Karivepaku Kodi Vepudu: కరివేపాకుతో కోడి వేపుడు ఇలా చేయండి.. ప్లేటులో ఒక్క మెతుకు కూడా ఉండదు!

చికెన్ అంటే ఇష్టముండని వారుండరు. నాన్ వెజ్ ప్రియుల్లో చాలా మంది చికెన్ అంటేనే ఇష్టంగా తింటారు. చికెన్ లో వేపుడు, ఫ్రై, చికెన్ క్రరీ ఇలా చికెన్ లో ఎన్నో వెరైటీలు ఉంటాయి. అందులో ఈ కరివేపాకు చికెన్ ఫ్రై అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు నాన్ వెజ్ ప్రియులు. రెస్టారెంట్, హోటల్స్ లో ఎక్కువగా ఈ కరివేపాకు కోడి వేపుడు ఆర్డర్ చేస్తుంటారు. ఈ వేపుడిని ఇంట్లో కూడా చేసుకోవచ్చు. వీకెండ్స్, స్పెషల్ డేస్ వచ్చినప్పుడు ఈ వేపుడిని ఇంట్లో చేసుకుని..

Karivepaku Kodi Vepudu: కరివేపాకుతో కోడి వేపుడు ఇలా చేయండి.. ప్లేటులో ఒక్క మెతుకు కూడా ఉండదు!
Chicken
Follow us
Chinni Enni

| Edited By: Ravi Kiran

Updated on: Oct 17, 2023 | 6:20 PM

చికెన్ అంటే ఇష్టముండని వారుండరు. నాన్ వెజ్ ప్రియుల్లో చాలా మంది చికెన్ అంటేనే ఇష్టంగా తింటారు. చికెన్ లో వేపుడు, ఫ్రై, చికెన్ క్రరీ ఇలా చికెన్ లో ఎన్నో వెరైటీలు ఉంటాయి. అందులో ఈ కరివేపాకు చికెన్ ఫ్రై అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు నాన్ వెజ్ ప్రియులు. రెస్టారెంట్, హోటల్స్ లో ఎక్కువగా ఈ కరివేపాకు కోడి వేపుడు ఆర్డర్ చేస్తుంటారు. ఈ వేపుడిని ఇంట్లో కూడా చేసుకోవచ్చు. వీకెండ్స్, స్పెషల్ డేస్ వచ్చినప్పుడు ఈ వేపుడిని ఇంట్లో చేసుకుని తినవచ్చు. ఈ వేపుడికి ఎక్కువగా సమయం కూడా పట్టదు. ఒక్కసారి టేస్ట్ చూస్తే మాత్రం మెతుకు కూడా మిగల్చకుండా మొత్తం లాగించేస్తారు. మరి ఈ కరివేపాకు కోడి వేపుడికి కావాల్సిన పదార్థాలు, తయారు చేయు విధానం ఇప్పుడు తెలుసుకుందాం.

కరివేపాకు కోడి వేపుడికి కావాల్సిన పదార్థాలు:

చికెన్, కరివేపాకు, కొత్తి మీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, షాజీరా, నూనె, జాపత్రి, అనాస పువ్వు, లవంగాలు, జాపత్రి, దాల్చిన చెక్క, యాలకులు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా, ఉప్పు, కారం, పసుపు.

ఇవి కూడా చదవండి

కరివేపాకు కోడి వేపుడు తయారీ విధానం:

ముందుగా ఒక పాత్ర తీసుకుని మసాలా దినుసులన్నీ ఒకటి తర్వాత మరొకటి వేసి వేయించుకోవాలి. వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకుని చల్లార బెట్టుకోవాలి. ఆ తర్వాత మిక్సీలో వేసి మెత్తగా పౌడర్ లా చేసుకోవాలి. ఆ తర్వాత ఒక మందపాటి కడాయి తీసుకుని అందులో నూనె వేసి వేడి చేసుకోవాలి. ఇది వేడెక్కాక షాజీరా వేసి ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకుని వేయించుకుని, ఉల్లిపాయ, పచ్చి మిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించు కోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక.. టమాటా ముక్కలు వేసి మెత్తగా అయ్యేంత వరకూ ఉడికించు కోవాలి.

ఇప్పుడు ఉప్పు, పసుపు, కారం వేసి.. పచ్చి వాసన పోయేంత వరకూ ఫ్రై చేసి, మూత పెట్టుకోవాలి. ఆ తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా చికెన్ పూర్తిగా మెత్త బడేలా వేయించుకోవాలి. ఇప్పుడు మళ్లీ ఒక సారి కరివేపాకు వేసుకుని మరోసారి ఫ్రై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో టేస్ట్ వస్తుంది. మరి కొద్ది సేపు వేయించాక.. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా వేసి మరోసారి బాగా కలుపుకోవాలి. అంతే ఎంతో టేస్టీ కరివేపాకు కోడి వేపుడు సిద్ధం. దీన్ని డైరెక్ట్ గా అన్నంలో అయినా కలుపుకుని తినవచ్చు. లేదా సైడ్ డిష్ గా అయినా సూపర్ గా ఉంటుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.