Harish Shankar: పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ అవుతుందా? డైరెక్టర్ హరీశ్ శంకర్ సమాధానమిదే..

పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ హీరోగా హరీశ్ శంకర్ తెరకెక్కిస్తోన్న సినిమా ఉస్తాద్‌ భగత్‌సింగ్‌. పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోన్న ఈ సినిమాలో యంగ్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో ప్రారంభమైంది. సినిమాకు సంబంధించి పవన్ కల్యాణ్ పోస్టర్స్, గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. ఇవి అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి

Harish Shankar: పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ అవుతుందా? డైరెక్టర్ హరీశ్ శంకర్ సమాధానమిదే..
Ustaad Bhagat Singh Movie
Follow us
Basha Shek

|

Updated on: Jul 29, 2024 | 8:49 AM

పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ హీరోగా హరీశ్ శంకర్ తెరకెక్కిస్తోన్న సినిమా ఉస్తాద్‌ భగత్‌సింగ్‌. పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోన్న ఈ సినిమాలో యంగ్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో ప్రారంభమైంది. సినిమాకు సంబంధించి పవన్ కల్యాణ్ పోస్టర్స్, గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. ఇవి అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయితే పవన్ కల్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండడం, ఏపీ అసెంబ్లీ ఎన్నికలు రావడంతో ఈ సినిమా షూటింగ్ ముందుకు కదలడం లేదు. దీంతో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై రోజుకో రూమర్ పుట్టుకొస్తోంది. సినిమా ఆగిపోయిందంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వీటికి ఎప్పటికప్పుడూ హరీశ్ శంకర్ కౌంటర్లు ఇస్తూనే ఉన్నారు. త్వరలోనే సినిమా మళ్లీ పట్టాలెక్కుతుందంటూ క్లారిటీ ఇస్తూనే ఉన్నారు. తాజాగా ఇదే విషయంపై మరోసారి స్పందించాడు హరీశ్ శంకర్. రవితేజ హీరోగా ఆయన తెరకెక్కించిన చిత్రం మిస్టర్ బచ్చన్. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించింది. టీజీ విశ్వప్రసాద్‌, వివేక్‌ కూచిభొట్ల సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే అన్నిహంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 15న గ్రాండ్ గా విడుదల కానుంది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో స్పీడ్ పెంచారు.ఇందులో భాగంగా తాజాగా టీజర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు.

ఇవి కూడా చదవండి

ఈ సందర్భంగానే మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన తనదైన శైలిలో బదులిచ్చారు డైరెక్టర్ హరీశ్ శంకర్. ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ రిలీజ్‌ అవుద్దా, లేదా? అని ఫ్యాన్స్‌ అడుగుతున్నారు. మీ సమాధానమేంటి? అన్న ప్రశ్నకు స్పందించిన ఆయన.. ‘దీని గురించి నేను ఫ్యాన్స్‌తో మాట్లాడతా’ అని ఆన్సర్ ఇచ్చారు. ‘కరోనా లాక్‌డౌన్‌ వల్ల నా సినిమాలకు కొంత విరామం వచ్చింది. పవన్‌ కల్యాణ్‌ పాలిటిక్స్‌లో బిజీగా ఉండడంతో ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ను కాస్త పక్కకు పెట్టి.. ‘మిస్టర్‌ బచ్చన్‌’ను పట్టాలెక్కించా. నా కెరీర్‌లో నేను వేగంగా చేసిన సినిమా ఇదే’ అంటూ క్లారిటీ ఇచ్చారు హరీశ్ శంకర్.

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు. అశుతోష్ రాణా, నవాబ్ షా, చమ్మక్ చంద్ర, గిరి, గౌతమి తదితరులు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

హరీశ్ శంకర్ ట్వీట్..

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో పవన్ కల్యాణ్..

డైరెక్టర్ హరీశ్ శంకర్ ,పవన్ కల్యాణ్ లతో శ్రీలీల..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే