Gold Cleaning: బంగారు నగలను ఇలా క్లీన్ చేయండి.. కొత్త వాటిలా మెరుస్తాయ్!
బంగారు నగలు అంటే లేడీస్ పంచ ప్రాణాలు. బంగారు నగలను కొనడం ఒక ఎత్తు అయితే వాటిని కాపాడుకోవడం మరో ఎత్తు. ఇప్పుడు అంతకంతకూ బంగారం ధరలు పెరుగుపోతూనే ఉన్నాయి. మధ్య తరగతి వారికి కూడా అందనంత ఎత్తులో బంగారం ధరలు ఉన్నాయి. దీంతో బంగారాన్ని కొనాలంటేనే భయపడిపోతున్నారు ప్రజలు. ముఖ్యంగా పండుగలు, ఫంక్షన్లు, పార్టీల సమయంలో బంగారాన్ని ధరిస్తూంటారు మగువలు. ఈ విషయం పక్కకు పెడితే.. కొన్నప్పుడు తళతళమని..
బంగారు నగలు అంటే లేడీస్ పంచ ప్రాణాలు. బంగారు నగలను కొనడం ఒక ఎత్తు అయితే వాటిని కాపాడుకోవడం మరో ఎత్తు. ఇప్పుడు అంతకంతకూ బంగారం ధరలు పెరుగుపోతూనే ఉన్నాయి. మధ్య తరగతి వారికి కూడా అందనంత ఎత్తులో బంగారం ధరలు ఉన్నాయి. దీంతో బంగారాన్ని కొనాలంటేనే భయపడిపోతున్నారు ప్రజలు. ముఖ్యంగా పండుగలు, ఫంక్షన్లు, పార్టీల సమయంలో బంగారాన్ని ధరిస్తూంటారు మగువలు. ఈ విషయం పక్కకు పెడితే.. కొన్నప్పుడు తళతళమని మెరిసిపోయిన బంగారం.. వాడే కొద్ద వాటి మెరుపు తగ్గిపోతుంది. మెరుపు ఎట్టిద్దామని బంగారం షాపుకు తీసుకెళ్తే.. బంగారం ఎంతో కొంత కరగడం ఖాయం. మరి వాటిని ఎలా క్లీన్ చేసుకోవాలని లేడీస్ తెగ ఆలోచిస్తూంటారు. మీ కోసమే ఈ టిప్స్. మరి బంగారాన్ని ఎలా క్లీన్ చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
సోప్ వాటర్:
సోప్ వాటర్ తో బంగారాన్ని ఈజీగా క్లీన్ చేసుకోవడమే కాకుండా.. మెరిపించవచ్చు కూడా. ఒక చిన్న గిన్నెలోకి సగం వరకూ మధ్య వేడిగా ఉండే హాట్ వాటర్ తీసుకుని అందులో సోప్ వాటర్ తీసుకుని.. అందులో బంగారు నగనలు వేసి ఓ 15 నిమిషాల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత టూత్ బ్రష్ తో రుద్దుకోవాలి. ఆ నెక్ట్స్ కాటన్ క్లాత్ తీసుకుని.. తడంతా పోయేదాకా తుడిచి ఆరబెట్టి.. భద్ర పరుచుకోవాలి. ఇలా చేస్తే మీ బంగారు నగలు మళ్లీ కొత్త వాటినా మెరుస్తాయి.
టూత్ పేస్ట్:
టూత్ పేస్ట్ ఉపయోగించి కూడా బంగారు నగలను మెరిపించుకోవచ్చు. కొద్దిగా మీరు వాడుకునే టూత్ పేస్ట్ ని తీసుకుని.. దానితో నగలపై రుద్దండి. ఇలా చేస్తే వాటిపై ఉండే దుమ్ము, ధూళి పోయి మెరుస్తాయి. పేస్ట్ తో రుద్దిన తర్వాత నీటిలో వేసి శుభ్ర పరచాలి. ఆ తర్వాత కాటన్ క్లాత్ తో తుడుచుకోవాలి.
హాట్ వాటర్ తో క్లీన్ చేసుకోవచ్చు:
వేడి నీటిని మరగ బెట్టి.. వాటిలో ముంచేంత వరకు బంగారాన్ని ఓ పది నిమిషాలు అలా ఉంచాలి. ఆ తర్వాత టూత్ బ్రెష్ తో రుద్దితే.. మురికి పోయి.. కొత్త వాటిలా మెరుస్తాయి. ఆ తర్వాత కాటన్ క్లాత్ తో క్లీన్ చేసుకోవడమే.
స్టోన్స్ ఉంటే ఇలా క్లీన్ చేయండి:
స్టోన్స్, ముత్యాలు, పగడాలు, పచ్చలు, కెంపులు మొదలైన వాటితో తయారు చేసిన బంగారు ఆభరణాలు కూడా ఉంటాయి. వాటిని తేలిక పాటి షాంపూతో క్లీన్ చేసుకోవాలి. దీంతో వాటి కలర్ మారకుండా ఉంటాయి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.