AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kalki OTT: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఆగస్టులోనే ఓటీటీలోకి కల్కి.. ఆ స్పెషల్ డే నుంచే స్ట్రీమింగ్

జూన్ 27న గ్రాండ్ గా రిలీజైన కల్కి సినిమా ఇప్పటికే రూ.1200 కోట్లకు చేరువలో ఉంది. ఇప్పటికీ చాలా చోట్ల ఈ సినిమా ఆడుతున్నప్పటికీ థియేట్రికల్ రన్ దాదాపుగా చివరకొచ్చేసింది. దీంతో కల్కి సినిమా ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా? అని మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీంతో ఈ బ్లాక్ బస్టర్ మూవీని ఓటీటీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయని టాక్ వినిపిస్తోంది

Kalki OTT: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఆగస్టులోనే ఓటీటీలోకి కల్కి.. ఆ స్పెషల్ డే నుంచే స్ట్రీమింగ్
Kalki 2898 Ad Movie
Basha Shek
|

Updated on: Jul 31, 2024 | 2:01 PM

Share

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ చిత్రం కల్కి. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ మైథాలజీ అండ్ ఫిక్షనల్ థ్రిల్లర్ లో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె హీరోయిన్ గా నటించింది. బిగ్ బీ అమితాబ్ బచ్చన్, లోక నాయకుడు కమల్ హాసన్ తదితరలు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా రిలీజై దాదాపు నెలరోజులు గడిచిపోయింది. . జూన్ 27న గ్రాండ్ గా రిలీజైన కల్కి సినిమా ఇప్పటికే రూ.1200 కోట్లకు చేరువలో ఉంది. ఇప్పటికీ చాలా చోట్ల ఈ సినిమా ఆడుతున్నప్పటికీ థియేట్రికల్ రన్ దాదాపుగా చివరకొచ్చేసింది. దీంతో కల్కి సినిమా ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా? అని మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీంతో ఈ బ్లాక్ బస్టర్ మూవీని ఓటీటీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయని టాక్ వినిపిస్తోంది. ‘కల్కి’ తెలుగు వెర్షన్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల్ని ప్రముఖ ఓటీటీ ప్లాట్ పామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. తమిళ, కన్నడ, మలయాళ భాషల హక్కులు కూడా అమెజాన్ ప్రైమ్ చేతిలో నే ఉన్నాయి. ఒక్క హిందీ వెర్షన్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ మాత్రం నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది.

కాగా థియేట్రికల్ రిలీజ్ తర్వాత 8 వారాల తర్వాతే కల్కి సినిమాను ఓటీటీలోకి తీసుకురావాలని ముందే అగ్రిమెంట్ జరిగిందట. దీని ప్రకారమే ఆగస్టు 23న ప్రభాస్ బ్లాక్ బస్టర్ మూవీని ఓటీటీలోకి తీసుకొచ్చే యోచనలో ఉన్నారట. ఒకవేళ లేదంటే వారం ముందుగానే స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగస్టు 15నే ఓటీటీలోకి కల్కిని తీసుకొచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదని టాక్ నడుస్తోంది. ఎందుకంటే అది లాంగ్ వీకెండ్ కాబట్టి ఎక్కువ మంది సినిమాను చూసే అవకాశముంది. కాబట్టి ఓటీటీ సంస్థలు కూడా ఈ తేదీనే లాక్ చేయనున్నాయని తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది. వైజయంతీ బ్యానర్ పై అశ్వినీదత్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కల్కి సినిమాలో దిశా పటానీ, శోభన, రాజేంద్ర ప్రసాద్, మాళవిక నాయర్, విజయ దేవర కొండ, దుల్కర్ సల్మాన్ తదితరలు ప్రధాన పాత్రలు పోషించారు.

ఇవి కూడా చదవండి

బెంగళూరులో బుజ్జి సందడి.. వీడియో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
చిరంజీవి సినిమాను రిజెక్ట్ చేసిన నటుడు.. కట్ చేస్తే
చిరంజీవి సినిమాను రిజెక్ట్ చేసిన నటుడు.. కట్ చేస్తే
ఒంటికి చలువ..ఇంటిల్లిపాదికి ఆరోగ్యం!ఈ కూరగాయ బోర్‌ అనకుండా తినాలి
ఒంటికి చలువ..ఇంటిల్లిపాదికి ఆరోగ్యం!ఈ కూరగాయ బోర్‌ అనకుండా తినాలి
గణిత, వైఫై అన్వేషణలకు ఆర్డీవోకు అంతర్జాతీయ గుర్తింపు!
గణిత, వైఫై అన్వేషణలకు ఆర్డీవోకు అంతర్జాతీయ గుర్తింపు!
ఒకే మ్యాచ్‌లో రెండుసార్లు ప్రపంచ రికార్డ్ బద్దలు..!
ఒకే మ్యాచ్‌లో రెండుసార్లు ప్రపంచ రికార్డ్ బద్దలు..!
ఐస్‌ వాటర్‌ ఫెషియల్‌ ఇలా చేయడం వల్ల బోలెడు లాభాలు..అందమే అందం!
ఐస్‌ వాటర్‌ ఫెషియల్‌ ఇలా చేయడం వల్ల బోలెడు లాభాలు..అందమే అందం!
24 గంటల్లోనే మరో గాయం.. హార్దిక్ రీఎంట్రీపై వీడని ఉత్కంఠ..?
24 గంటల్లోనే మరో గాయం.. హార్దిక్ రీఎంట్రీపై వీడని ఉత్కంఠ..?
కొత్త కార్ కొనాలా? భారీ డిస్కౌంట్లు పొందేందుకు 'బెస్ట్ టైమ్' ఇదే.
కొత్త కార్ కొనాలా? భారీ డిస్కౌంట్లు పొందేందుకు 'బెస్ట్ టైమ్' ఇదే.
బాలనాగమ్మ సినిమా చిత్రీకరణ అయినా ఎందుకు రిలీజ్ కాలేదంటే..?
బాలనాగమ్మ సినిమా చిత్రీకరణ అయినా ఎందుకు రిలీజ్ కాలేదంటే..?
నాటు గుడ్డు.. ఫారం గుడ్డు: ఏది ఆరోగ్యానికి మంచిది? నిపుణుల సూచన
నాటు గుడ్డు.. ఫారం గుడ్డు: ఏది ఆరోగ్యానికి మంచిది? నిపుణుల సూచన
భూమిపై అదే చివరి రోజా.. నవంబర్ 13న ఏం జరగబోతుంది..?
భూమిపై అదే చివరి రోజా.. నవంబర్ 13న ఏం జరగబోతుంది..?