Upma Benefits: ఉప్మాను ఇలా తినడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా!

ఉప్మా అంటేనే ఆమడ దూరం పారిపోతారు. ఇంతకు ముందు పెళ్లిళ్లలో ఉదయం టిఫిన్ గా ఉప్మానే పెట్టేవారు. ఎందుకంటే ఇది ఈజీగా అయ్యే ఫుడ్ కాబట్టి. కానీ ఇప్పుడు ఎవరూ తినడం లేదని ఇడ్టీ, బజ్జీ, పూరీ వంటి వాటిని పెడుతున్నారు. ఇంట్లో మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ గా ఉప్మా చేస్తే.. టిఫిన్ చేయడం అయినా మానేస్తారు కానీ ఉప్మాను మాత్రం అస్సలు తినరు. కానీ ఉప్మాను తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే షాక్ అవ్వక తప్పదు. ఉప్మాలో మనం వెజిటేబుల్స్ తో పాటు అల్లం..

Upma Benefits: ఉప్మాను ఇలా తినడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా!
Upma Benefits
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Oct 15, 2023 | 6:16 PM

ఉప్మా అంటేనే ఆమడ దూరం పారిపోతారు. ఇంతకు ముందు పెళ్లిళ్లలో ఉదయం టిఫిన్ గా ఉప్మానే పెట్టేవారు. ఎందుకంటే ఇది ఈజీగా అయ్యే ఫుడ్ కాబట్టి. కానీ ఇప్పుడు ఎవరూ తినడం లేదని ఇడ్టీ, బజ్జీ, పూరీ వంటి వాటిని పెడుతున్నారు. ఇంట్లో మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ గా ఉప్మా చేస్తే.. టిఫిన్ చేయడం అయినా మానేస్తారు కానీ ఉప్మాను మాత్రం అస్సలు తినరు. కానీ ఉప్మాను తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే షాక్ అవ్వక తప్పదు. ఉప్మాలో మనం వెజిటేబుల్స్ తో పాటు అల్లం, కరివేపాకు, కొత్తి మీర వంటి హెల్దీ పదార్థాలే వాడుతాం. వీటి వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మరి అవేంటో ఓ లుక్ వేసేద్దాం రండి.

ఎముకలు దృఢంగా ఉంటాయి:

ఉప్మా తినడం వల్ల ఎముకలు గట్టి పడతాయి. ఉప్మాలో సాధారణమైంత గా కూరగాయలు, సుగంధ ద్రవ్యాలు ఉపయోగిస్తారు కాబట్టి.. ఇది తినడం వల్ల ఎముకలు బలంగా ఉంటాయి.

ఇవి కూడా చదవండి

అన్ని పోషకాలు లభిస్తాయి:

ఉప్మాను ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారు. కానీ ఇందులో ఉపయోగించే ఇంగ్రీడియన్స్ మాత్రం సేమ్ ఉంటాయి. అల్లం, క్యారెట్, బీన్స్, బఠాణీలు, పెసరపప్పు, మినప పప్పు, చనగ పప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కొత్తి మీర, ఉల్లిపాయ, టమాటా, జీడి పప్పులు, పల్లీలు, పచ్చి మిర్చి, తక్కువ నూనె వీటి వల్ల శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలు, విటమిన్స్, మినరల్స్ అందుతాయి.

రోగ నిరోధక శక్తిని పెంచుతుంది:

ఉప్మాలో ఉండే ఆహార పదార్థాల వల్ల బాడీలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దీని వల్ల సీజనల్ గా వచ్చే వ్యాధులు, ఇన్ ఫెక్షన్ల బారిన పడకుండా జాగ్రత పడొచ్చు. జలుబు, జ్వరం వంటివి ఉన్నప్పుడు ఉప్మా తింటే ఇమ్యూనిటీ పెరుగుతుంది.

జీర్ణ క్రియ మెరుగు పడుతుంది:

ఉప్మాను తినడం వల్ల సాఫీగా జీర్ణం అవుతుంది. అలాగే ఉప్మా జీర్ణ సమస్యలను కూడా మెరుగు పరుస్తుంది. దీంతో కడుపులో మంట, గ్యాస్ వంటి సమస్యలు ఉండవు. మల బద్ధకం సమస్య కూడా తగ్గుతుంది.

బరువు తగ్గొచ్చు:

ఉప్మాను మంచి డైట్ ఫుడ్ గా తీసుకోవచ్చు. రోజులో ఒకసారి ఉప్మా తిన్నా బరువు తగ్గేందుకు హెల్ప్ చేస్తుంది. ఉప్మాలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి.. కొంచెం తిన్నా కడుపు నిండిన భావన కలుగుతుంది. కాబట్టి ఇతర ఆహార పదార్థాలు తీసుకోలేం. ఉప్మా ఈ విధంగా కూడా ఉపయోగ పడుతుంది.

ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి:

ఉప్మాలో ఉపయోగించే వాటిల్లో ప్రోటీన్ కంటెంట్ అనేవి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఉప్మా తింటే మన శరీరానికి కావాల్సిన ప్రోటీన్ అందుతుంది.

కాబట్టి ఉప్మాను తినడం వల్ల లాభాలే కానీ నష్టాలు లేవు. ఉప్మాతో పాటు మంచి చట్నీ లేదా సాంబార్ పెట్టుకోండి. ఈజీగా తినేయవచ్చు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.

Weekly Horoscope: ఒత్తిళ్లు, సమస్యల నుంచి వారికి ఉపశమనం..
Weekly Horoscope: ఒత్తిళ్లు, సమస్యల నుంచి వారికి ఉపశమనం..
పారిస్ లో చిరంజీవి ఫ్యామిలీ.. స్పెషల్ అట్రాక్షన్‌గా క్లింకార..
పారిస్ లో చిరంజీవి ఫ్యామిలీ.. స్పెషల్ అట్రాక్షన్‌గా క్లింకార..
రంభ, ఊర్వశి, మేనకలను కలగలిపిన అనుపమ అందం.!
రంభ, ఊర్వశి, మేనకలను కలగలిపిన అనుపమ అందం.!
వరుణుడి ప్రతాపం.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
వరుణుడి ప్రతాపం.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
అతనితో కీర్తి సురేశ్ పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందిగా..
అతనితో కీర్తి సురేశ్ పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందిగా..
కాంటాక్ట్ లెన్స్‌ వల్ల నటి జాస్మిన్ భాసిన్‌కు తీవ్ర అనారోగ్యం..
కాంటాక్ట్ లెన్స్‌ వల్ల నటి జాస్మిన్ భాసిన్‌కు తీవ్ర అనారోగ్యం..
వికసిత్‌ భారత్‌ లక్ష్యం.. నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ
వికసిత్‌ భారత్‌ లక్ష్యం.. నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ
క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్.. ఈ క్యూటీపై అందాలకి పడని హృదయం ఉంటుందా.!
క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్.. ఈ క్యూటీపై అందాలకి పడని హృదయం ఉంటుందా.!
చిన్న పిల్లాడితో లిప్ కిస్‌లా? ఆ లేడీ యాంకర్ పై చిన్మయి ఆగ్రహం
చిన్న పిల్లాడితో లిప్ కిస్‌లా? ఆ లేడీ యాంకర్ పై చిన్మయి ఆగ్రహం
ఏయే వయసులవారికి ఎంతెంత నిద్ర అవసరమో తెలుసా?
ఏయే వయసులవారికి ఎంతెంత నిద్ర అవసరమో తెలుసా?