- Telugu News Photo Gallery Does watching horror movies make you lose weight? Is this true? check here is details in Telugu
Horror Movies Reduce Weight: హర్రర్ సినిమాలు చూస్తే బరువు తగ్గుతారా.. ఇది నిజమేనా?
హర్రర్ సినిమాలు.. వీటిల్లో చాలా రకాలు ఉంటాయి. థ్రిల్లింగ్, సస్పెన్స్, దెయ్యాల కథలు ఇలా చాలా రకాలు ఉంటాయి. ఏది ఏమైనా ఇప్పుడున్న వారు ఎక్కువగా హర్రర్ సినిమాలు చూడటానికే ఇష్ట పడుతున్నారు. హర్రర్ సినిమాలు చూస్తే ఒక లాంటి సంతృప్తికరమైన భావన కలుగుతుంది. ఈ హర్రర్ సినిమాలు చూడటాన్ని యూత్ బాగా ఎంజాయ్ చేస్తుంది. ఈ మధ్య సినిమాలు అన్నీ ఇలాగే డిఫరెంట్ కంటెంట్ తో వస్తున్నాయి. ప్రేక్షకులు కూడా వీటిని ఆదరిస్తున్నారు. అయితే ఇలాంటి సినిమాలు..
Updated on: Nov 25, 2023 | 8:43 PM

హర్రర్ సినిమాలు.. వీటిల్లో చాలా రకాలు ఉంటాయి. థ్రిల్లింగ్, సస్పెన్స్, దెయ్యాల కథలు ఇలా చాలా రకాలు ఉంటాయి. ఏది ఏమైనా ఇప్పుడున్న వారు ఎక్కువగా హర్రర్ సినిమాలు చూడటానికే ఇష్ట పడుతున్నారు. హర్రర్ సినిమాలు చూస్తే ఒక లాంటి సంతృప్తికరమైన భావన కలుగుతుంది. ఈ హర్రర్ సినిమాలు చూడటాన్ని యూత్ బాగా ఎంజాయ్ చేస్తుంది.

ఈ మధ్య సినిమాలు అన్నీ ఇలాగే డిఫరెంట్ కంటెంట్ తో వస్తున్నాయి. ప్రేక్షకులు కూడా వీటిని ఆదరిస్తున్నారు. అయితే ఇలాంటి సినిమాలు చూడటం వల్ల కేవలం థ్రిల్ మాత్రమే కాదు.. మంచి ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయని అంటున్నారు నిపుణులు.

ఈ హర్రర్ సినిమాలు చూడటం వల్ల ముఖ్యంగా బరువు తగ్గుతారట. ఎలా అని ఆశ్చర్య పోతున్నారా.. అదెలాగో ఇప్పుడు చూద్దాం. 90 నిమిషాల డ్యూరేషన్ ఉన్న హర్రర్ సినిమా చూస్తే.. 150 కేలరీలను తగ్గించుకోవచ్చట. అలాగే ఇదే కాకుండా పలు రకాల హర్రర్ సినిమాలపై కూడా అధ్యయనం చేశారట.

ఇలా కొన్ని రకాల చిత్రాలను చూడటం వల్ల వారిలో ఆక్సిజన్ ని ఎక్కువగా పీల్చడం.. కార్బన్ డయాక్సైడ్ ని వదిలేయడాన్ని గమనించారట. అంతే కాకుండా వారి గుండె స్పందన రేటులో కూడా మార్పులు చేర్పులు వచ్చాయని తెలిపారు. అంతే కాకుండా కేలరీలు ఎక్కువగా బర్న్ కావడం వల్ల జీవ క్రియలో కూడా పెరిగిందని వెల్లడించారు.

ఇలా జనాలు సినిమాను చూసే విధానం బట్టి వారిలో పలు రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వెల్లడించారు. భయం, టెన్సన్ కారణంగా శరీరంలో అడ్రినల్ అనేది వేగంగా రిలీజ్ అవుతుంది. ఇది ఆకలిని అణిచి వేస్తుంది. ఇలా బరువు తగ్గేందుకు హెల్ప్ అవుతుందని ఆరోగ్య నిపుణులు తెలిపారు.




