AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Semiya Janthikalu: సేమియాతో జంతికలను ఇలా చేస్తే చక్కటి రుచి వస్తుంది!

తెలుగు సంప్రదాయ పండుగల్లో సంక్రాంతి పండుగ ఒకటి. సంక్రాంతి వచ్చిందే ఇల్లంతా సందడి నెలకొంటుంది. పిండి వంటలు, చుట్టాలతో సందడి వాతావరణం కనిపిస్తుంది. సంక్రాంతికి చేసే పిండి వంటల్లో జంతికలు కూడా ఒకటి. ఇవి ఎంతో టేస్టీ, కరకరలాడుతూ ఉంటాయి. వీటిని చేయాలంటే కాస్త కష్టమే కానీ.. రుచి మాత్రం భలేగా ఉంటుంది. సాధారణంగా జంతికలను బియ్యం పిండితో చేస్తూంటారు. పండుగల్లోనే కాకుండా..

Semiya Janthikalu: సేమియాతో జంతికలను ఇలా చేస్తే చక్కటి రుచి వస్తుంది!
Semiyta Janthikalu
Chinni Enni
| Edited By: |

Updated on: Oct 12, 2023 | 9:56 PM

Share

తెలుగు సంప్రదాయ పండుగల్లో సంక్రాంతి పండుగ ఒకటి. సంక్రాంతి వచ్చిందే ఇల్లంతా సందడి నెలకొంటుంది. పిండి వంటలు, చుట్టాలతో సందడి వాతావరణం కనిపిస్తుంది. సంక్రాంతికి చేసే పిండి వంటల్లో జంతికలు కూడా ఒకటి. ఇవి ఎంతో టేస్టీ, కరకరలాడుతూ ఉంటాయి. వీటిని చేయాలంటే కాస్త కష్టమే కానీ.. రుచి మాత్రం భలేగా ఉంటుంది. సాధారణంగా జంతికలను బియ్యం పిండితో చేస్తూంటారు. పండుగల్లోనే కాకుండా.. సాధారణంగా వీటిని స్నాక్స్ గా తీసుకుంటూ ఉంటారు. ఇవి ఇంట్లో ఉన్నాయంటే ఖాళీ అయ్యేంత వరకూ పోటీ పడి తింటూంటారు. అయితే ఎప్పుడూ ఒకే రకం కాకుండా ఇలా సేమియాలతో జంతికలను కూడా చేసుకోవచ్చు. ఇవి కూడా గుల్లగా, క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. సేమియాలతో మనం పాయసం, ఉప్మా, పులిహోర వంటి వాటిని చేస్తాం. కానీ జంతికలు ఎప్పుడూ, ఎక్కడా చూసి ఉండరు. మరి ఈ సేమియా జంతికలు ఎలా తయారు చేస్తారు? కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

సేమియా జంతికలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు:

సేమియాలు, బియ్యం పిండి, వాము, నువ్వులు, కారం, ఉప్పు, నూనె.

ఇవి కూడా చదవండి

తయారు చేయు విధానం:

సేమియా జంతికలు తయారు చేయాలంటే ముందుగా ఒక చిన్నపాటి గిన్నె తీసుకుని అందులో సేమియాలు వేసి ఓ రెండు, మూడు గంటల పాటు నాన నివ్వాలి. ఆ తర్వాత ఒక కడాయిలో నూనె వేడి చేసుకోవాలి. ఇలా నానిన సేమియాలను ఒక ఖాళీ పళ్లెం తీసుకుని అందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కారం, బియ్యం పిండి, వాము, నువ్వులు, ఉప్పు, కాస్త వేడి నూనె వేసి బాగా కలుపుకోవాలి. కావాల్సినన్ని నీళ్లు పోసుకుంటూ పిండిలా చేసుకోవాలి. ఇప్పుడు మీకు కావాల్సిన షేప్ లో జంతికల గొట్టాన్ని తీసుకుని.. దానికి నూనె రాసుకోవాలి.

ఆ తర్వాత ఈ గొట్టంలో పిండిని నింపుకుని వేడి నూనెలో జంతికల షేప్ లో వేసుకోవాలి. వీటిని రెండు వైపులా క్రిస్పీగా, ఎర్రగా వేయించుకోవాలి. ఆ తర్వాత ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. అంతే ఎంతో టేస్టీగా ఉండే సేమియా జంతికలు రెడీ. వీటికి గాలి తగలకుండా ఓ డబ్బాలో స్టోర్ చేసుకోండి. ఇవి చాలా రోజుల పాటు నిల్వ ఉంటాయి. వీటిని అందరూ ఇష్టంగా తింటారు. ఇంకెందుకు లేట్ ఈసారి మీరు కూడా జంతికలు చేసేటప్పుడు ఇలా ట్రై చేయండి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.

Follow Us
సన్న బియ్యం గరిష్ఠ ధరలు ఖరారు.. సోనా మసూరి కేజీ ధర ఎంతో తెలుసా..?
సన్న బియ్యం గరిష్ఠ ధరలు ఖరారు.. సోనా మసూరి కేజీ ధర ఎంతో తెలుసా..?
రాప్తాడు ఘటనపై డైరెక్టర్ వేణు ఉడుగుల రియాక్షన్..
రాప్తాడు ఘటనపై డైరెక్టర్ వేణు ఉడుగుల రియాక్షన్..
జడేజాకు వన్డేల్లో నో ప్లేస్? పుజారా మాటలతో మొదలైన కొత్త చర్చ
జడేజాకు వన్డేల్లో నో ప్లేస్? పుజారా మాటలతో మొదలైన కొత్త చర్చ
ఏసీ వేసిన కాసేపటికే అరుపులు కేకలు.. కనిపించింది చూసి పరుగో పరుగు
ఏసీ వేసిన కాసేపటికే అరుపులు కేకలు.. కనిపించింది చూసి పరుగో పరుగు
తెలుగులోనూ RRB స్టేషన్ మాస్టర్ ఉద్యోగాలకు రాత పరీక్ష.. ఎంపిక ఇలా
తెలుగులోనూ RRB స్టేషన్ మాస్టర్ ఉద్యోగాలకు రాత పరీక్ష.. ఎంపిక ఇలా
ఇలాంటి వాళ్లతో జాగ్రత్త.. మాయలో పడ్డారో అంతే సంగతులు..
ఇలాంటి వాళ్లతో జాగ్రత్త.. మాయలో పడ్డారో అంతే సంగతులు..
దీపావళికి ముందే పెరిగిన గ్యాస్ సిలిండర్ల ధరలు.. ఎంతంటే..?
దీపావళికి ముందే పెరిగిన గ్యాస్ సిలిండర్ల ధరలు.. ఎంతంటే..?
నాలుగు ఆవులు.. ముగ్గురు అన్నదమ్ములకు ఎలా పంచాలి..? చిక్కుప్రశ్న
నాలుగు ఆవులు.. ముగ్గురు అన్నదమ్ములకు ఎలా పంచాలి..? చిక్కుప్రశ్న
సీనియర్ సిటిజన్ల కోసం కేంద్రం అద్బుత స్కీమ్
సీనియర్ సిటిజన్ల కోసం కేంద్రం అద్బుత స్కీమ్
ఏపీలో కొనసాగుతున్న మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌.. లైవ్ వీడియో
ఏపీలో కొనసాగుతున్న మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌.. లైవ్ వీడియో