- Telugu News Photo Gallery Cinema photos Actress Meera Jasmine New Hot photos Goes attractive in social media on 14 10 2023 Telugu Actress Photos
Meera Jasmine: మీరా జాస్మిన్ ఇంతగా రెచ్చిపోవడానికి కారణం ఏంటి..? హాట్ షో తో సెగలు..
మీరా జాస్మిన్.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఎందుకంటే ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేసింది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, రవితేజ లాంటి స్టార్ హీరోలతో నటించింది మీరా జాస్మిన్. ఎక్స్ పోజింగ్ కు దూరంగా ఉంటూ వీలైనంత వరకు ఫ్యామిలీ ఓరియెంటెడ్ క్యారెక్టర్స్ చేసింది ఈ భామ. అయితే సినిమాల నుంచి దూరం అయిపోయిన తర్వాత ఇప్పుడు రెచ్చిపోతుంది.
Praveen Vadla | Edited By: Anil kumar poka
Updated on: Oct 14, 2023 | 6:18 PM

మీరా జాస్మిన్.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఎందుకంటే ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేసింది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, రవితేజ లాంటి స్టార్ హీరోలతో నటించింది మీరా జాస్మిన్.

ఎక్స్ పోజింగ్ కు దూరంగా ఉంటూ వీలైనంత వరకు ఫ్యామిలీ ఓరియెంటెడ్ క్యారెక్టర్స్ చేసింది ఈ భామ. అయితే సినిమాల నుంచి దూరం అయిపోయిన తర్వాత ఇప్పుడు రెచ్చిపోతుంది.అది కూడా అలా ఇలా కాదు.. ఏకంగా నేటి జనరేషన్ హీరోయిన్లు కూడా పరేషాన్ అయ్యేలా అందాల ఆరబోతలో దూసుకుపోతుంది మీరా.

40ల్లోకి ఎంటర్ అయిన తర్వాత ఉన్నట్టుండి హాట్ షోకు తెరతీసింది మీరా జాస్మిన్. అసలు ఈమెలో ఈ రేంజ్ మార్పు ఎందుకు వచ్చింది అని అభిమానులు కూడా షాక్ అవుతున్నారు. హీరోయిన్ గా సినిమాలు చేస్తున్నప్పుడు మాత్రం హోమ్లిగా కనిపించి.. రిటైర్ అయిన తర్వాత రెచ్చిపోతుండడానికి అసలు కారణం ఏంటబ్బా అని అందరూ పరేషాన్ అవుతున్నారు.

దానికి మెయిన్ రీజన్ ఇంకోటి ఉంది అని తెలుస్తోంది. మీరా ప్రస్తుతం తెలుగు కంటే మిగిలిన భాషలపై ఎక్కువగా ఫోకస్ చేసింది. మరీ ముఖ్యంగా తన సొంత ఇండస్ట్రీ అయిన మలయాళంలో వరస సినిమాలు చేస్తుంది.

కాకపోతే ఇక్కడ మరో విషయం కూడా గమనించాలి.. ఈమె కేవలం బయట మాత్రమే గ్లామర్ షో చేస్తుంది.. సినిమాల్లోకి వచ్చేసరికి చాలా పద్ధతిగా కనిపిస్తోంది మీరా. ఈ లెక్కలు ఏంటో ఎవరికి అర్థం కావడం లేదు. సినిమాల్లో హోమ్లీ క్యారెక్టర్స్ చేస్తూ.. బయట మాత్రం రెచ్చిపోవడం వెనక అసలు అర్థం ఏంటబ్బా అని ఆరా తీస్తున్నారు నెటిజన్లు.

దీనికి ఒకటే కారణంగా కనిపిస్తుంది. మ్యాగజైన్స్ కవర్ పేజీల పైన ఇలా గ్లామర్ షో చేస్తే ఊహించని డబ్బులు వస్తాయి.. సినిమాలు చేసినా కూడా రాని రెమ్యూనరేషన్ కేవలం ఫోటోషూట్స్ కు ఇస్తుంటారు వాళ్ళు.

అందులోనూ ఇప్పటి వరకు గ్లామర్ షో చేయకుండా ఉన్న మీరా జాస్మిన్ లాంటి సీనియర్ హీరోయిన్లకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఈమె ఈ రేంజ్ లో రెచ్చిపోవడానికి బహుశా ఇది ఒక కారణం అయ్యి ఉండొచ్చు. మరొకటి అవకాశాల కోసం..! ఈమెకు కొందరు దర్శకుల నుంచి ఆఫర్స్ వచ్చినట్టు తెలుస్తుంది.

కాకపోతే అందులో గ్లామర్ షో చేయాలి అనే కండిషన్ కూడా పెట్టినట్టు ప్రచారం జరుగుతుంది. అందుకే ముందుగానే ఈమె దానికి సిద్ధం అన్నట్టు ఫోటోషూట్స్ చేస్తుంది. తాజాగా ఇన్స్టాగ్రామ్ లో మరో అదిరిపోయే ఫోటోషూట్ పెట్టింది ఈమె. అందులోనూ క్లీవేజ్ షో చేసింది. మరి ఈమె సెకండ్ ఇన్నింగ్స్ ఎలా ఉండబోతుందో చూడాలి.





























