- Telugu News Lifestyle Eat cardamom on an empty stomach daily you will get permanent relief from these diseases Telugu News
రోజూ ఖాళీ కడుపుతో యాలకులు తింటే ఈ 4 ఆరోగ్య సమస్యలకు శాశ్వత పరిష్కారం.. ట్రై చేయండి..
యాలకుల రుచిని ఇష్టపడని వారుండరు. దీని ప్రత్యేకమైన రుచి ఆహార రుచిని పెంచుతుంది. దీనిని సాధారణంగా స్వీట్స్ తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తారు. డెజర్ట్‌లు, పలావ్, బిర్యానీ, హల్వాలో ఉపయోగిస్తారు. యాలకులలో పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. అందుకే రోజూ ఖాళీ కడుపుతో ఏలకులను తింటే త్వరగా బరువు తగ్గుతారని చెబుతారు.
Updated on: Oct 14, 2023 | 8:12 AM

ఏలకుల సహాయంతో, ఎంజైమ్‌ల స్రావం ప్రేరేపించబడుతుంది. ఇది జీర్ణక్రియలో సహాయపడుతుంది. ఏలకులు ప్రతిరోజూ తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం, కడుపు సంబంధిత సమస్యలు తగ్గుతాయి. జీర్ణవ్యవస్థను మెరుగు పరచడమే కాకుండా క్యాన్సర్ లాంటి వ్యాధుల్ని కూడా అడ్డుకుంటాయి. డిప్రెషన్ నుంచి బయట పడాలంటే యాలకుల టీకానీ, పాలుకానీ తాగితే సరిపోతుంది.

యాలకులు తినడం వల్ల రక్తనాళాల్లో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తుంది. గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

మన శరీరంలో టాక్సిన్స్ పేరుకుపోవడం ప్రారంభిస్తే, అవి అనేక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి. కానీ యాలకుల వినియోగం మూత్ర ప్రవాహాన్ని పెంచుతుంది. శరీరాన్ని నిర్విషీకరణ చేస్తుంది. ఇది మూత్రపిండాల పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. దీంతో కిడ్నీ సంబంధిత వ్యాధులు దూరమవుతాయి.

యాలకులను సహజ మౌత్ ఫ్రెషనర్‌గా ఉపయోగిస్తారు. దీన్ని రోజూ నమిలితే నోటి దుర్వాసన తొలగిపోయి నోరు తాజాగా ఉంటుంది.

యాలకుల సువాసన ఒత్తిడిని దూరం చేస్తుంది. చర్మంపై ఏర్పడే నల్ల మచ్చల్ని తగ్గిస్తుంది. వెంట్రుకలు చిట్లిపోవడం, ఊడిపోవడం వంటి సమస్యలన్నింటికీ యాలకులు చెక్ పెడతాయి. జుట్టు ఒత్తుగా బలంగా, కుదుళ్లు గట్టిగా ఉండేందుకు ఇవి దోహదపడుతాయి.





























