Alekhya Tarakaratna: విజయసాయి రెడ్డి ఫ్యామిలీని కలిసిన తారకరత్న భార్య అలేఖ్య.. ఫొటో వైరల్

టాలీవుడ్ ప్రముఖ నటుడు నందమూరి తారకరత్న గత ఏడాది కన్నుమూశారు. నారా లోకేశ్ యువగళం పాద యాత్రలో పాల్గొన్న ఆయన హఠాత్తుగా గుండెపోటుకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను బెంగళూరు ఆస్పత్రిలో చేర్పించారు. అయితే దురదృష్టవశాత్తూ ఆయన కోలుకోలేకపోయారు.

Alekhya Tarakaratna: విజయసాయి రెడ్డి ఫ్యామిలీని కలిసిన తారకరత్న భార్య అలేఖ్య.. ఫొటో వైరల్
Alekhya Tarakaratna, Vijaysai Reddy,
Follow us
Basha Shek

|

Updated on: Jul 30, 2024 | 7:08 PM

టాలీవుడ్ ప్రముఖ నటుడు నందమూరి తారకరత్న గత ఏడాది కన్నుమూశారు. నారా లోకేశ్ యువగళం పాద యాత్రలో పాల్గొన్న ఆయన హఠాత్తుగా గుండెపోటుకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను బెంగళూరు ఆస్పత్రిలో చేర్పించారు. అయితే దురదృష్టవశాత్తూ ఆయన కోలుకోలేకపోయారు. సుమారు రెండు వారాల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందిన తారక రత్న అందరినీ విషాదంలో ముంచుతూ ఈ లోకాన్ని విడిచి పెట్టి వెళ్లిపోయారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న తారకరత్న మరణం తో ఆయన భార్య అలేఖ్యా బాగా కుంగిపోయారు. భర్తతో తనకున్న మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. సోషల్ మీడియాలోనూ యాక్టివ్ ఉంటూ తన పిల్లలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను నిత్యం అందులో షేర్ చేసుకున్నారు. తాజాగా వైసీపీ నేత విజయసాయి రెడ్డి ఫ్యామిలీతో దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది అలేఖ్య రెడ్డి. ప్రస్తుతం ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. తారకరత్న భార్య అలేఖ్యారెడ్డికి, విజయసాయిరెడ్డికి మధ్య బంధుత్వం ఉంది. . విజయసాయి రెడ్డి భార్య సోదరి కుమార్తెనే అలేఖ్యారెడ్డి. అంటే వరుసకు విజయసాయిరెడ్డి అలేఖ్యా రెడ్డికి స్వయానా పెదనాన్న అవుతారు. ఆ ఫ్యామిలీతోనూ అలేఖ్యాకు మంచి అనుబంధం ఉంది.

ఇవి కూడా చదవండి

అలేఖ్య చిన్నప్పటి నుంచి విజయ సాయి రెడ్డి ఇంట్లోనే ఎక్కువగా పెరిగారట. ఇక తారక రత్న తో ప్రేమ వివాహాన్ని కూడా విజయ సాయి రెడ్డి ఫ్యామిలీనే దగ్గ రుండి చేశారట. ఇక తారక రత్న మరణించినప్పుడు కూడా విజయ సాయి రెడ్డి దగ్గరుండి అన్ని పనులు చూసుకున్నారు. ఆస్పత్రిలో ఉన్నప్పుడు, అంత్యక్రియల సమయాల్లో అన్నీ తానై వ్యవహరించారు. తాజాగా అలేఖ్య రెడ్డి విజయసాయి రెడ్డి ఫ్యామిలీతో దిగిన ఫొటో ను సోషల్ మీడియాలో షేర్ చేసి.. ‘హ్యాపీ బర్త్ డే బుజ్జి బాబు’ అని విషెస్ తెలిపింది. దీంతో ఈ ఫొటో వైరల్ గా మారింది.

విజయ సాయి రెడ్డి ఫ్యామిలీతో తారక రత్న భార్య అలేఖ్యా రెడ్డి..

తారక రత్న- అలేఖ్యా రెడ్డి పిల్లలతో విజయ సాయి రెడ్డి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!