AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kargil Vijay Diwas: కార్గిల్ వార్‌లో పాల్గొన్న ఏకైక హీరో.. 2 వారాల పాటు భారత సైనికులకు తోడు నీడగా.. ఎవరంటే?

పాక్‌ సైన్యంపై భారత ఆర్మీ సాధించిన విజయానికి గుర్తుగా ఏటా జులై 26న కార్గిల్ విజయ్ దివస్ ను జరుపుకొంటున్నారు. కాగా ఈ కార్గిల్ పోరాటంలో ఒక భారతీయ నటుడు కూడా పోరాడారు. సైనికులకు తోడుగా సుమారు రెండు వారాల పాటు సేవలందించారు. ఎలైట్ ఫోర్స్, క్విక్ రియాక్షన్ టీమ్ వంటి రెండు భాగాల్లో పనిచేసి మాతృభూమి రుణం తీర్చుకున్నాడు. ఆయన మరెవరో కాదు..

Kargil Vijay Diwas: కార్గిల్ వార్‌లో పాల్గొన్న ఏకైక హీరో.. 2 వారాల పాటు భారత సైనికులకు తోడు నీడగా.. ఎవరంటే?
Bollywood Actor
Basha Shek
|

Updated on: Jul 26, 2024 | 4:44 PM

Share

కార్గిల్.. ఈ పేరు వింటేనే ప్రతి భారతీయుడి గుండె  గర్వంగా ఉప్పొంగిపోతుంది. సరిహద్దులను దాటుకుని అక్రమంగా మనదేశంలోకి చొరబడిన పాకిస్తాన్ సైన్యాన్ని, మిలిటెంట్లను భారత సైన్యం తరిమికొట్టిన తీరును చూసి మురిసిపోతుంది. 1999లో జరిగిన కార్గిల్ యుద్ధంలో 500 కు పైగా భారత సైనికులు మరణించారు. పాక్‌ సైన్యంపై భారత ఆర్మీ సాధించిన విజయానికి గుర్తుగా ఏటా జులై 26న కార్గిల్ విజయ్ దివస్ ను జరుపుకొంటున్నారు. కాగా ఈ కార్గిల్ పోరాటంలో ఒక భారతీయ నటుడు కూడా పోరాడారు. సైనికులకు తోడుగా సుమారు రెండు వారాల పాటు సేవలందించారు. ఎలైట్ ఫోర్స్, క్విక్ రియాక్షన్ టీమ్ వంటి రెండు భాగాల్లో పనిచేసి మాతృభూమి రుణం తీర్చుకున్నాడు. ఆయన మరెవరో కాదు బాలీవుడ్ సీనియర్ యాక్టర్ నానా పటేకర్. హిందీ చిత్ర పరిశ్రమలో వందాలాది చిత్రాల్లో నటించి వర్సటైల్ యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నారాయ. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన నానా 1999 కార్గిల్ యుద్ధంలో తను పాల్గొన్న రోజులను గుర్తుచేసుని ఎమోషనల్ అయ్యారు.

‘1999 కార్గిల్ వార్ లో నేను క్విక్ రియాక్షన్ టీమ్‌లో సభ్యుడిని. ఇది అత్యంత ఉన్నత శక్తులలో ఒకటి. యుద్ధం సమయంలో నేను సుమారు రెండు వారాల పాటు సైనికులతో ఉన్నాను. కనీసం ఇలా అయిన మన దేశం కోసం సేవలందించాను. దేశానికి సైనికులే నిజమైన హీరోలు. దేశ భద్రత కోసం తూటాలు పేల్చాలని, మన గొప్ప ఆయుధం బోఫోర్స్, ఏకే 47 కాదు, మన జవాన్లు. మొదట నా దేశం. నా దేశం దాటి నాకు ఎవరూ ఎక్కువ కాదు. నా దేశం ముందు ఒక కళాకారుడు చాలా చిన్నవాడు’ అని ఇలా పలు సందర్భాల్లో భారత సైనికుల గురించ గొప్పగా చెప్పుకొచ్చారు నానా పటేకర్. కాగా ఆయన తెలుగులో నేరుగా సినిమాలు చేయకపోయినా పలు డబ్బింగ్ సినిమాలతో ఇక్కడి ఆడియెన్స్ కు బాగా చేరువయ్యాడు. రజనీకాంత్ తో కలిసి కాలా సినిమాలో నటించిన నానా పటేకర్ గతేడాది విడుదలైన ది వ్యాక్సిన్ వార్ మూవీలో కీలక పాత్ర పోషించారు.

ఇవి కూడా చదవండి

కార్గిల్ యుద్ధ సమయంలో భారత సైనికులతో నానా పటేకర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి