- Telugu News Photo Gallery Cinema photos Renu Desai hint on Akira Nandan First Movie Telugu Heroes Photos
Akira Nandan: అకీరా సినీ ఎంట్రీ పై బాంబ్ పేల్చిన రేణు దేశాయ్..! అదేనా ఫస్ట్ మూవీ..
అకీరా నందన్ ఎంట్రీ ఎప్పుడు..? జూనియర్ పవర్ స్టార్ డెబ్యూ ఎప్పుడు..? ఈ మధ్య అకీరా ఫోటోలు బయటికి వచ్చినప్పటి నుంచి పవన్ ఫ్యాన్స్‌లో ఈ ప్రశ్న ఎక్కువైపోయింది. కుర్రాడు కత్తిలా ఉన్నాడు.. ఇప్పుడో అప్పుడో వచ్చేలా ఉన్నాడంటూ వాళ్లకు వాళ్లే కలలు కనేసుకుంటున్నారు. కానీ అన్ని కలలకు ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నారు రేణు దేశాయ్. అసలింతకీ అకీరా వస్తారా రారా..? ఈ ఫోటోలు కొన్ని రోజులుగా సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
Updated on: Oct 14, 2023 | 5:50 PM

అకీరా నందన్ ఎంట్రీ ఎప్పుడు..? జూనియర్ పవర్ స్టార్ డెబ్యూ ఎప్పుడు..? ఈ మధ్య అకీరా ఫోటోలు బయటికి వచ్చినప్పటి నుంచి పవన్ ఫ్యాన్స్‌లో ఈ ప్రశ్న ఎక్కువైపోయింది.

కుర్రాడు కత్తిలా ఉన్నాడు.. ఇప్పుడో అప్పుడో వచ్చేలా ఉన్నాడంటూ వాళ్లకు వాళ్లే కలలు కనేసుకుంటున్నారు. కానీ అన్ని కలలకు ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నారు రేణు దేశాయ్. అసలింతకీ అకీరా వస్తారా రారా..? ఈ ఫోటోలు కొన్ని రోజులుగా సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

అందులో అకీరా లుక్ అదిరింది. లాంఛింగ్‌కు సిద్ధంగా ఉన్నారంటూ ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. అయితే రేణు దేశాయ్ మాత్రం ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ ఆశలకు ఫుల్ స్టాప్ పెడుతూనే ఉన్నారు.

అలాంటి ఆశలేం పెట్టుకోవద్దని చెప్తూనే ఉన్నారు.. ఇప్పుడూ మరోసారి అదే చేసారు రేణు దేశాయ్. ఈ మధ్య సోషల్ మీడియాలో యాక్టివ్ అయిన రేణు దేశాయ్.. ఇన్‌స్టాలో పవన్ గురించి పెద్ద స్టోరీ పెట్టి షాకిచ్చారు.

ఆయనంటే ఎప్పటికీ అదే గౌరవం ఉంటుందని.. రాజకీయంగానూ సపోర్ట్ చేస్తున్నానంటూ పెద్ద వీడియోనే పోస్ట్ చేసారు. ఇప్పుడేమో అకీరా నందన్ గురించి షాకింగ్ న్యూస్ చెప్పారు. అకీరాకు నటన అంటే అస్సలు ఇంట్రెస్ట్ లేదని బాంబ్ పేల్చారు.

అకీరా నందన్‌కు నటనపై ఆసక్తి లేదని.. హీరో కావాలని కూడా అనుకోవడం లేదని చెప్పారు. ప్రస్తుతం మ్యూజిక్‌తో పాటు ఫిల్మ్ ప్రొడక్షన్ కోర్స్ చేస్తున్నట్లు చెప్పారు రేణు దేశాయ్.

స్క్రిప్ట్స్ కూడా రాస్తున్నాడని.. తన ఫోకస్ అంతా క్రియేటివ్ జాబ్ వైపు ఉంది గానీ నటుడిగా మారాలని అనుకోవడం లేదని తేల్చేసారు రేణు. అయినా అకీరాకు 19 ఏళ్లేగా.. ఇంకా టైమ్ ఉంది వచ్చేస్తాడులే అంటూ సర్దుకుంటున్నారు ఫ్యాన్స్.




