Viral: ఇదేం సరదా బ్రో.. పట్టుతప్పితే ప్రాణాలు గాల్లోనే..! వైరల్ అవుతున్న ఫన్ వీడియో.
ఒక్కొక్కరికీ ఒక్కో రకమైన సరదా ఉంటుంది.. అవి తీర్చుకునే క్రమంలో ఒక్కోసారి ప్రమాదాలను కొనితెచ్చుకుంటుంటారు. ఇటీవల సోషల్ మీడియాలో పాపులర్ అవ్వాలని కూడా కొందరు చిత్రవిచిత్రమైన సాహసాలు చేస్తూ ఆ వీడియోలను నెట్టింట పోస్ట్ చేస్తున్నారు. తాజాగా ఓ వ్యక్తి కదులుతున్న లారీలో ఊయల కట్టుకొని దానిపై ఊగుతున్న వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.
ఒక్కొక్కరికీ ఒక్కో రకమైన సరదా ఉంటుంది.. అవి తీర్చుకునే క్రమంలో ఒక్కోసారి ప్రమాదాలను కొనితెచ్చుకుంటుంటారు. ఇటీవల సోషల్ మీడియాలో పాపులర్ అవ్వాలని కూడా కొందరు చిత్రవిచిత్రమైన సాహసాలు చేస్తూ ఆ వీడియోలను నెట్టింట పోస్ట్ చేస్తున్నారు. తాజాగా ఓ వ్యక్తి కదులుతున్న లారీలో ఊయల కట్టుకొని దానిపై ఊగుతున్న వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతూనే ఇలాంటి సాహసాలతో ప్రాణాలమీదకు తెచ్చుకోవద్దంటూ ఆ వ్యక్తికి హిత బోధ చేస్తున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియోను చూస్తే.. రోడ్డుమీద ఓ లారీ వేగంగా దూసుకుపోతోంది. కదులుతున్న ఆ లారీ వెనుక భాగంలో ఓ వ్యక్తి మంచం వేసుకుని కూర్చున్నాడు. అతడి వెనకాల ఓ వ్యక్తి తాళ్లను ఉయ్యాలలా ఏర్పాటు చేసుకుని ముందుకూ, వెనక్కీ ఊగుతున్నాడు. ఆ లారీ వెనకాల వెళ్తున్న ఓ వ్యక్తి ఆ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దాంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఇప్పటికే మిలియన్ల మందికి పైగా వీక్షించారు. దాదాపు 5 లక్షల మంది లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఆ వీడియోను చూసి కొందరు ఎంజాయ్ చేస్తుంటే, మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ్ముడూ.. జాగ్రత్త.. తేడా వస్తే అడ్రస్ గల్లంతే అంటూ కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..