Singer Chinmayi: ‘ఇదేంటి మేడమ్! కూతురికి తండ్రి హగ్ ఇవ్వకూడదా? సింగర్ చిన్మయి పోస్టుపై నెటిజన్ల అభ్యంతరం

వైరముత్తు లాంటి ప్రముఖులపై సంచలన ఆరోపణలు చేసిన చిన్మయి ఇప్పుడు మహిళలు, చిన్న పిల్లలపై ఎక్కడ అఘాయిత్యాలు జరిగినా వెంటనే రియాక్ట్ అవుతోంది. సోషల్ మీడియా వేదికగా తన గళం వినిపిస్తోంది.ఇటీవలే ప్రముఖ నటుడు విజయ్ జాన్ వికృతాలను బయట పెట్టిన చిన్మయి తాజాగా మరో సంచలన పోస్ట్ పెట్టింది.

Singer Chinmayi: 'ఇదేంటి మేడమ్! కూతురికి తండ్రి హగ్ ఇవ్వకూడదా? సింగర్ చిన్మయి పోస్టుపై నెటిజన్ల అభ్యంతరం
Singer Chinmayi
Follow us
Basha Shek

|

Updated on: Jul 29, 2024 | 10:36 PM

టాలీవుడ్ స్టార్ సింగర్ చిన్మయి శ్రీపాద ఈ మధ్యన తరచూ వార్తల్లో నిలుస్తోంది. గతంలో తన ముద్దు ముద్దు పాటలతో అలరించిన ఈ బ్యూటిఫుల్ సింగర్ ఇప్పుడు తన సోషల్ మీడియా పోస్టులతో తరచూ ట్రెండ్ అవుతోంది. మీటూ ఉద్యమంలో భాగంగా వైరముత్తు లాంటి ప్రముఖులపై సంచలన ఆరోపణలు చేసిన చిన్మయి ఇప్పుడు మహిళలు, చిన్న పిల్లలపై ఎక్కడ అఘాయిత్యాలు జరిగినా వెంటనే రియాక్ట్ అవుతోంది. సోషల్ మీడియా వేదికగా తన గళం వినిపిస్తోంది.ఇటీవలే ప్రముఖ నటుడు విజయ్ జాన్ వికృతాలను బయట పెట్టిన చిన్మయి తాజాగా మరో సంచలన పోస్ట్ పెట్టింది. దీనిపై సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. తండ్రీ కూతుళ్ల బంధాన్ని కూడా తప్పుగా చూస్తున్నావంటూ నెటిజన్లు చిన్మయిని ట్రోల్ చేస్తున్నారు. ‘కొద్ది రోజుల క్రితం రెండేళ్ల నా కూతురుని రాహుల్ (భర్త) హగ్ చేసుకోబోతే తను వెంటనే నో అని చెప్పింది. దీంతో వెంటనే ‘నేను నిన్ను హగ్ చేసుకోమని ఫోర్స్ చేయడం లేదమ్మా.. కానీ నాన్నకి నువ్వు అంటే చాలా ఇష్టం అది మాత్రం నువ్వు గుర్తుంచుకో చాలు’ అంటూ తన కుమార్తెకు చెప్పాడు. అలానే తనని మళ్లీ హగ్ చేసుకోవడానికి వెళ్లలేదు రాహుల్. ఇది నేను కూడా స్ట్రిక్ట్ గా ఫాలో అవుతుంటాను. ఆరేడేళ్ల అమ్మాయి దగ్గరైనా సరే తన అనుమతి లేకుండా కనీసం ఆమె బుగ్గ కూడా నేను గిల్లను. అలాగే వాళ్ల తల్లిదండ్రుల పర్మిషన్ లేకుండా కనీసం టచ్ కూడా చేయను’ అంటూ ఒక పోస్ట్ పెట్టింది చిన్మయి.

ఇవి కూడా చదవండి

ఈ పోస్ట్ క్షణాల్లోనే వైరల్ గా మారింది. చిన్మయి షేర్ చేసిన పోస్ట్ ను పలువురు నెటిజన్లు తప్పుబట్టారు. తండ్రికూతుళ్ల బంధాన్ని కూడా తప్పుగా చూడటం కరెక్ట్ కాదంటూ చిన్మయిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వివాదంపై స్పందించిన చిన్మయి మళ్లీ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. ‘తండ్రికూతుళ్ల బంధం చాలా పవిత్రమైనది. కానీ మీరు దాంట్లో కూడా ప్రాబ్లమ్స్ వెతుకుతున్నారు అంటూ నన్ను విమర్శిస్తున్నారు. ఇది రాహుల్‌కి నేను చెప్పి చేయమన్నది కాదు. తనంతట తానే చేసిన పని. రాహుల్ అలా చేయడం వల్ల తనపై ఉన్న గౌరవం మరింత పెరిగింది. ఇక రాహుల్ విషయానికొస్తే అతను గొప్ప ఆల్ఫా మేల్.. మీలాంటి షిట్ కాదు’ అంటూ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చింది చిన్మయి. ప్రస్తుతం చిన్మయి పోస్టులు, వీడియోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. చాలా మంది వీటిని తప్పు పడుతున్నారు.

సింగర్ చిన్మయి వీడియో పోస్ట్..

అప్పన రాముని లంకను చుట్టుముట్టిన నీళ్లు .. వీడియో ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే