Chiyaan Vikram: గొప్ప మనసు చాటుకున్న చియాన్ విక్రమ్.. వయనాడ్ బాధితుల కోసం భారీ విరాళం

దేవతలు నడయాడే భూమిగా పేరున్న కేరళపై ప్రకృతి పగబట్టినట్లుంది. వయనాడ్ జిల్లాలోని చాలా ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడడంతో సుమారు 150 మందికి పైగానే మృతి చెందారు. అలాగే వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. శిథిలాల కింద చాలామంది ఇరుక్కుపోయారని, మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ఈ విషాద ఘటన పట్ల దేశం యావత్తూ దిగ్భ్రాంతికి గురైంది. ప్రధాని నరేంద్ర మోడీతో సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

Chiyaan Vikram: గొప్ప మనసు చాటుకున్న చియాన్ విక్రమ్.. వయనాడ్ బాధితుల కోసం భారీ విరాళం
Actor Chiyaan Vikram
Follow us
Basha Shek

|

Updated on: Jul 31, 2024 | 8:11 PM

దేవతలు నడయాడే భూమిగా పేరున్న కేరళపై ప్రకృతి పగబట్టినట్లుంది. వయనాడ్ జిల్లాలోని చాలా ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడడంతో సుమారు 150 మందికి పైగానే మృతి చెందారు. అలాగే వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. శిథిలాల కింద చాలామంది ఇరుక్కుపోయారని, మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ఈ విషాద ఘటన పట్ల దేశం యావత్తూ దిగ్భ్రాంతికి గురైంది. ప్రధాని నరేంద్ర మోడీతో సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ కేరళ ప్రకృతి విలయతాండవం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వయనాడ్ లో కొండచరియలు విరిగిపడి 150 మందికి పైగా చనిపోవడం పట్ల ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మృతుల కుటుంబాలు, బాధితుల సహాయార్థం కేరళ ముఖ్యమంత్రి సహాయన నిధికి విక్రమ్ రూ. 20 లక్షల విరాళంగా ఇచ్చారు. ఈ విషయాన్ని విక్రమ్ మేనేజర్ యువరాజ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ‘కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడటం వల్ల 150 మందికి పైగా చనిపోయారు. అలాగే 197 మంది గాయపడ్డారు. మరెంతో మంది ఆచూకీ లేకుండా తప్పిపోయారు. ఎంతో మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన పట్ల నటుడు చియాన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితుల సహాయార్థం కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 20 లక్షలు విరాళంగా ఇచ్చారు’ అని తన పోస్టులో రాసుకొచ్చారు విక్రమ్ మేనేజర్.

ప్రస్తుతం ఈ సోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. నటుడు విక్రమ్ చాలా మంచి పనిచేశాడని దీనిని చూసిన అభిమానులు, నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. విక్రమ్ లాగే నటీనటులందరూ వయనాడ్ బాధితులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ఇప్పుడు తంగలాన్ మూవీలో నటిస్తున్నారు విక్రమ్. డైరెక్టర్ పా. రంజిత్ తెరకెక్కించిన ఈ మూవీలో అందాల రాశి మాళవిక మోహనన్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేశాయి. ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 15న విడుదల కానుంది. ఇందులో పార్వతి తిరువోతు, పశుపతి, సంపత్ రామ్ కీలకపాత్రలలో నటిస్తున్నారు. నిర్మాత కేఈ జ్ఞానవేల్ భారీ బడ్జెట్‏తో ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!