AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pregnency Tips: గర్భవతిగా ఉండి ఆఫీసుకు వెళ్తున్నారా.. వీటిని ఖచ్చితంగా పాటించాల్సిందే!

తల్లిగా మారడం అనేది నిజంగానే ఒక వరం. గర్భవతిగా ఉన్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే గర్భం నిలబడం కష్టం. పాత కాలంలో అయితే గర్భవతులుగా ఉన్న స్త్రీలు ఇంటి పని చేసుకుని.. సమయం దొరికినప్పుడు నచ్చినవి తింటూ.. సరదగా చిన్న ఆటలు ఆడుకుంటూ టైమ్ స్పెండ్ చేసేవారు. కానీ ఇప్పుడున్న కాలం ప్రకారం ఈ ఉరుకుల పరుగుల జీవితంతో పరిగెత్తాల్సి వస్తుంది. దీంతో గర్భిణీలు కూడా ఆఫీసులకు వెళ్తున్నారు. అయితే ప్రెగ్నీసీలో మానసికంగా, శరీరకంగా అనేక మార్పులకు లోనవ్వాల్సి వస్తుంది. ఈ సమయంలో ఆడవారిలో అనేక మూడ్ స్వింగ్స్ ఉంటాయి. కోపం, నీరసం..

Pregnency Tips: గర్భవతిగా ఉండి ఆఫీసుకు వెళ్తున్నారా.. వీటిని ఖచ్చితంగా పాటించాల్సిందే!
Working During Pregnancy
Chinni Enni
| Edited By: Ram Naramaneni|

Updated on: Oct 14, 2023 | 6:16 PM

Share

తల్లిగా మారడం అనేది నిజంగానే ఒక వరం. గర్భవతిగా ఉన్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే గర్భం నిలబడం కష్టం. పాత కాలంలో అయితే గర్భవతులుగా ఉన్న స్త్రీలు ఇంటి పని చేసుకుని.. సమయం దొరికినప్పుడు నచ్చినవి తింటూ.. సరదగా చిన్న ఆటలు ఆడుకుంటూ టైమ్ స్పెండ్ చేసేవారు. కానీ ఇప్పుడున్న కాలం ప్రకారం ఈ ఉరుకుల పరుగుల జీవితంతో పరిగెత్తాల్సి వస్తుంది. దీంతో గర్భిణీలు కూడా ఆఫీసులకు వెళ్తున్నారు. అయితే ప్రెగ్నీసీలో మానసికంగా, శరీరకంగా అనేక మార్పులకు లోనవ్వాల్సి వస్తుంది. ఈ సమయంలో ఆడవారిలో అనేక మూడ్ స్వింగ్స్ ఉంటాయి. కోపం, నీరసం, అలసట, చిరాకు వంటివి కలుగుతాయి. కానీ కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే భయపడాల్సిన అవసరం లేదు. గర్భంతో ఉన్న లేడీస్ ఆఫీసులకు వెళ్లి పని చేయాల్సి ఉంటే.. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకోండి.

పౌష్టికాహారం తీసుకోవాలి:

ఆఫీసులకు వెళ్లే మహిళలు పౌష్టికాహారాన్ని తీుకోవాలి. ముఖ్యంగా మీ భోజనం ఆకు కూరలు, కూరగాయలు వంటివి ఉండాలి. అలాగే ఫోలిక్ యాసిడ్స్ వంటి ఫుడ్స్ కూడా ఉండేలా జాగ్రత్త పడాలి. మజ్జిగ లేదా ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ లు తీసుకోవడం మంచి ఛాయిస్. నీరు కూడా తాగుతూ ఉండాలి.

ఇవి కూడా చదవండి

జంక్ ఫుడ్ ని అవైడ్ చేయాలి:

సాధారణంగా ప్రెగ్నెన్సీలో ఫుడ్ క్రేవింగ్ ఉంటాయి. కొన్ని రకాల ఆహారాలను ఇష్టంగా తింటూ ఉంటారు. కానీ పనిలో ఉన్నప్పుడు వీలైనంత వరకూ జంక్ ఫుడ్ కి దూరంగా ఉండాలి. ఎందుకంటే వీటి వల్ల అనారోగ్య సమస్యలను ఎదుర్కొనాల్సి ఉంటుంది. కడుపులో తిప్పడం, వాంతులు అవడం వంటివి జరుగుతూ ఉంటాయి. తినాలనిపిస్తే ఏదో కొంచెం తిని సరిపెట్టుకోవడమే మంచిది.

బ్రేక్ తీసుకోవాలి:

మీరు ఆఫీసులో కూర్చొని పని చేస్తూ ఉంటే మాత్రం గంట లేదా రెండు గంటలకు ఓ చిన్న బ్రేక్ తీసుకోవడం ఉత్తమం. దీని వల్ల మీ మూడ్ అనేది మారుతుంది. ఇలాంటి సమయంలో కుదిరితే వర్క్ ఫ్రమ్ చేయడం బెటర్ ఆప్షన్ అని నిపుణులు చెబుతున్నారు.

ఒత్తిడి తీసుకోకూడదు:

పనిలో ఒత్తిడి అనేది కామన్ విషయం. కానీ మీరు గర్భంతో ఉన్నారు కాబట్టి.. వీలైనంత వరకూ స్ట్రెస్ ని తీసుకోకపోవడమే బెటర్. మీరు ఒక వేళ ఒత్తిడి ఫీల్ అయితే.. ఆ విషయాన్ని ఇతర ఉద్యోగులతో చర్చించడం బెటర్.

ఎక్కువ సేపు అలానే కూర్చోకూడదు:

సాధారణంగా గర్భంతో ఉన్నప్పుడు వెన్ను సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అందులోనూ మీరు పని చేస్తూ ఉంటే కనుక.. ఎక్కువ సేపు కూర్చోకూడదు. మధ్య మధ్యలో లేచి నడుస్తూ ఉండటం బెటర్.

స్నాక్స్ తీసుకుంటూ ఉండాలి:

ప్రెగ్నెంట్ గా ఉన్న లేడీస్ ఒకటేసారి ఆహారం తీసుకోవాలంటే కష్టం. కాబట్టి స్నాక్స్ తీసుకుంటూ ఉండాలి. మీ లంచ్ బాక్స్ లో పండ్లు, సలాడ్స్, చిరు తిళ్లు వంటికి ఉండేలా ప్యాక్ చేసుకోండి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.