AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Danger Plants: ఈ మొక్కలను ఇంట్లో పెంచుతున్నారా.. చాలా జాగ్రత్తలు పాటించాల్సిందే!

ఇప్పుడు ఇళ్లల్లో మొక్కలను పెంచడం సర్వ సాధారణమైనది. ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ వీలైనంతగా మొక్కలతో నింపేస్తున్నారు. ఇంకొందరైతే బిల్డింగ్ ల పైన కూరగాయల పెంపకాన్ని సాగు చేస్తున్నారు. అలాగే ఆఫీసుల్లో కూడా మొక్కలను ఉంచుతున్నారు. మూడ్ మారడం కోసం, స్ట్రెస్ నుంచి రిలీఫ్ నెస్, గాలిని శుభ్రం చేయడానికి ఇలా కార్యాలయాల్లో కూడా రక రకాల మొక్కలను డెస్క్ లపై ఉంచి జాగ్రత్తగా చూసుకుంటున్నారు. అంతే కాకుండా ఇలా మొక్కలను చూడం వల్ల..

Danger Plants: ఈ మొక్కలను ఇంట్లో పెంచుతున్నారా.. చాలా జాగ్రత్తలు పాటించాల్సిందే!
danger Plants
Chinni Enni
| Edited By: Ram Naramaneni|

Updated on: Oct 12, 2023 | 9:51 PM

Share

ఇప్పుడు ఇళ్లల్లో మొక్కలను పెంచడం సర్వ సాధారణమైనది. ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ వీలైనంతగా మొక్కలతో నింపేస్తున్నారు. ఇంకొందరైతే బిల్డింగ్ ల పైన కూరగాయల పెంపకాన్ని సాగు చేస్తున్నారు. అలాగే ఆఫీసుల్లో కూడా మొక్కలను ఉంచుతున్నారు. మూడ్ మారడం కోసం, స్ట్రెస్ నుంచి రిలీఫ్ నెస్, గాలిని శుభ్రం చేయడానికి ఇలా కార్యాలయాల్లో కూడా రక రకాల మొక్కలను డెస్క్ లపై ఉంచి జాగ్రత్తగా చూసుకుంటున్నారు. అంతే కాకుండా ఇలా మొక్కలను చూడం వల్ల అందంగా ఉండటమే కాకుండా ఆకర్షణీయంగా కూడా కనిపిస్తాయి. ఇంటికి కొత్త కళను తెస్తాయి. దీంతో ఇల్లు అందంగా మారుతుంది. ఇది మంచి విషయమే అయినా.. కొన్ని రకాల మొక్కలతో చాలా జాగ్రత్తలు పాటించాలి. లేదంటే ఆ విషపూరిత మొక్కలు మన ప్రాణానికి హానిని కలిగిస్తాయి.

మొక్కల పెంపకాల వల్ల ప్రయోజనాలు ఉన్నా.. కొన్ని మొక్కల వల్ల అలర్జీలు, దురద, శ్వాస సంబంధిత సమస్యలను ఎదుర్కొనాల్సి వస్తుంది. కానీ ఈ సమస్యలు మొక్కల వల్ల అని మనకు తెలీదు. అందుకే కొన్ని రకాల మొక్కలను ఇళ్లల్లో, ఆఫీసుల్లో పెంచవద్దు. మరి ఆ మొక్కలు ఏంటి? వాటి వల్ల కలిగే అనర్థాలేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

మనీ ప్లాంట్:

ఇవి కూడా చదవండి

ఇప్పుడు ఈ మొక్కను ఇళ్లల్లో, ఆఫీసుల్లో పెంచేస్తున్నారు. ఎక్కడ చూసినా ఈ మొక్క మనకు దర్శనం ఇస్తూనే ఉంటుంది. ఈ మొక్కను పెంచుకోవడం వల్ల గాలి శుభ్ర పడుతుంది. అందుకే ఇది అందరి ఇళ్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. దీని వల్ల ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. ఈ ఆకులు తింటే మాత్రం వాంతులు, వికారం, విరేచనాలు అవుతాయి. శ్వాస కోశ సమస్యలు కూడా వస్తాయి. అయితే ఇంట్లో చిన్న పిల్లలు, పెంపుడు జంతువులు ఉంటే మరింత కేర్ తీసుకోవాలి. మనీ ప్లాంట్ ని పెంపుడు జంతువులు తిన్నా, నోట్లో పెట్టుకున్నా.. చాలా ప్రమాదం. కాబట్టి జాగ్రత్త వహించాలి.

Money Plant

కలబంద:

కలబంద వల్ల ఆరోగ్య ప్రయోజనాలే కాకుండా.. అందాన్ని కూడా రెట్టింపు చేసుకోవచ్చు. చాలా సౌందర్య సాధనాల్లో కూడా అలోవెరాను ఉపయోగిస్తారు. కలబంద గుజ్జు తింటే జీర్ణ సమస్యలు ఉండవన్న విషయం తెలిసిందే. అయితే దీన్ని ఎంతో జాగ్రత్తగా తీసుకోవాలి. కలబందలో పొరపాటును ఏ ఇతర భాగం తిన్నా.. అనారోగ్యం పాలుకాక తప్పదు.

బోన్సాయ్:

చూడగానే ఎట్రాక్ట్ చేసే వాటిల్లో ఈ బోన్సాయ్ మొక్క కూడా ఒక్కటి. ఇది చాలా చిన్నగా ఉండే వృక్షాలు. వీటి ఆకులు కూడా కలర్ ఫుల్ గా ఉండి ఆకర్షిస్తాయి. బయట రెస్టారెంట్లు, హోటల్స్ వీటిని చూసే ఉంటారు. అయితే వీటి వల్ల చర్మ సమస్యలు ఎక్కువగా వస్తాయి. ఈ చెట్టును తాకి చేతులు కడుక్కోకుండా ఒంటిపై పెట్టుకున్నా లేక ఆహార పదార్థాలు తిన్నా ప్రమాదమే అని చెబుతున్నారు నిపుణులు.

ఒలియాండర్:

ఈ మొక్కలు మన వీధిల్లో కూడా కనిపిస్తాయి. ఈ మొక్కల పువ్వులను పూజకు కూడా వాడుతూంటారు. కానీ ఇది చాలా విష పూరితమైన మొక్క. ఈ ప్లాంట్, పూల వల్ల వాంతులు, గుండె సమస్యలు, తలనొప్పి వంటివి వస్తాయి. ఈ మొక్కను ముట్టుకుంటే చేతులు ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలి. చిన్న పిల్లలు ఈ మొక్కను అస్సలు తాకుండా జాగ్రత్త పడాలి

సక్యులెంట్స్:

ఇప్పుడు ఈ మొక్కలు కూడా బాగా ఫేమస్ అయ్యాయి. ఇవి రెస్టారెంట్లు, హోటల్స్ లో ఎక్కువగా కనిపిస్తాయి. డెకరేషన్ పార్ట్స్ గా వీటిని ఉపయోగిస్తున్నారు. చాలా మంది ఇళ్లల్లో కూడా పెంచుకుంటున్నారు. ఇవి అందంగా ఉన్నా.. కీటకాలను, మీలీ బగ్స్ ని ఎక్కువగా ఆకర్షిస్తాయి. కాబట్టి వీటిని దూరంగా ఉంచుకుంటే చాలా బెటర్.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.