- Telugu News Photo Gallery Cinema photos Nandamuri Balakrishna Ready To Hatric Hit after 30 years in Tollywood Telugu Heroes Photos
Nandamuri Balakrishna: 30 ఏళ్ళు తర్వాత రెండు వరస విజయాలు.. హ్యాట్రిక్‌పై కన్నేసినన బాలయ్య.
30 ఏళ్ళు.. 47 సినిమాలు.. ఏంటీ లెక్కలు అనుకుంటున్నారా..? వరసగా రెండు హిట్లు కొట్టడానికి బాలయ్య తీసుకున్న టైమ్ గ్యాప్ ఇది. వినడానికి విచిత్రంగా.. నమ్మడానికి కష్టంగా అనిపించినా ఇదే నిజం. కొన్నిసార్లు దగ్గరగా వచ్చారు కానీ గెలుపు తలుపుకి అడుగు దూరంలో ఆగిపోయారు బాలయ్య. మరిప్పుడు హ్యాట్రిక్ అందుకుంటారా..? ఆ రికార్డ్ భగవంత్ కేసరి కొడుతుందా..? ఏడాదికో సినిమా.. కుదిర్తే రెండు సినిమాలు చేయడం బాలయ్యకు ఎప్పట్నుంచో ఉన్న అలవాటు.
Updated on: Oct 14, 2023 | 5:50 PM

30 ఏళ్ళు.. 47 సినిమాలు.. ఏంటీ లెక్కలు అనుకుంటున్నారా..? వరసగా రెండు హిట్లు కొట్టడానికి బాలయ్య తీసుకున్న టైమ్ గ్యాప్ ఇది. వినడానికి విచిత్రంగా.. నమ్మడానికి కష్టంగా అనిపించినా ఇదే నిజం. కొన్నిసార్లు దగ్గరగా వచ్చారు కానీ గెలుపు తలుపుకి అడుగు దూరంలో ఆగిపోయారు బాలయ్య.

మరిప్పుడు హ్యాట్రిక్ అందుకుంటారా..? ఆ రికార్డ్ భగవంత్ కేసరి కొడుతుందా..? ఏడాదికో సినిమా.. కుదిర్తే రెండు సినిమాలు చేయడం బాలయ్యకు ఎప్పట్నుంచో ఉన్న అలవాటు. ఇప్పటికీ అదే దూకుడు చూపిస్తున్నారీయన. కానీ విజయాల విషయంలో మాత్రం కాస్త వెనకబడే ఉంటారు నటసింహం.l

హిట్ కొట్టినపుడు మాత్రం ఆ ఇంపాక్ట్ మరో రెండు మూడేళ్ళ వరకు ఉండేలా చూసుకుంటారు బాలయ్య. వీరసింహారెడ్డితో ఈ ఏడాది మాస్ మ్యాజిక్ చేసి చూపించారు ఈ సీనియర్ హీరో. వీరసింహారెడ్డి దాదాపు 120 కోట్లకు పైగానే గ్రాస్ వసూలు చేసింది. అఖండ కలెక్షన్లను కూడా దాటేసింది ఈ సినిమా.

ఫైనల్ రన్‌లో 79 కోట్లు షేర్ వసూలు చేసింది వీరసింహారెడ్డి. 3 దశాబ్ధాల తర్వాత బాలయ్య వరసగా రెండు హిట్లు కొట్టారంటే నమ్మడానికి చిత్రం అనిపిస్తుంది. చివరగా 1993-94 సమయంలో బంగారు బుల్లోడు, భైరవ ద్వీపంతో వరస హిట్స్ అందుకున్నారు బాలయ్య.

గత 30 ఏళ్ళలో 47 సినిమాలు చేసారు బాలయ్య. ఇన్నేళ్ళలో ఒక్కసారి కూడా రెండు వరస విజయాలు అందుకోలేదు. సమరసింహారెడ్డి తర్వాత వచ్చిన సుల్తాన్ యావరేజ్ దగ్గరే ఆగింది కానీ హిట్ కాదు. ఆ తర్వాత అలాంటి యావరేజ్ కూడా రాలేదు.

ఈ లోటు ఇన్నేళ్లకు అఖండ, వీరసింహారెడ్డిలతో తీరిపోయింది. అఖండ బ్లాక్‌బస్టర్ కాగా.. వీరసింహారెడ్డి బాగానే ఆడింది. ఇప్పుడు హ్యాట్రిక్‌పై కన్నేసారీయన. బాలయ్య దూకుడు చూస్తుంటే కచ్చితంగా ఆయన ఖాతాలో మూడో విజయం చేరిపోయేలాగే కనిపిస్తుంది.

పైగా అనిల్ రావిపూడి ట్రాక్ రికార్డ్.. బాలయ్య ప్రస్తుతం ఉన్న ఫామ్ చూస్తుంటే భగవంత్ కేసరి 100 కోట్లకు పైగా వసూలు చేయడం నల్లేరుపై నడకే. పాజిటివ్ టాక్ వచ్చిందంటే.. బాలయ్య విశ్వరూపం చూపిస్తారు. మరి చూడాలిక.. ఈయన హ్యాట్రిక్ అందుకుంటారో లేదో..?




