Sundeep Kishan: ‘దేవుడు సార్ మీరు’.. రోజూ 350 మందికి ఉచితంగా భోజనాలు పంపిస్తున్న హీరో సందీప్ కిషన్

మన సినిమా తారలకు కోట్లలో ఆస్తులున్నాయి. ఇలా సంపాదించిన దానితో సేవా కార్యక్రమాలు చేస్తున్న వారు మన ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి మొదలుకుని చిన్న హీరోలు సైతం సేవా కార్యక్రమాల్లో పాల్గొనడమే కాక తమ వంతు సహాయం చేస్తున్నారు. అయితే ఇంత మంచి పనులు చేస్తున్నా కొంతమంది అసలు బయటకు చెప్పుకోరు. టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ సరిగ్గా ఈ కోవకే చెందుతాడు.

Sundeep Kishan: 'దేవుడు సార్ మీరు'.. రోజూ 350 మందికి ఉచితంగా భోజనాలు పంపిస్తున్న హీరో సందీప్ కిషన్
Sundeep Kishan
Follow us
Basha Shek

|

Updated on: Jul 24, 2024 | 5:54 PM

మన సినిమా తారలకు కోట్లలో ఆస్తులున్నాయి. ఇలా సంపాదించిన దానితో సేవా కార్యక్రమాలు చేస్తున్న వారు మన ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి మొదలుకుని చిన్న హీరోలు సైతం సేవా కార్యక్రమాల్లో పాల్గొనడమే కాక తమ వంతు సహాయం చేస్తున్నారు. అయితే ఇంత మంచి పనులు చేస్తున్నా కొంతమంది అసలు బయటకు చెప్పుకోరు. టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ సరిగ్గా ఈ కోవకే చెందుతాడు. ప్రస్తుతం హీరోగా నటిస్తూనే మరికొన్ని సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నాడీ హ్యాండ్సమ్ యాక్టర్. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా తెరకెక్కిన రాయన్ సినిమాలో ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమా జులై 26 రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సందీప్ కిషన్ మీడియాతో ముచ్చటించాడు. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. అందులో భాగంగా తాను నిర్వహిస్తోన్న వివాహ భోజనంబు అనే రెస్టారెంట్స్ గురించి కూడా పలు ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నాడు.

నెలకు రూ. 4లక్షల విలువైన ఆహారం ఫ్రీగా..

కాగా వివాహ భోజనంబు రెస్టారెంట్ కు మొత్తం ఏడు బ్రాంచ్ లు ఉన్నాయి. అయితే ప్రతి బ్రాంచ్ రెస్టారెంట్స్ నుంచి ప్రతిరోజూ ఉచితంగా 50 మందికి భోజనాలు పంపిస్తున్నాడట. అవసరం ఉన్న పేదలు, కూలీలు, అనాథశ్రమాలు, వృద్ధాశ్రమాలకు డైలీ ఒక్కో రెస్టారెంట్ నుంచి 50 మందికి ఫుడ్ పంపిస్తున్నాడట. అంటే రోజూ సుమారు 350 మంది పేదల కడుపు నింపుతున్నాడన్నమాట. అలాగే దాదాపు నెలకు నాలుగున్నర లక్షల విలువ చేసే ఆహారాన్ని ఉచితంగా పంచి పెడుతున్నట్లు సందీప్ కిషన్ చెప్పుకొచ్చాడు. ‘ ఒక హీరోగా ప్రజలకు నేనేమి చేయగలను అని ఆలోచించినప్పుడు రెస్టారెంట్స్ ఏర్పాటు చేశాను. దీని ద్వారా చాలా మందికి ఉపాధి కల్పించాను. అలాగే ఎంతో మంది కడుపు నింపుతున్నాను’ అని చెప్పుకొచ్చాడీ ట్యాలెంటెడ్ హీరో.

ఇవి కూడా చదవండి

అన్న క్యాంటీన్ల తరహాలోనే సబ్సిడీ క్యాంటీన్లు..

కాగా అన్న క్యాంటీన్ల తరహాలోనే త్వరలోనే సబ్సిడీ క్యాంటిన్లు ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నాట సందీప్ కిషన్. ప్రస్తుతం దాని గురించి వర్క్​ చేస్తున్నట్టు చెప్పాడీ యంగ్ హీరో. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రియులు, అభిమానులు, ప్రజలు సందీప్ కిషన్ చేస్తున్న మంచి పనిని అభినందిస్తున్నారు. ‘రియల్ హీరో’ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

ధనుష్ తో హీరో సందీప్ కిషన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పోడియంలోనూ త్రిల్లింగ్ ఇన్సిడెంట్స్.. లైవ్ మ్యాచ్‌లో ఏంజరిగిందంటే
పోడియంలోనూ త్రిల్లింగ్ ఇన్సిడెంట్స్.. లైవ్ మ్యాచ్‌లో ఏంజరిగిందంటే
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
డెడ్ బాడీ ఇంటికి డోర్ డెలివరీ కేసులో కీలక విషయాలు
డెడ్ బాడీ ఇంటికి డోర్ డెలివరీ కేసులో కీలక విషయాలు
ఓ యువ రైతు వినూత్న ఆలోచన.. విద్యుత్ కాంతుల మధ్య చామంతి సాగు..
ఓ యువ రైతు వినూత్న ఆలోచన.. విద్యుత్ కాంతుల మధ్య చామంతి సాగు..
పుష్ప 2 మూవీ క్లైమాక్స్.. థియేటర్‌లోకి పోలీసుల ఎంట్రీ! ఆ తర్వాత
పుష్ప 2 మూవీ క్లైమాక్స్.. థియేటర్‌లోకి పోలీసుల ఎంట్రీ! ఆ తర్వాత
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
సఫల ఏకాదశి వ్రతం మహత్యం.. పూజ శుభ సమయం? విధానం ఏమిటంటే..
సఫల ఏకాదశి వ్రతం మహత్యం.. పూజ శుభ సమయం? విధానం ఏమిటంటే..
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లక్ష్యంగా తెంబా మాస్టర్ ప్లాన్..!
టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లక్ష్యంగా తెంబా మాస్టర్ ప్లాన్..!