ్యంగా మగువలు అయితే ఎక్కడికి వెళ్లినా.. ఇంట్లోకి డెకరేషన్ ఐటెమ్స్ ఏవో ఒకటి కొంటూనే ఉంటారు. తీసుకొచ్చి ఇంట్లో అలంకరిస్తారు. డెకరేషన్ ఐటెమ్స్ తో ఇంటికి ఒక కొత్త కళ వస్తుంది. ఇల్లు కూడా చూడానికి అందంగా కనిపిస్తుంది. అయితే కొన్ని రకాల వస్తువులను మాత్రం వాస్తు ప్రకారం కొన్ని చోట్ల మాత్రమే పెట్టాలి. ఇలా చేయడం వల్ల ఇంటికి అందంతో పాటు ఆనందం, సంపద కూడా వచ్చి చేరుతుంది. అయితే ఈ డెకరేషన్ ఐటెమ్స్ లోనే కొన్ని రకాల వస్తువలు ఇంట్లోకి దుష్ట శక్తు దరి చేరకుండా చేసే శక్తి ఉంది. వీటితో అదృష్టం కూడా వచ్చి చేరుతుంది. వీటిల్లో విండ్ చైమ్ కూడా ఒకటి. వీటిని ఖచ్చితంగా మీ ఇంట్లో ఉంచుకునే చూడండి.

విండ్ చైమ్ లేదా ఫెంగ్ షుయ్ ఇలాంటి వాటికి సానుకూల శక్తిని కలిగి ఉంటాయి. వీటిని ఇంట్లో పెట్టుకుంటే.. పురోగతితో పాటు అదృష్టం కూడా కలిసి వస్తుంది. వీటిని కార్యాలయాల్లో కూడా ఏర్పాటు చేసుకోవచ్చు.

ఇంట్లో ఏ దిశలో ఉంచాలి:

ఇవి కూడా చదవండి

విండ్, ఫెంగ్ చైమ్ ల నుంచి ఒక ప్రత్యేకమైన సౌండ్ వస్తుందన్న విషయం తెలిసిందే. ఇవి కేవలం డెకరేటీవ్ ఐటెమే కాకుండా ఇంటికి అదృష్టాన్ని తెచ్చి పెడతాయి. వీటిని కలప, ఇనుము వంటి వాటితో తయారు చేస్తారు కాబట్టి.. ఇవి ఇంటికి పశ్చిమ లేదా ఉత్తర దిశలో వేలాడదీస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే కలప, బంక మట్టితో చేసేవి అయితే ఇంటికి తూర్పు లేదా దక్షిణ దిశలలో పెట్టవచ్చు.

విండ్ చైమ్ పరిమాణం చిన్నగా ఉండాలి:

చాలా మంది బాగుంది కదా అని పెద్ద విండ్ చైమ్స్ ని తీసుకుంటారు. అలా కాకుండా చిన్న పరిమాణంలో ఉన్న విండ్ చైమ్స్ అయితే బెటర్.

విపత్తుల నుంచి రక్షిస్తుంది:

వీటిని మీ ఇల్లు లేదా ఆఫీసులో ఒకే లైన్ లో మూడు తలుపులు ఉంటే మధ్యలో ఐదు రాడ్ లతో ఉన్న విండ్ చైమ్ ని ఏర్పాటు చేయాలి. దీని వల్ల విపత్తులు, వ్యాధుల నుంచి రక్షిస్తుంది.

అదృష్టాన్ని కలిగిస్తుంది:

ఇంట్లో దుష్టశక్తులు దరి చేరకుండా అదృష్టాన్ని కలిగించాలంటే 7 లేదా 8 రాడ్లతో కూడిన విండ్ చైమ్ తీసుకోవడం ఉత్తమం.

దంపతుల మధ్య ప్రేమ పెరగాలంటే:

చాలా మంది విండ్ చైమ్స్ ని బెడ్ రూమ్ లో కూడా పెట్టుకుంటారు. ఇలా పెట్టడం ద్వారా అందమే కాదు.. ప్రేమ, సాన్నిహిత్యం కూడా పెరుగుతుంది. అయితే పడక గదిలో 9 రాడ్లతో కూడిన విండ్ చైమ్ ని ఏర్పాటు చేసుకోవాలి.

వ్యాధులు దరి చేరకుండా ఉండాలంటే:

ఇంట్లో వ్యాధులు దరి చేరకుండా.. ఆరోగ్యంగా ఉండాలంటే రెండు లేదా మూడు రాడ్ లతో కూడిన విండ్ చైమ్ లు బెస్ట్.

ఇంట్లో తగాదాలు రాకుండా ఉండాలంటే:

ఇల్లు లేదా షాపుల్లో శాంతిని నెలకొల్పడానికి రెండు లైదా మూడు రాడ్లతో ఉన్న విండ్ చైమ్ చాలా అనుకూలం. ఈ సంఖ్యలో విండ్ చైమ్ పెట్టడం వల్ల తగాదాలు రాకుండా ఉంటాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.

ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?