kitchen hacks: ఇలా నిల్వ చేస్తే కోడి గుడ్లు ఎక్కువ రోజులు ఫ్రెష్ గా ఉంటాయి!

కోడి గుడ్లు ఆరోగ్యానికి ఎంతో హెల్దీ అన్న విషయం తెలిసిందే. రోజుకో కోడి గుడ్డు తింటే ఆస్పత్రికి వెళ్లాల్సిన అవసరం లేదని ఆరోగ్య నిపుణులే చెబుతున్నారు. కోడి గుడ్డు రోజూ క్రమం తప్పకుండా తింటే ఎన్నో అనారోగ్య సమస్యలు దరి చేరకుండా ఉంటాయి. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కోడి గుడ్లలో ప్రోటీన్, క్యాల్షియం, విటమిన్స్, మినరల్స్ వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. పిల్లలు, పెద్దలు ఎవరైనా రోజుకు కనీసం ఒక గుడ్డు తినాలి. కోడి గుడ్డును ఉడక బెట్టుకుని తింటేనే ఆరోగ్య..

kitchen hacks: ఇలా నిల్వ చేస్తే కోడి గుడ్లు ఎక్కువ రోజులు ఫ్రెష్ గా ఉంటాయి!
Eggs
Follow us
Chinni Enni

| Edited By: Ram Naramaneni

Updated on: Oct 12, 2023 | 9:53 PM

కోడి గుడ్లు ఆరోగ్యానికి ఎంతో హెల్దీ అన్న విషయం తెలిసిందే. రోజుకో కోడి గుడ్డు తింటే ఆస్పత్రికి వెళ్లాల్సిన అవసరం లేదని ఆరోగ్య నిపుణులే చెబుతున్నారు. కోడి గుడ్డు రోజూ క్రమం తప్పకుండా తింటే ఎన్నో అనారోగ్య సమస్యలు దరి చేరకుండా ఉంటాయి. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కోడి గుడ్లలో ప్రోటీన్, క్యాల్షియం, విటమిన్స్, మినరల్స్ వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. పిల్లలు, పెద్దలు ఎవరైనా రోజుకు కనీసం ఒక గుడ్డు తినాలి. కోడి గుడ్డును ఉడక బెట్టుకుని తింటేనే ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువ. ఆమ్లెట్ గా తిన్నా పర్వాలేదు. రోజూ జిమ్ కి వెళ్లే వారు సైతం గుడ్లను తింటూంటారు. వ్యాయామం చేసే వారు కూడా కోడి గుడ్డును తీసుకోవడం ఉత్తమం. అయితే చాలా మంది గుడ్లను ఒకేసారి ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేస్తారు. కానీ కోడి గుడ్లు ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. ఎగ్స్ ఎక్కువ రోజులు ఫ్రెష్ గా, నిల్వ ఉండాలంటే కొన్ని టిప్స్ పాటించాలి.

ఫ్రిజ్ లో నిల్వ చేయకూడదు:

చాలా మంది గుడ్లను ఫ్రిజ్ లో స్టోర్ చేస్తూ ఉంటారు. కానీ ఇది తప్పు. గుడ్ల షెల్, లోపల సాల్మెనెల్లా అనే బ్యాక్టీరియా ఉంటుంది. ఫ్రిజ్ లో పెడితే ఈ బ్యాక్టీరియా గుడ్డుపైనే కాకుండా మిగతా పదార్థాలపై కూడా వ్యాపిస్తుంది. కాబట్టి గుడ్లను ఫ్రిజ్ లో స్టోర్ చేయకపోవడమే బెటర్ నిపుణులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఫ్రెష్ గా ఉండాలంటే:

గుడ్లు ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే కదపకుండా ఉంచాలి. దీంతో ఖాళీగా, వెడల్పుగా ఉండే భాగంలో ఉంచాలి. అలాగే గుడ్లపై మూత పెట్టాలి. దీంతో గుడ్లు కదలకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. పాతకాలంలో అయితే ఒక ఖాళీ పాత్రలో గడ్డి వేసి అందులో గుడ్లను నిల్వ చేసేవారు.

ఆయిల్ రాయవచ్చు:

గుడ్లు ఎక్కువ కాలం ఫ్రెష్ గా, నిల్వ ఉండాలంటే.. మనం వంటకు వాడే ఆయిల్ ను గుడ్డు పెంకుపై అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల గుడ్లు తొందరగా పాడవ్వకుండా ఉంటాయి.

టిష్యూ పేపర్స్ లో పెట్టండి:

గుడ్లు ఎక్కు రోజులు పాడవ్వకుండా నిల్వ ఉండాలంటే గుడ్లను ఒక్కో టిష్యూ పేపర్ లో చుట్టి భద్ర పరచండి. ఇలా చేయడం వల్ల గుడ్లు ఎక్కువ రోజులు ఫ్రెష్ గా ఉంటాయి.

ఇలా చిన్న చిన్న టిప్స్ పాటించడం వల్ల గుడ్లు చెడిపోకుండా.. ఎక్కువ రోజులు, ఫ్రెష్ గా నిల్వ ఉంటాయి. కానీ ఫ్రిజ్ లో మాత్రం స్టోర్ చేయకండి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.

అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న శబరిమల ఆలయం
అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న శబరిమల ఆలయం
పార్లమెంటులోనే బిల్లు చింపేసి ఎంపీ డ్యాన్స్
పార్లమెంటులోనే బిల్లు చింపేసి ఎంపీ డ్యాన్స్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
తనను కలిసేందుకు వచ్చిన దివ్యాంగురాలితో వరుణ్ ముచ్చట్లు.. వీడియో
తనను కలిసేందుకు వచ్చిన దివ్యాంగురాలితో వరుణ్ ముచ్చట్లు.. వీడియో