AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Super Foods for Eye Health: ఈ సూపర్ ఫుడ్స్ తింటే.. మీ కళ్లు అద్భుతంగా పని చేస్తాయ్!

మన శరీరంలో ప్రతి భాగం చాలా ముఖ్యమైనది. అందులోనూ కళ్లు మరింత ముఖ్యం. అందుకే 'సర్వేంద్రియానం నయనం ప్రధానం' అన్నారు పెద్దలు. కళ్లు ఎంతో సున్నితంగా ఉంటాయి. కళ్ల పట్ల చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ చాలా మంది ఈ విషయాన్ని చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు. అనవసరంగా గంటల తరబడి ఫోన్లు, ల్యాప్ టాప్ ల ముందు కూర్చుని కళ్లకు రక్షణ, రెస్ట్ లేకుండా చేస్తున్నారు. దీంతో కళ్ల రక్షణ కణాలు దెబ్బతింటున్నాయి. ఇప్పుడున్న లైఫ్ స్టైల్ ఆధారంగా చిన్నప్పటి నుంచే చాలా మంది చిన్నపిల్లలకు తొందరగా..

Super Foods for Eye Health: ఈ సూపర్ ఫుడ్స్ తింటే.. మీ కళ్లు అద్భుతంగా పని చేస్తాయ్!
Eye Health
Chinni Enni
|

Updated on: Oct 12, 2023 | 6:28 PM

Share

మన శరీరంలో ప్రతి భాగం చాలా ముఖ్యమైనది. అందులోనూ కళ్లు మరింత ముఖ్యం. అందుకే ‘సర్వేంద్రియానం నయనం ప్రధానం’ అన్నారు పెద్దలు. కళ్లు ఎంతో సున్నితంగా ఉంటాయి. కళ్ల పట్ల చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ చాలా మంది ఈ విషయాన్ని చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు. అనవసరంగా గంటల తరబడి ఫోన్లు, ల్యాప్ టాప్ ల ముందు కూర్చుని కళ్లకు రక్షణ, రెస్ట్ లేకుండా చేస్తున్నారు. దీంతో కళ్ల రక్షణ కణాలు దెబ్బతింటున్నాయి. ఇప్పుడున్న లైఫ్ స్టైల్ ఆధారంగా చిన్నప్పటి నుంచే చాలా మంది చిన్నపిల్లలకు తొందరగా సైట్ వచ్చేస్తుంది. ఇక సాఫ్ట్ వేర్ వర్క్, వర్క్ ఫ్రమ్ హోమ్, సిస్టమ్ వర్క్స్ చేసేవారు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. స్క్రీన్ ని అదే పలంగా గంటల తరబడి చూడటం వల్ల కళ్లపై ఎక్కువగా ఒత్తిడి పడుతుంది. కాబట్టి కళ్లను కూడా ఆరోగ్యంగా ఉంచుకోవాలి. కళ్ల ఆరోగ్యాన్ని పెంపొందించడంలో కేవలం క్యారెట్లు మాత్రమే కాదు.. ఇతర ఆహార పదార్థాలు కూడా ఉన్నాయి. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆకు కూరలు:

మీ కళ్లు ఎప్పుడూ ఆరోగ్యంగా, అందంగా ఉండాలంటే గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ తినడం చాలా బెస్ట్. వీటిల్లో కంటి ఆరోగ్యానికి అవసరమైన ఐరన్, విటమిన్లు అధికంగా ఉంటాయి. బచ్చలి కూర, కాలే, బ్రోకలీ కంటి చూపును బల పరుస్తాయి. కాబట్టి మీ ఆహారంలో వీటిని కూడా వారానికి ఒక్కసారైనా చేర్చుకుంటే మీ కళ్లు హెల్దీగా ఉంటాయి.

ఇవి కూడా చదవండి

రెడ్ బెల్ పెప్పర్స్:

రెడ్ బెల్ పెప్పర్స్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వీటి గురించి అందరికీ తెలుసు. దీనిలో ఉండే విటమిన్ సి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది కళ్లలోని రక్త నాళాలకు అద్భుతమైనవి. ఇది కంటి శుక్లం అభివృద్ధి చెందే ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా హెల్ప్ చేస్తుంది.

నట్స్ అండ్ సీడ్స్:

బాదం, వాల్ నట్స్, ఇతర అన్ని రకాల వాల్ నట్స్ లో విటమిన్స్ సి, ఈ, జింక్, ఒమేగా – 3 ఫ్యాటీ యాసిడ్స్ వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇవి కళ్లకు ఆక్సీకరణ నష్టం నుండి రక్షణ కల్పిస్తాయి.

కోడి గుడ్లు:

గుడ్లు కూడా కళ్లను హెల్దీగా ఉంచడంలో హెల్ప్ చేస్తాయి. రెటీనాను దెబ్బతీయకుండా హానికరమైన నీలి కాంతిని ఎదుర్కోవడంలో హెల్ప్ చేస్తుంది.

చిక్కుళ్లు లేదా బీన్స్:

వీటిల్లో ప్రోటీన్, ఫైబర్, తక్కువ కొవ్వు మూలం, కిడ్నీ బీన్స్ కంటి శుక్లం అభివృద్ధి చెందే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

కివీ:

కంటి ఆరోగ్యానికి మేలు చేసే పండ్లలో కివీ కూడా ఒకటి. అతినీల లోహిత కిరణాల నుండి కివీ మనల్ని రక్షిస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.