Health Tips: ఏ సీజన్ లో ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి? జాగ్రత్త పడండిలా!

సాధారణంగా సీజన్లు మారేటప్పుడు కొత్త వ్యాధులు రావడం కామన్ విషయం. అందుకే సీజన్లు మారేటప్పుడు చాలా జాగ్రత్తలు వహించాలి. సీజన్లు మారేటప్పుడు జలుబు, దగ్గు, జ్వరం, ఇన్ ఫెక్షన్లు లాంటివి వచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయి. శరీరంలో రోగ నిరోధక శక్తి ఉన్న వారికి ఇవి తొందరగా ఎటాక్ అవుతాయి. దీంతో ఆస్పత్రులకు పరిగెట్టాల్సి వస్తుంది. అయితే ఇలాంటప్పుడే ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశాలు మెండుగా ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వేసవి..

Health Tips: ఏ సీజన్ లో ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి? జాగ్రత్త పడండిలా!
Food Poisoning
Follow us
Chinni Enni

| Edited By: Ram Naramaneni

Updated on: Oct 16, 2023 | 7:17 PM

సాధారణంగా సీజన్లు మారేటప్పుడు కొత్త వ్యాధులు రావడం కామన్ విషయం. అందుకే సీజన్లు మారేటప్పుడు చాలా జాగ్రత్తలు వహించాలి. సీజన్లు మారేటప్పుడు జలుబు, దగ్గు, జ్వరం, ఇన్ ఫెక్షన్లు లాంటివి వచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయి. శరీరంలో రోగ నిరోధక శక్తి ఉన్న వారికి ఇవి తొందరగా ఎటాక్ అవుతాయి. దీంతో ఆస్పత్రులకు పరిగెట్టాల్సి వస్తుంది. అయితే ఇలాంటప్పుడే ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశాలు మెండుగా ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వేసవి కాలంలో ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశాలు ఉండటంతో పాటు అనారోగ్య సమస్యలు వెంటనే ఛాన్స్ ఉంటుంది.

కలుషిత ఆహారం, నీటి కారణంగా ఫుడ్ పాయిజనింగ్:

ఎందుకంటే ఉన్నట్టుండి ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. దానికి తగ్గట్టుగా బాడీ కూడా తట్టుకోవాలి. దానికి తోడు ఎండా కాలంలో పిల్లలకు హాలీ డేస్ ఉంటాయి కాబట్టి టూర్లకు బయటకు వెళ్తూంటారు. దీంతో అక్కడ దొరికేవి ఏది పడితే అవి తింటూంటారు. ఈ సమయంలో హానికర బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. వేసవి కాలంలో ఆహారం, నీరు కలుషితమయ్య అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పాల ఉత్పత్తులు, గుడ్లు, మాసం వంటి వాటిల్లో వేడి అత్యధికంగా ఉండటం వల్ల బ్యాక్టీరియా అనేది పెరుగుతుంది. అందుకే వేసవి కాలంలో ఆహారం త్వరగా చెడిపోతుంది. వేసవిలో ఇలాంటి చెడిపోయిన ఆహారం తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది. అంతే కాదు బ్యాక్టీరియా పెరిగే అవకాశాలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

ఇన్ ఫెక్షన్ ల బారిన పడే అవకాశం ఉంది:

అలాగే మాంసం, గుడ్లు, కూరగాయలపై ఉండే బ్యాక్టీరియా ఒక దాని పై నుంచి మరో దాని పైకి చేరి ఆహారం కలుషితం చేస్తాయి. ఇలాంటి రకమైన ఆహారాలు తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్, ఇన్ ఫెక్షన్ల బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇది వేసవిలో మరింత ఎక్కువగా జరుగుతుంది. ఇక వేసవి కాలంలో నీటిని కూడా అధికంగా తాగుతూంటారు. దాహం కారణంగా ఏ నీటిని పడితే ఆ నీటిని తాగుతారు. దీంతో వికారం, వాంతులు, కడుపులో తిప్పడం వంటివే కాకుండా ఒక్కోసారి మలేరియా, డయేరియా వంటివి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.

బయట ఆహారం తినడం వల్ల ఫుడ్ పాయిజన్:

అందులోనూ సమ్మర్ లో క్యాంపులు, టూర్లకు కూడా వెళ్తూంటారు. అక్కడ చెరువులు, కాలువలు, బావి, నదుల్లో ఉండే నీటిని తాగేస్తారు. దీని వల్ల సాల్మోనెల్లా, ఈకోలి వంటి హానికర బ్యాక్టీరియా కడుపులోకి చేరుతుంది. ఈ రకమైన బ్యాక్టీరియా వల్ల కూడా ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇలా రక రకాల కారణాల వల్ల వేసవిలోనే ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇన్ ఫెక్షన్లు, ఫుడ్ పాయిజనింగ్ అవ్వకుండా ఉండేందుకు బయట ఆహారం, నీరు తాగకుండా ఉండేలా ఏర్పాట్లు చేసుకోండి. టూర్లకు, క్యాంపులకు వెళ్లినప్పుడు వీలైనంత వరకు హైజినిక్ గా ఉండేలా ప్లాన్ చేసుకోండి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.