మన జీవన శైలి బాగుంటేనే ఆరోగ్యంగా ఉండగలుగుతాము. మన శరీరంలో ప్రతి భాగం కూడా యాక్టివ్‌గా పని చేసినప్పుడే ఎలాంటి జబ్బులు రాకుండా ఉండేందుకు ఆస్కారం ఉంటుంది. అయితే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకున్నప్పుడే మెరుగైన జీవక్రియ ఉంటుంది. ఇక పాలు అంటే అందరికి ఇష్టమే. మన శరీరానికి పాల ఉత్పత్తులు ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్న మాట. పాల ద్వారా ఎన్నో ఉత్పత్తులు తయారవుతాయి. ఇక జున్న అంటే అందరికి తెలిసిందే. ఇది కూడా పాల ఉత్పత్తే. ఇది పాల ప్రోటీన్లను గడ్డకట్టడం ద్వారా తయారు చేయబడుతుంది. ఇది కాల్షియం, ప్రోటీన్, ఫాస్పరస్ , విటమిన్లు A , B12కు మంచి మూలం. అయితే, ఇందులో సంతృప్త కొవ్వు, సోడియం కూడా ఎక్కువగా ఉంటుంది.