AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Telugu 8: బిగ్‌బాస్‌లోకి జనసేన వీర మహిళ! ఈ వైజాగ్ బ్యూటీ స్పెషాలిటీ ఏంటో తెలుసా?

బర్రెలక్క, అబ్బాస్, రాజ్ తరుణ్, కుమారి ఆంటీ, యాదమ్మ రాజు, రీతూ చౌదరి, విష్ణుప్రియ, బుల్లెట్ భాస్కర్, పొట్టి రమేష్ తదితరుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే వీరందరిలోకి ఒక పేరు ఆసక్తికరంగా మారింది. అదే రేఖా భోజ్. వైజాగ్ కు చెందిన ఈ ముద్దుగుమ్మ కూడా హౌజ్ లోకి ఎంట్రీ ఇస్తుందని వార్తలు గుప్పుమంటున్నాయి.

Bigg Boss Telugu 8: బిగ్‌బాస్‌లోకి జనసేన వీర మహిళ! ఈ వైజాగ్ బ్యూటీ స్పెషాలిటీ ఏంటో తెలుసా?
Bigg Boss Telugu 8
Basha Shek
|

Updated on: Jul 26, 2024 | 8:16 PM

Share

బుల్లితెర ఆడియెన్స్ ను అలరించేందుకు బిగ్ బాస్ మళ్లీ వచ్చేస్తున్నాడు. ఈసారి మరిన్ని హంగులు, ఊహించని సెలబ్రిటీలతో మన ముందుకు వస్తున్నాడని తెలుస్తోంది. గత ఏడు సీజన్ల కంటే భిన్నంగా ఎనిమిదో సీజన్ ఉంటుందని, ‘అంతకు మించి’ అనేలా ఎంటర్ టైన్మెంట్ ఉంటుందని వార్తలు వస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే ఇప్పటికే బిగ్ బాస్ ప్రోమో కూడా రిలీజైంది. నయా సీజన్ లోగోను కూడా సరికొత్తగా డిజైన్ చేశారు. మరోవైపు కంటెస్టెంట్స్ ఎంపిక శరవేగంగా జరుగుతోంది. ఈసారి కూడా ఎక్కువ మంది బుల్లితెర నటీనటులు, యాంకర్స్, పోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్స్, యూట్యూబర్లు , కొందరు వివాదాస్పద వ్యక్తులు బిగ్ బాస్ హౌ జ్ ‌లో అడుగుపెట్టే అవకాశాలున్నాయని తెలుస్తోంది. బర్రెలక్క, అబ్బాస్, రాజ్ తరుణ్, కుమారి ఆంటీ, యాదమ్మ రాజు, రీతూ చౌదరి, విష్ణుప్రియ, బుల్లెట్ భాస్కర్, పొట్టి రమేష్ తదితరుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే వీరందరిలోకి ఒక పేరు ఆసక్తికరంగా మారింది. అదే రేఖా భోజ్. వైజాగ్ కు చెందిన ఈ ముద్దుగుమ్మ కూడా హౌజ్ లోకి ఎంట్రీ ఇస్తుందని వార్తలు గుప్పుమంటున్నాయి.

బిగ్‌బాస్ 8 కోసం నిర్వాహకులు రేఖా భోజ్ ను సంప్రదించగా ఆమె ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇక రేఖా భోజ్ అసలు పేరు శ్రీ సుష్మ. మాంగళ్యం, దామిని విల్లా, రంగేలా, కళ్యాణ తస్మై నమ: తదితర సినిమాల్లో నటించింది. అయితే ప్రస్తుతం వైజాగ్ లోనే ఎక్కువగా ఉంటోన్న ఈ ముద్దుగుమ్మ సొంతంగా స్టూడియో పెట్టుకుని కవర్ సాంగ్‌లు, వీడియో ఆల్బమ్స్ చేస్తూ నెట్టింట తెగ సందడి చేస్తోంది. ఆ మధ్యన టీమిండియా వన్డే ప్రపంచకప్ గెలిస్తే విశాఖ బీచ్ లో స్ట్రీకింగ్ చేస్తానంటూ సంచలన ప్రకటన చేసింది ఈ అందాల తారే. ఇక పవన్ కల్యాణ్ కు వీరాభిమాని అయిన రేఖ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన తరఫున విస్తృతంగా ప్రచారం చేసింది. అలా పవన్ ఫ్యాన్స్ కు బాగా చేరువైపోయిందీ ముద్దుగుమ్మ.

ఇవి కూడా చదవండి

జనసేన కండువాతో రేఖా భోజ్..

ముక్కుసూటితనం, మంచి మాటకారి కావడంతో బిగ్ బాస్ నిర్వాహకులు రేఖను సంప్రదించారని టాక్. హౌజ్ లోకి వచ్చేందుకు ఆమె కూడా సుముఖంగా ఉన్నారని సమాచారం. మరి రేఖా భోజ్‌కు బిగ్‌బాస్ 8లో కంటెస్టెంట్‌గా అవకాశం దక్కిందో లేదో తెలియాలంటే షో లాంఛ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..