Hair Tip: నెలరోజుల్లో బట్ట తలపై జుట్టు రావాలంటే ఇలా చేయండి!

ప్రస్తుతం ఇప్పుడున్న కాలంలో అందరూ ఎదుర్కొనే సమస్య జుట్టు రాలడం. పోషకాహారం లోపం వల్ల, వాతావరణ మార్పులు, మారిన లైఫ్ స్టైల్ విధానంతో జుట్టు అనేది ఎక్కువగా రాలుతూ ఉంటుంది. జుట్టు విపరీతంగా రాలడంతో చాలా మంది ఒత్తిడికి, మానసిక ఆందోళనకు గురవుతూంటారు. సాధారణంగా 50 నుంచి 100 వెంట్రుకలు వరకూ రాలుతూ ఉంటుంది. అంతకు మించి రాలితే మాత్రం జుట్టు బలహీనంగా ఉందని అర్థం చేసుకోవచ్చు. దీంతో కొంత మంది మార్కెట్లో ఉండే హెయిర్..

Hair Tip: నెలరోజుల్లో బట్ట తలపై జుట్టు రావాలంటే ఇలా చేయండి!
Hair Care Tips
Follow us
Chinni Enni

| Edited By: Ram Naramaneni

Updated on: Oct 13, 2023 | 7:06 PM

ప్రస్తుతం ఇప్పుడున్న కాలంలో అందరూ ఎదుర్కొనే సమస్య జుట్టు రాలడం. పోషకాహారం లోపం వల్ల, వాతావరణ మార్పులు, మారిన లైఫ్ స్టైల్ విధానంతో జుట్టు అనేది ఎక్కువగా రాలుతూ ఉంటుంది. జుట్టు విపరీతంగా రాలడంతో చాలా మంది ఒత్తిడికి, మానసిక ఆందోళనకు గురవుతూంటారు. సాధారణంగా 50 నుంచి 100 వెంట్రుకలు వరకూ రాలుతూ ఉంటుంది. అంతకు మించి రాలితే మాత్రం జుట్టు బలహీనంగా ఉందని అర్థం చేసుకోవచ్చు. దీంతో కొంత మంది మార్కెట్లో ఉండే హెయిర్ ఆయిల్స్, షాంపూస్ వంటివి వాడుతూంటారు. అయినా ఫలితం ఉండదు.

వీటితో ఉన్న సమస్యలు ఎక్కువ అవడం తప్పించి.. తగ్గదు. దీంతో డిప్రెషన్ కు లోనేయ్యే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు నిపుణులు. జుట్టు ఉన్న వారిక సంగతి పక్కకు పెడితే.. బట్టతలతో ఇంకొందరు మరింత బాధ పడుతూ ఉంటారు. ఇలాంటి సమస్య నుంచి బయట పడేందుకు కొత్తి మీర బాగా సహకరిస్తుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ రకంగా కొత్తి మీరను యూజ్ చేస్తే కనుక.. నెల రోజుల్లోనే బట్ట తలపై జుట్టు కూడా వస్తుందని, జుట్టు రాలడం తగ్గుతుందని ఆ అధ్యయనాల్లో వివరించారు. ఇంతకీ ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కొత్తి మీర నూనె:

ఇవి కూడా చదవండి

కొత్తి మీర నూనె తయారు చేయడానికి కొత్తి మీర, ఆలీవ్ ఆయిల్, కొబ్బరి నూనె కావాలి. ముందుగా కొత్తి మీరను మిక్సీలో వేసి బాగా పేస్ట్ లా రుబ్బుకోవాలి. ఆ తర్వాత ఈ పేస్ట్ నుంచి రసాన్ని తీసుకోవాలి. ఇందులో కోకోనట్ ఆయిల్, ఆలీవ్ ఆయిల్ సమపాలల్లో వేసి బాగా కలుపుకోవాలి. దీన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు బాగా పట్టించండి. ఇలా ఒక గంట తర్వాత.. తలస్నానం చేయాలి. ఇలా నెల రోజులు కొత్తి మీర నూనె ఉపయోగించడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది.

కొత్తి మీర విత్తనాలతో:

మూడు చెంచాల కొత్తి మీర విత్తనాలు (ధనియాలను) తీసుకుని మెత్తగా నూరి పొడిలా చేసుకోవాలి. ఈ పొడిని కొబ్బరి నూనెలో కలిపి తలకు రాసుకుండా.. రాలిన చోట తిరిగి వెంట్రుకలు పెరుగుతాయి. అలాగే జుట్టు రాలడం కూడా తగ్గుతుంది.

కొత్తి మీర వాటర్:

ఒక మంద పాటి పాత్ర తీసుకుని అందులో కొత్తి మీర, తగినన్ని నీళ్లు వేసుకుని.. స్టవ్ వెలిగించి ఓ 15 నిమిషాల పాటు బాగా మరిగించాలి. ఆ తర్వాత ఈ నీటిని వడకట్టు కోవాలి. ఈ నీరు బాగా చల్లారాక.. జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల దాకా అప్లై చేసి ఓ ఐదు నిమిషాలు మసాజ్ చేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తూ ఉంటే మంచి ఫలితం కనిపిస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.