AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Low Blood Pressure: లో బ్లడ్ ప్రెజర్ తో ఇబ్బంది పడుతున్నారా.. ఈ ఫుడ్స్ మీకు బాగా హెల్ప్ చేస్తాయి!

హైబీపీ ఉండటం సర్వ సాధారణమైన విషయం. కానీ కొంత మందికి లో బీపీ ఉంటుంది. లో బీపీనే కదా అని తీసి పారేయకూడదు. సాధారణంగా లో బీపీ అనేది ఆడవారిలో మాత్రమే ఎక్కుడా కనిపిస్తుంది. ఏదో నీరసంగా ఉండి అలా వస్తుంది అనుకుంటే మాత్రం పొరపాటే. లో బీపీ వల్ల రక్తం సరఫరా ఒక్కోసారి పడిపోతుంది. సాధారణంగా డాయలిస్టోలిక్ ప్రెజర్ 95 mmHg దాటకూడదు. అలాగే సిస్టోలిక్ 140 mmHg కి పెరగకూడదు. ఇవి రెండూ చాలా తక్కువగా ఉంటే మాత్రం లోబీపీ ఉన్నట్లే. మనకు లోబీపీ ఉందా లేదా అనేది.. కొన్ని లక్షణాల బట్టి తెలుసుకోవచ్చు. ఉన్నట్టుండి తల తిరగడం, వాంతులు,..

Low Blood Pressure: లో బ్లడ్ ప్రెజర్ తో ఇబ్బంది పడుతున్నారా.. ఈ ఫుడ్స్ మీకు బాగా హెల్ప్ చేస్తాయి!
Low Blood Pressure
Chinni Enni
| Edited By: Ram Naramaneni|

Updated on: Oct 12, 2023 | 9:47 PM

Share

హైబీపీ ఉండటం సర్వ సాధారణమైన విషయం. కానీ కొంత మందికి లో బీపీ ఉంటుంది. లో బీపీనే కదా అని తీసి పారేయకూడదు. సాధారణంగా లో బీపీ అనేది ఆడవారిలో మాత్రమే ఎక్కుడా కనిపిస్తుంది. ఏదో నీరసంగా ఉండి అలా వస్తుంది అనుకుంటే మాత్రం పొరపాటే. లో బీపీ వల్ల రక్తం సరఫరా ఒక్కోసారి పడిపోతుంది. సాధారణంగా డాయలిస్టోలిక్ ప్రెజర్ 95 mmHg దాటకూడదు. అలాగే సిస్టోలిక్ 140 mmHg కి పెరగకూడదు. ఇవి రెండూ చాలా తక్కువగా ఉంటే మాత్రం లోబీపీ ఉన్నట్లే. మనకు లోబీపీ ఉందా లేదా అనేది.. కొన్ని లక్షణాల బట్టి తెలుసుకోవచ్చు. ఉన్నట్టుండి తల తిరగడం, వాంతులు, విరేచనాలు, అసలట, ఒత్తిడి, నీరసం, అలాగే పిరీయడ్స్ టైంలో మధ్య స్థాయి నుంచి తీవ్ర స్థాయి వరకూ బ్లీడింగ్ అవ్వడం, బీ12 విటమిన్ లోపం, ఇలా రక రకాల సమస్యలు ఎదురవుతాయి.

సింపుల్ గా చెప్పాలంటే.. శరీరంలో సరిపడా రక్తం లేకపోవడం వల్ల లోబీపీ ఎక్కువగా కనిపిస్తుంది. ఒక్కోసారి ఇలాంటి లక్షణాలు ఏమీ కనిపించకుండా.. కళ్లు తిరిగి కింద పడిపోతూంటారు. కాబట్టి ఒక్కోసారి ఆస్పత్రికి వెళ్లి చెక్ చేపించుకోవడం బెటర్. అలాగే మీ ఆహారంలో కొన్ని రకాల ఆహార పదార్థాలను చేర్చడం వల్ల ఈ లోపం నుంచి బయట పడవచ్చు.

తగినంత నీరు తీసుకుంటూ ఉండాలి:

ఇవి కూడా చదవండి

లోబీపీ బాధ పడేవారికి సడన్ గా తల తిరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కరు అయితే కింద పడిపోతూ ఉంటారు. బాడీ డీ హైడ్రేషన్ కు గురి కావడం వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది. కాబట్టి తగినంత నీరు తీసుకుంటూ ఉండాలి. నీరు తాగడం వల్ల రక్త ప్రసరణ జరుగుతూ ఉంటుంది.

హెర్బల్ టీలు:

కొన్ని మూలికా టీలు రక్త ప్రసరణను ప్రోత్సహిస్తాయి. అయితే రక్త పోటును పెంచడంలో కూడా హెల్ప్ చేస్తాయి. అల్లం లీ లేదా రోజ్మేరీ టీలు తాగితే లోబీపీని కంట్రోల్ చేస్తాయి.

ఉప్పునీరు:

లో బీపీతో ఇబ్బంది పడేవారు అప్పుడప్పుడు ఉప్పు నీటిని తాగడం వల్ల బీపీ అనేది తగ్గకుండా ఉంటుంది. అయితే ఈ టిప్ ని మాత్రం వైద్యున్ని సంప్రదించి సలహా తీసుకుని చేస్తే మంచిది. లేద అనుకుంటే చాలా కొద్ది మొత్తంలో ఉప్పు కలిపిన నీటిని తాగవచ్చు.

బీట్ రూట్ జ్యూస్:

బీట్ రూట్ జ్యూస్ లో నైట్రేట్ లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్త నాళాలను విస్తరించడానికి, రక్త పోటును పెంచడానికి హెల్ప్ చేస్తాయి.

కాఫీ, టీలు తాగినా రక్త పోటును పెంచుతాయి:

కాఫీ, టీలు తాగినా రక్త పోటును పెంచుతాయి. అయితే వీటిని సమపాల్లో తీసుకోవాలి. లేదంటే దుష్ఫ్రభాలను ఎదుర్కొనాల్సి ఉంటుంది. ఎందుకంటే వీటిల్లో కెఫిన్ ఎక్కువగా ఉంటుంది.

కొబ్బరి నీళ్లు:

సాధారణంగా కొబ్బరి నీళ్లలో ఎలక్ట్రోలైట్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి లోబీపీతో ఇబ్బంది పడేవారు కొబ్బరి నీళ్లు తాగడం శ్రేయస్కరం. ఇవి ఆరోగ్యానికి కూడా పెంపొందిస్తాయి. రక్త పోటును నిర్వహించడానికి హైడ్రేషన్ అవసరం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.