Tips for Oiling Your Hair: జుట్టుకు నూనె రాసే క్రమంలో ఈ తప్పులను అస్సలు చేయకండి!

జుట్టు ఒత్తుగా, పొడుగ్గా అందంగా ఉండాలని అనుకోని వారుండరు. జుట్టు వలనే మనకు అందం మరింత రెట్టింపు అవుతుంది. రక రకాల హెయిర్ స్టైల్స్ వల్ల మరింత బ్యూటీగా కనిపిస్తారు. కేశ సంరక్షణలో భాగంగా జుట్టుకు నూనె రాసుకోవడం ఒకటి. జుట్టుకు నూనె రాసుకోవడం చాలా మంచిది. దీని వల్ల జుట్టు సాఫ్ట్ గా, షైనీగా, తేమగా, తెల్ల బడకుండా ఉంటుంది. అందులోనూ జుట్టుకు కొబ్బరి నూనె రాసుకోవడం వల్ల మరిన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఇందులో ఉండే పోషకాలు జుట్టును..

Tips for Oiling Your Hair: జుట్టుకు నూనె రాసే క్రమంలో ఈ తప్పులను అస్సలు చేయకండి!
Oil Tips
Follow us
Chinni Enni

| Edited By: Ram Naramaneni

Updated on: Oct 12, 2023 | 9:56 PM

జుట్టు ఒత్తుగా, పొడుగ్గా అందంగా ఉండాలని అనుకోని వారుండరు. జుట్టు వలనే మనకు అందం మరింత రెట్టింపు అవుతుంది. రక రకాల హెయిర్ స్టైల్స్ వల్ల మరింత బ్యూటీగా కనిపిస్తారు. కేశ సంరక్షణలో భాగంగా జుట్టుకు నూనె రాసుకోవడం ఒకటి. జుట్టుకు నూనె రాసుకోవడం చాలా మంచిది. దీని వల్ల జుట్టు సాఫ్ట్ గా, షైనీగా, తేమగా, తెల్ల బడకుండా ఉంటుంది. అందులోనూ జుట్టుకు కొబ్బరి నూనె రాసుకోవడం వల్ల మరిన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఇందులో ఉండే పోషకాలు జుట్టును మరింత అందంగా కనిపించేలా చేస్తాయి. జుట్టు రాలకుండా, బలంగా ఉంటుంది. హెయిర్ రాలకుండా ఉంటుంది. అలాగే మెత్తగా, మెరుస్తూ ఉంటుంది. అయితే మీరు జుట్టుకు రాసుకునే ముందు మంచి కొబ్బరి నూనెను ఎంచుకోవాలి.

మరికొంత మంది బాదం హెయిర్ ఆయిల్ ని వాడుతూంటారు. ఇది కాస్త ఖరీదు ఎక్కువే కానీ.. ప్రయోజనాలు మాత్రం అద్భుతంగా ఉంటాయి. బాదం నూనె వాడటం వల్ల జుట్లు బలంగా, ఒత్తుగా తయారవుతుంది. జుట్టు రాలే సమస్య కూడా తగ్గుతుంది. ఇలా ఆలీవ్ ఆయిల్, నువ్వుల నూనె, ఆముదం ఏదైనా తలకు రాసుకోవచ్చు. వీటి వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. అయితే చాలా మంది తలకు నూనె రాసుకునే సమయంలో అనేక తప్పులను చేస్తూంటారు. ఇలా చేయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉండటం కాక.. మరిన్ని సమస్యలు ఎదురవుతాయి.

రోజుల తరబడి ఉంచేస్తారు:

ఇవి కూడా చదవండి

చాలా మంది నూనెను తలకు రాసుకుని రోజుల తరబడి అలానే ఉంచేస్తారు. ఒకటి, రెండు రోజులు పర్వాలేదు కానీ.. వారం రోజులు అలా ఉంచితే.. తలపై ఫంగల్ ఇన్ ఫెక్షన్స్ ఎక్కువ అవుతాయి. దీని వల్ల చుండ్రు, జుట్టు నిర్జీవంగా, బలహీనంగా తయారవుతుంది.

పడుకునే ముందు రాసుకుంటే:

చాలా మంది రాత్రి పడుకునే ముందు నూనెను రాసుకుంటారు. ఇలా చేయడం వల్ల తలపై ఫంగల్ ఇన్ ఫెక్షన్స్ పెరుగుతాయి. ఆ నూనె అంతా దిండుకు అంటుకుని ముఖంపై పింపుల్స్, నల్లటి మచ్చలు వచ్చేలా చేస్తాయి. దీంతో ముఖం కూడా పాడవుతుంది. కాబట్టి రాత్రి పడుకునే ముందు నూనె రాసుకోకూడదు.

గట్టిగా రుద్దకూడదు:

నూనె రాసుకునేటప్పుడు చాలా మంది గట్టిగా రుద్దుతారు. ఇలా చేయడం వల్ల జుట్టు దెబ్బతింటుంది. మృదుత్వాన్ని కోల్పోయి.. రఫ్ గా మారుతుంది. దీంతో జుట్టు రాలడం, చిట్లడం వంటి సమస్యలు ఎదుర్కొనాల్సి వస్తుంది. కాబట్టి జుట్టుకు నూనె రాసుకుంటే.. సున్నితంగా రాసుకోవాలి.

మర్దనా చేసుకోవడం:

కొంత మంది జట్టుకు ఆయిల్ రాసేటప్పుడు మర్దనా చేసుకుంటూ ఉంటారు. గట్టిగా రుద్దుకుంటూ చేస్తారు. ఇలా అస్సలు చేయకూదు. మెల్లగా వేళ్లతో మర్దనా చేసుకోవాలి. ఇలా చేస్తే తలపై బ్లడ్ సర్క్యులేషన్ కూడా పెరుగుతుంది. అలాగే రిలాక్స్ గా ఉంటుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.

జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఈడో జాతిరత్నం.. ఆణిముత్యం.. డాక్టర్ అంటే ఇతనట.. చదివితే మీరూ
ఈడో జాతిరత్నం.. ఆణిముత్యం.. డాక్టర్ అంటే ఇతనట.. చదివితే మీరూ