AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anchor Divya: కూతురే కొడుకై.. తండ్రికి అంత్యక్రియలు నిర్వహించిన ప్రముఖ యాంకర్.. వీడియో చూస్తే కన్నీళ్లాగవు

సాధారణంగా ఇంట్లో ఎవరైనా మరణిస్తే వారి వారసులు అంత్యక్రియలు నిర్వహిస్తారు. అంటే కుమారులే తల్లిండ్రుల అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు. అయితే కొన్ని సందర్భాల్లో కుమార్తెలే తమ కన్నవారికి తల కొరివి పెడుతుంటారు. కొడుకులు ఉన్నా పట్టించుకోకపోవడం, అసలు కుమారులే లేకపోవడం తదితర సందర్భాల్లో కుమార్తెలే అంతిమ సంస్కారాలు నిర్వహిస్తుంటారు

Anchor Divya: కూతురే కొడుకై.. తండ్రికి అంత్యక్రియలు నిర్వహించిన ప్రముఖ యాంకర్.. వీడియో చూస్తే కన్నీళ్లాగవు
Anchor Divya
Basha Shek
|

Updated on: Jul 27, 2024 | 9:26 PM

Share

సాధారణంగా ఇంట్లో ఎవరైనా మరణిస్తే వారి వారసులు అంత్యక్రియలు నిర్వహిస్తారు. అంటే కుమారులే తల్లిండ్రుల అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు. అయితే కొన్ని సందర్భాల్లో కుమార్తెలే తమ కన్నవారికి తల కొరివి పెడుతుంటారు. కొడుకులు ఉన్నా పట్టించుకోకపోవడం, అసలు కుమారులే లేకపోవడం తదితర సందర్భాల్లో కుమార్తెలే అంతిమ సంస్కారాలు నిర్వహిస్తుంటారు. కేవలం సామాన్యులే కాదు.. వివిధ రంగాలకు చెందిన మహిళా సెలబ్రిటీలు కూడా తమ కన్నవారి చితికి నిప్పంటించడం మనం చూశాం . తాజాగా ఓ ప్రముఖ యాంకర్ కూడా ఇలాగే తన కన్న తండ్రికి తల కొరివి పెట్టింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళితే.. ప్రముఖ కన్నడ యాంకర్ దివ్య ఆలూర్ తండ్రి ఆలూర్ నాగప్ప కన్నుమూశారు. మంచి జానపద గాయకుడు, రచయితగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. వృద్ధాప్య సమస్యలతోనూ సతమతమవుతోన్న ఆయన గత కొన్ని రోజులుగా బెంగళూరులోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే తాజాగా ఆయన పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు. దీంతో నాగప్ప కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

కాగా నాగప్పకు కొడుకులు లేరు. దీంతో కుమార్తె యాంకర్ దివ్యనే కొడుకుగా మారింది. తమ కుటుంబ ఆచార పద్ధతుల ప్రకారం తండ్రికి అంతిమ సంస్కారాలు నిర్వహించింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్న ఆమె తన తండ్రితో ఉన్న అనుబంధాన్ని గుర్తుకు తెచ్చుకుని ఎమోషనలైంది. ‘ మానాన్న ఇక లేరనే నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. ఆయన మరణం మాకు పెద్ద లోటు’ అని కన్నీరుమున్నీరైంది. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తండ్రికి అంతిమ సంస్కారాలు నిర్వహించిన దివ్యపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే నాగప్ప మృతిపై ప్రముఖ సెలబ్రిటీలు సంతాపం తెలియజేస్తున్నారు. దివ్య కుటుంబానికి ధైర్యం చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

తండ్రికి అంత్యక్రియలు నిర్వహిస్తోన్న యాంకర్ దివ్య.. వీడియో

ఇక యాంకర్ దివ్య విషయానికి వస్తే.. పలు టీవీ షోలకు యాంకర్ గా వ్యవహరించి మంచి గుర్తింపు సంపాదించింది. తనదైన మాటలతో బుల్లితెర ఆడియెన్స్ ను అలరిస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..