- Telugu News Photo Gallery Cinema photos 2024 Tollywood New Movies Shooting Updates in Film Industry Telugu Heroes Photos
Tollywood Shooting 2024: తలో దిక్కున మన హీరోస్.. మరి సినిమాల సంగతి ఏంటి.?
రాజమౌళి సినిమా కమిటయ్యారు కాబట్టి ఇప్పట్లో మహేష్ బాబును సెట్స్‌లో చూడలేం.. ఈ మధ్యే పవర్ తీసుకున్నారు కాబట్టి పవన్ ఇంకొన్నాళ్లు కెమెరా ముందుకు రారు. రామ్ చరణ్ ఒలంపిక్స్ కోసం పారిస్ వెళ్లారు.. చిరు కూడా అక్కడే ఉన్నారు. ఇలా ముక్కలు ముక్కలు ఎందుకు గానీ.. మొత్తం షూటింగ్ అప్‌డేట్స్ ఒకేసారి చూద్దాం పదండి.. ఒలంపిక్స్ కోసం చిరంజీవి పారిస్‌లో ఉన్నా.. ఆయన విశ్వంభర షూటింగ్ మాత్రం ఫుల్ బిజీగా నడుస్తుంది.
Updated on: Jul 30, 2024 | 10:21 PM

ఇంటర్నేషనల్ స్క్రీన్స్ మీద తెలుగు సినిమాకు తిరుగులేదనే క్రెడిట్ కొట్టేయాలంటే ఈ మాత్రం వెయిటింగ్ తప్పదని మేం కూడా అర్థం చేసుకుంటామంటూ సపోర్ట్ చేస్తున్నారు ఘట్టమనేని సైన్యం.

రామ్ చరణ్ ఒలంపిక్స్ కోసం పారిస్ వెళ్లారు.. చిరు కూడా అక్కడే ఉన్నారు. ఇలా ముక్కలు ముక్కలు ఎందుకు గానీ.. మొత్తం షూటింగ్ అప్‌డేట్స్ ఒకేసారి చూద్దాం పదండి..

ఒలంపిక్స్ కోసం చిరంజీవి పారిస్‌లో ఉన్నా.. ఆయన విశ్వంభర షూటింగ్ మాత్రం ఫుల్ బిజీగా నడుస్తుంది. ఈ చిత్ర షూటింగ్ అన్నపూర్ణ 7 ఎకర్స్‌లో జరుగుతుంది.

అల్లు అర్జున్ పుష్ప 2 షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో బిజీ బిజీగా నడుస్తుంది. అక్కడే కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు సుకుమార్. డిసెంబర్ 6నే ఈ చిత్రం వస్తుందంటున్నారు మేకర్స్.

జూనియర్ ఎన్టీఆర్ దేవర కీలక షెడ్యూల్ అల్యూమీనియం ఫ్యాక్టరీలో జరుగుతుంది. అక్కడే నితిన్, వెంకీ కుడుముల రాబిన్ హుడ్ షూట్ కూడా జరుగుతుంది. బాలయ్య, బాబీ సినిమా షూట్ రాజస్థాన్‌లోని జైపూర్ ప్యాలెస్‌లో జరుగుతుంది.

ఒక్కసారి పేరు రాసుకుంటే, వాళ్ల అంతు చూడటానికి ఎంత దూరమైనా వెళ్లే కేరక్టర్‌లో కనిపిస్తారు నేచురల్ స్టార్. యుద్ధానికి రంగం సిద్ధం సిద్ధం అంటూ.. శనివారం మాత్రమే కొట్టే హీరో గురించి డీటైల్డ్ గానే చెప్పేసింది ట్రైలర్.

స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఇక తమన్నా, సంపత్ నంది కాంబినేషన్‌లో వస్తున్న ఓదెల 2 షూట్ RFC సమీపంలో జరుగుతుంది.




