Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: లీడర్ మూవీలోని ఈ యంగ్ బాయ్‌ను గుర్తు పట్టారా? ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన టాలీవుడ్ సెలబ్రిటీ

ఇదే లీడర్ మూవీలో మరొక టాలీవుడ్ సెలబ్రిటీ కనిపించాడు. పై ఫొటో చూశారుగా.. ఇందులో రానా, రిచా బైక్ పై వెళుతుంటే ఇద్దరు కుర్రాళ్లు హీరోయిన్ కు సైడ్ కొడుతారు. అయితే రానా హెల్మెట్ తీయగానే అక్కడి నుంచి పరుగు లంకించుకుంటారు. ఆ ఇద్దరు కుర్రాళ్లలో ఒకరు లైట్ బ్లూ టీ షర్ట్ అండ్ కళ్లజోడు పెట్టుకుని, గుబురు గడ్డంతో కనిపించాడు. ఆ యంగ్ బాయ్ ఎవరో తెలుసా?

Tollywood: లీడర్ మూవీలోని ఈ యంగ్ బాయ్‌ను గుర్తు పట్టారా? ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన టాలీవుడ్ సెలబ్రిటీ
Leader Movie
Follow us
Basha Shek

|

Updated on: Jul 25, 2024 | 6:10 PM

దగ్గుబాటి వారసుడు రానా దగ్గుబాటి హీరోగా పరిచయమైన చిత్రం లీడర్. టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న శేఖర్ కమ్ముల ఈ సినిమాను తెరకెక్కించాడు. 2010లో వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మరీ ముఖ్యంగా రానా దగ్గుబాటికి సరైన ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీలో రిచా గంగోపాధ్యాయ, ప్రియా ఆనంద్ హీరోయిన్లుగా నటించారు. అయితే ఇదే లీడర్ మూవీలో మరొక టాలీవుడ్ సెలబ్రిటీ కనిపించాడు. పై ఫొటో చూశారుగా.. ఇందులో రానా, రిచా బైక్ పై వెళుతుంటే ఇద్దరు కుర్రాళ్లు హీరోయిన్ కు సైడ్ కొడుతారు. అయితే రానా హెల్మెట్ తీయగానే అక్కడి నుంచి పరుగు లంకించుకుంటారు. ఆ ఇద్దరు కుర్రాళ్లలో ఒకరు లైట్ బ్లూ టీ షర్ట్ అండ్ కళ్లజోడు పెట్టుకుని, గుబురు గడ్డంతో కనిపించాడు. ఆ యంగ్ బాయ్ ఎవరో తెలుసా? అతను ఇప్పుడు టాలీవుడ్ లో ది మోస్ట్ ఫేమస్ సెలబ్రిటీ. ఒక్క సినిమాతోనే బాక్సాఫీస్ ను షేక్ చేశాడు. డైరెక్టర్ గా ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టేస్తున్న ఆ యంగ్ బాయ్ మరెవరో కాదు కల్కి 2898ఏడీ దర్శకుడు నాగ్ అశ్విన్. కల్కి సినిమా కలెక్షన్ల ప్రభంజనం నేపథ్యంలో నాగీ పాత ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.

డైరెక్టర్ శేఖర్ కమ్ముల ప్రియమైన శిష్యుల్లో ఒకరైన నాగ్ అశ్విన్ కెరీర్ ప్రారంభంలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేశాడు. లీడర్, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ చిత్రాలకు పనిచేయడమే కాకుండా క్యామియో రోల్స్ లోనూ తళుక్కుమన్నాడు. అయితే అప్పటికీ అతను అంతగా ఫేమస్ కాకపోవడంతో ఎవరూ గుర్తు పట్టలేకపోయారు. నాని, విజయ్ దేవరకొండలతో కలిసి ఎవడే సుబ్రమణ్యం సినిమాతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడీ ట్యాలెంటెడ్ డైరెక్టర్. ఆ తర్వాత మహానటి సావిత్ర జీవితకథను తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలు పొందాడు. ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ తో కలిసి కల్కి 2898 ఏడీ సినిమాను తెరకెక్కించాడు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, శోభన లాంటి బిగ్ స్టార్స్ ను ఓకే వేదిక మీదకు తెచ్చి కల్కి వంటి సెన్సేషనల్ మూవీని రూపొందించాడు. ఇప్పటికే ఈ సినిమా రూ.1100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

ఇవి కూడా చదవండి

1100 కోట్ల క్లబ్ లో ప్రభాస్ కల్కి సినిమా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వారంలో మెగా DSC 2025 నోటిఫికేషన్.. దరఖాస్తు విధానంలో పలు మార్పులు
వారంలో మెగా DSC 2025 నోటిఫికేషన్.. దరఖాస్తు విధానంలో పలు మార్పులు
మళ్ళీ పెద్ద మనసు చాటుకున్న పవన్ కళ్యాణ్.. గిరిజనుల మోముల్లో ఆనందం
మళ్ళీ పెద్ద మనసు చాటుకున్న పవన్ కళ్యాణ్.. గిరిజనుల మోముల్లో ఆనందం
తెలుగు ఐకానిక్ సాంగ్‌కు అసభ్యకర డాన్స్..
తెలుగు ఐకానిక్ సాంగ్‌కు అసభ్యకర డాన్స్..
వేసవిలో ఎండుద్రాక్షఎలా తినాలో తెలుసా.. లేదంటే ఆరోగ్యానికి హానికరం
వేసవిలో ఎండుద్రాక్షఎలా తినాలో తెలుసా.. లేదంటే ఆరోగ్యానికి హానికరం
ఇది గమనించారా.. SRH ఓటమికి కాటేరమ్మ కొడుకే కారణం?
ఇది గమనించారా.. SRH ఓటమికి కాటేరమ్మ కొడుకే కారణం?
బిగ్ షాక్.. TGPSC గ్రూప్ 1 నియామకాలు నిలిపివేస్తూ హైకోర్టు స్టే..
బిగ్ షాక్.. TGPSC గ్రూప్ 1 నియామకాలు నిలిపివేస్తూ హైకోర్టు స్టే..
పెండింగ్ పనులు పూర్తి అయ్యేందుకు ఏకాదశి రోజున ఈ పరిహారాలు చేయండి
పెండింగ్ పనులు పూర్తి అయ్యేందుకు ఏకాదశి రోజున ఈ పరిహారాలు చేయండి
JEE Main 2025 ఫలితాలపై వీడని ఉత్కంఠ.. ఫైనల్ కీ ఎందుకు తొలగించారో?
JEE Main 2025 ఫలితాలపై వీడని ఉత్కంఠ.. ఫైనల్ కీ ఎందుకు తొలగించారో?
కోహ్లీ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. పంజాబ్‌తో మ్యాచ్ రద్దయ్యేనా?
కోహ్లీ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. పంజాబ్‌తో మ్యాచ్ రద్దయ్యేనా?
అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ట్విట్టర్ రివ్యూ
అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ట్విట్టర్ రివ్యూ