AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Telugu 8: బిగ్ బాస్‌లోకి విష్ణుప్రియ, రీతూ చౌదరి! ఆ ఒక్క మాటతో కన్ఫామ్ చేసిన క్లోజ్ ఫ్రెండ్స్

ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా 7 సీజన్స్ పూర్తి చేసుకున్న ఈ షో.. ఇప్పుడు 8వ సీజన్ తో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయిపోయింది. ఇందుకోసం అన్న పూర్ణ స్టూడియోస్ లో కూడా సెట్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. అలాగే ఎనిమిదో సీజన్ కు సంబంధించి ఇటీవలే ప్రోమోను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. అలాగే టైటిల్ లోగోనూ కూడా సరికొత్తగా డిజైన్ చేశారు.

Bigg Boss Telugu 8: బిగ్ బాస్‌లోకి విష్ణుప్రియ, రీతూ చౌదరి! ఆ ఒక్క మాటతో కన్ఫామ్ చేసిన క్లోజ్ ఫ్రెండ్స్
Vishnupriya, Rithu Chowdary
Basha Shek
|

Updated on: Aug 01, 2024 | 8:12 PM

Share

బుల్లితెర ఆడియెన్స్ కు ఫుల్ ఎంటర్ టైన్మెంట్ అందించేందుకు బిగ్ బాస్ మళ్లీ వచ్చేస్తున్నాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా బిగ్ బాస్ తెలుగు ఎనిమిదో సీజన్, కంటెస్టెంట్లపైనే చర్చ ఎక్కువగా నడుస్తోంది.ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా 7 సీజన్స్ పూర్తి చేసుకున్న ఈ షో.. ఇప్పుడు 8వ సీజన్ తో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయిపోయింది. ఇందుకోసం అన్న పూర్ణ స్టూడియోస్ లో కూడా సెట్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. అలాగే ఎనిమిదో సీజన్ కు సంబంధించి ఇటీవలే ప్రోమోను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. అలాగే టైటిల్ లోగోనూ కూడా సరికొత్తగా డిజైన్ చేశారు. మరోవైపు కంటెస్టెంట్స్ కు సంబంధించి సోషల్ మీడియాలో పలువురి పేర్లు దర్శనమిస్తున్నాయి. బర్రెలక్క, అబ్బాస్, రాజ్ తరుణ్, కుమారి ఆంటీ, యాదమ్మ రాజు, రీతూ చౌదరి, విష్ణుప్రియ, బుల్లెట్ భాస్కర్, టాలీవుడ్ సీనియర్ నటి సనా, రోహిత్ తదితరుల పేర్లు ఈసారి ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కాగా వీరిలో ఇద్దరి పేర్లు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ గా దాదాపుగా కన్ఫామ్ అయిపోందని సమాచారం. వారే స్టార్ యాంకర్స్ విష్ణు ప్రియ, రీతూ చౌదరి. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఈ క్లోజ్ ఫ్రెండ్స్ బిగ్ బాస్ ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు

ఇవి కూడా చదవండి

‘బిగ్ బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ రాబోతోంది.. మీరు వెళ్లబోతున్నారా?’ అన్న ప్రశ్నకు విష్ణు ప్రియ చాలా ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చింది. తనకు స్వతహాగా బిగ్ బాస్ లోకి వెళ్లే ఉద్దేశం లేదని చెబుతూనే, అయితే తనని బిగ్ బాస్ లో చూడాలి అని చాలా మంది అనుకుంటున్నారంది. అలాగే తనకు బిగ్ బాస్ కి వెళ్లాలి అని ఎందుకు ఉంది అన్న ప్రశ్నకు.. ఇటీవల పెరిగిన 10 కిలోల బరువు తగ్గించుకోవచ్చంటూ కామెంట్స్ చేశారంది. ఈ కామెంట్స్ అన్నీ చూస్తే తాను బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లేందుకు రెడీగా ఉన్నాను అని చెప్పిందీ యాంకరమ్మ. అలాగే అభిమానుల ఆశీస్సులు ఉంటే తప్పకుండా బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ లో కచ్చితంగా కనిపిస్తానంటూ ఫైనల్ పంచ్ ఇచ్చింది విష్ణుప్రియ.

ఇక మరో జబర్దస్త్ నటి రీతూ చౌదరి కూడా విష్ణు ప్రియ కామెంట్స్ కాపీ పేస్ట్ అంటూ చెప్పింది. తద్వారా తనకి కూడా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లాలన్న ఆసక్తి ఉందంటూ చెప్పకనే చెప్పింది. ఇప్పటికే పలు టీవీ షోల్లో తెగ సందడి చేస్తున్నారు విష్ణు ప్రియ- రీతూ చౌదరి. మరి ఈ క్లోజ్ ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ లోకి వస్తే సందడి మాములుగా ఉండదంటున్నారు బిగ్ బాస్ ఫ్యాన్స్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us