- Telugu News Photo Gallery Cinema photos Paris Olympics 2024: PV Sindhu Special Post On Megastar Chiranjeevi Mega Family
Chiranjeevi: చిరంజీవి అంకుల్ రావడం ఆశ్చర్యం కలిగించింది: పారిస్‌లో మెగా ఫ్యామిలీతో పీవీ సింధు.. ఫొటోస్
ప్రస్తుతం పారిస్‌లో ఒలింపిక్స్ క్రీడలు అట్టహాసంగా జరుగుతున్నాయి. మన దేశానికి ఎంతో మంది క్రీడాకారులు ఈ మెగా స్పోర్ట్స్ ఈవెంట్ లో తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. ఒలింపిక్స్ క్రీడలను ప్రత్యక్షంగా చూసేందుకు వివిధ రంగాల ప్రముఖులు పారిస్ కు వెళ్లారు. వీరిలో మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ కూడా ఉంది.
Updated on: Jul 30, 2024 | 9:46 PM

ప్రస్తుతం పారిస్‌లో ఒలింపిక్స్ క్రీడలు అట్టహాసంగా జరుగుతున్నాయి. మన దేశానికి ఎంతో మంది క్రీడాకారులు ఈ మెగా స్పోర్ట్స్ ఈవెంట్ లో తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. ఒలింపిక్స్ క్రీడలను ప్రత్యక్షంగా చూసేందుకు వివిధ రంగాల ప్రముఖులు పారిస్ కు వెళ్లారు. వీరిలో మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ కూడా ఉంది.

మెగాస్టార్ చిరంజీవితో పాటు రామ్ చరణ్, సురేఖ, ఉపాసన.. నలుగురూ కలిసి పారిస్ ఒలంపిక్స్ విలేజ్ లో సందడి చేస్తున్నారు. ఈ సందర్భంగా పీవీ సింధును కలిసిందీ మెగా ఫ్యామిలీ.

చిరంజీవి కుటుంబ సభ్యులతో పీవీ సింధు దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ సందర్భంగా స్టార్ షట్లర్ కు చిరు కుటుంబ సభ్యులు ఆల్ ది బెస్ట్ చెప్పారు.

సింధు కూడా స్పందిస్తూ.. 'పారిస్ ఒలింపిక్స్ లో నా తొలి మ్యాచ్ కు చిరు అంకుల్, చిన్ని కారా సహా మొత్తం ఫ్యామిలీ నాకు లవ్లీయెస్ట్ సర్‌ప్రైజ్. చిరంజీవి అంకుల్ లాగా ఈ ప్రపంచంలో క్లాస్, గ్రేస్, ఛార్మ్ ఉన్న వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు'

'సినిమా ఇండస్ట్రీలో అత్యంత గౌరవనీయుడైన నటుడు బహుశా చిరంజీవినే. ఆయనలాగా మరెవరూ లేరు. ఉప్సీ, చరణ్, చిరు అంకుల్, సురేఖ ఆంటీ మీరంతా చాలా స్పెషల్' అని పోస్ట్ పెట్టింది.