AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Turbo OTT: అఫీషియల్.. ఓటీటీలోకి మమ్ముట్టి, సునీల్ ల బ్లాక్ బస్టర్ మూవీ.. తెలుగులోనూ టర్బో స్ట్రీమింగ్

రూ.23 కోట్ల బడ్జెట్‍తో తెరకెక్కిన ఈ సినిమా సుమారు రూ.75 కోట్లకు పైగానే వసూళ్లు సాధించింది. ఎప్పటిలాగే మమ్ముట్టి మరోసారి తన యాక్టింగ్‍తో అదరగొట్టారు. థియేటర్లలో ఆడియెన్స్ మెప్పు పొందిన టర్బో సినిమా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్

Turbo OTT: అఫీషియల్.. ఓటీటీలోకి మమ్ముట్టి, సునీల్ ల బ్లాక్ బస్టర్ మూవీ..  తెలుగులోనూ టర్బో స్ట్రీమింగ్
Turbo Movie
Basha Shek
|

Updated on: Jul 30, 2024 | 8:08 PM

Share

మలయాళ మెగాస్టార్‌ మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం టర్బో. వైశాఖ్ తెరకెక్కించిన ఈ పక్కా యాక్షన్ మూవీలో టాలీవుడ్ నటుడు సునీల్ విలన్ పాత్రలో మెప్పించాడు. అలాగే రాజ్ బీ శెట్టి, అంజన జయప్రకాశ్, షబరీష్ వర్మ, కబీర్ దుహాన్ సింగ్, నిరంజన అనూప్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. మే 23న మలయాళంలో రిలీజైన టర్బో సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. రూ.23 కోట్ల బడ్జెట్‍తో తెరకెక్కిన ఈ సినిమా సుమారు రూ.75 కోట్లకు పైగానే వసూళ్లు సాధించింది. ఎప్పటిలాగే మమ్ముట్టి మరోసారి తన యాక్టింగ్‍తో అదరగొట్టారు. థియేటర్లలో ఆడియెన్స్ మెప్పు పొందిన టర్బో సినిమా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ సోనీ లివ్ మమ్ముట్టి సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. తాజాగా టర్బో సినిమా స్ట్రీమింగ్ కు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడింది. ఆగస్టు 9వ తేదీ నుంచి ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది సోనీ లివ్. మలయాళంతో పాటు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లోనూ ఈ సూపర్ హిట్ స్ట్రీమింగ్ కానుంది.

టర్బో సినిమా థియేటర్లలో మలయాళంలో మాత్రమే రిలీజ్ అయింది. అయితే ఓటీటీలోకి తెలుగు, తమిళం, కన్నడ, హిందీ డబ్బింగ్ వెర్షన్‍లను కూడా సోనీలివ్ అందుబాటులోకి తీసుకొస్తోంది. కాబట్టి మమ్ముట్టి సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశముంది. టర్బో మూవీకి మమ్ముట్టినే నిర్మాతగా వ్యవహరించడం విశేషం. తన సొంత మమ్ముట్టి కంపెనీ బ్యానర్ పైనే ఈ సినిమాను రూపొందించారు. క్రిస్టో గ్జేవియర్ ఈ సినిమాకు స్వరాలు అందించగా.. విష్ణు శర్మ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. ఈ మధ్యన మమ్ముట్టి సినిమాలు థియేటర్లతో పాటు ఓటీటీలోనూ సూపర్ హిట్ గా నిలుస్తున్నాయి. మరి టర్బో సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

 ఆగస్టు 9 నుంచి సోనీ లివ్ ఓటీటీలో మమ్ముట్టి టర్బో సినిమా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సవరించిన ఐటీఆర్ లేదా ఆలస్యమైన ఐటీఆర్? డిసెంబర్ 31 లోపు ఏది దాఖలు
సవరించిన ఐటీఆర్ లేదా ఆలస్యమైన ఐటీఆర్? డిసెంబర్ 31 లోపు ఏది దాఖలు
కొత్త ఏడాదిలో గోల్డెన్ ఛాన్స్.. అదృష్టం ఈ రాశుల సొంతం!
కొత్త ఏడాదిలో గోల్డెన్ ఛాన్స్.. అదృష్టం ఈ రాశుల సొంతం!
2 గంటల్లో ముంబై టు దుబాయ్.. అది కూడా రైల్లో వీడియో
2 గంటల్లో ముంబై టు దుబాయ్.. అది కూడా రైల్లో వీడియో
ఆ వ్యాధిగ్రస్తులకు ఈ డ్రింక్‌.. అమృతంతో సమానం.. రోజూ తాగితే..
ఆ వ్యాధిగ్రస్తులకు ఈ డ్రింక్‌.. అమృతంతో సమానం.. రోజూ తాగితే..
సమంత కోసం ఎయిర్‌పోర్ట్‌కు రాజ్ నిడిమోరు వీడియో
సమంత కోసం ఎయిర్‌పోర్ట్‌కు రాజ్ నిడిమోరు వీడియో
నువ్వు గ్రేట్ బాసూ.! చేసేది డెలివరీ బాయ్ ఉద్యోగం.. కట్ చేస్తే..
నువ్వు గ్రేట్ బాసూ.! చేసేది డెలివరీ బాయ్ ఉద్యోగం.. కట్ చేస్తే..
మొలకెత్తిన ఉల్లిపాయలు తింటున్నారా..? అయితే, ఇది మీ కోసమే.. లేదంటే
మొలకెత్తిన ఉల్లిపాయలు తింటున్నారా..? అయితే, ఇది మీ కోసమే.. లేదంటే
సోషల్ మీడియాలో 'దూద్ సోడా' జోరు.. ఏమిటీ దీని స్పెషాలిటీ?
సోషల్ మీడియాలో 'దూద్ సోడా' జోరు.. ఏమిటీ దీని స్పెషాలిటీ?
2025 విషాద ఘటనలు.. కుంభమేళా నుంచి కర్నూలు బస్సు ప్రమాదం వరకు
2025 విషాద ఘటనలు.. కుంభమేళా నుంచి కర్నూలు బస్సు ప్రమాదం వరకు
పెళ్లికి అతిథులుగా బిచ్చగాళ్లు.. మానవత్వం చాటిన వ్యక్తి వీడియో
పెళ్లికి అతిథులుగా బిచ్చగాళ్లు.. మానవత్వం చాటిన వ్యక్తి వీడియో