Pawan Kalyan: ఎమ్మెస్సీ పూర్తి చేసిన పవన్ కల్యాణ్ ‘బంగారం’ మూవీ ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడెలా ఉందో చూశారా?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన హిట్ సినిమాల్లో ఒకటి. ధరణి తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో మీరా చోప్రా హీరోయిన్ గా నటించింది. అలాగే రీమాసేన్ ఒక స్పెషల్ సాంగ్ లో సందడి చేసింది. కాగా ఇదే సినిమాలో మీరా చోప్రా చెల్లిగా నటించిన ఓ చిన్నారి కూడా అందరికీ గుర్తుండే ఉంటుంది.

Pawan Kalyan: ఎమ్మెస్సీ పూర్తి చేసిన పవన్ కల్యాణ్ 'బంగారం' మూవీ ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడెలా ఉందో చూశారా?
Pawan Kalyan Bangaram Movie
Follow us
Basha Shek

|

Updated on: Jul 22, 2024 | 10:19 PM

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన హిట్ సినిమాల్లో ఒకటి. ధరణి తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో మీరా చోప్రా హీరోయిన్ గా నటించింది. అలాగే రీమాసేన్ ఒక స్పెషల్ సాంగ్ లో సందడి చేసింది. కాగా ఇదే సినిమాలో మీరా చోప్రా చెల్లిగా నటించిన ఓ చిన్నారి కూడా అందరికీ గుర్తుండే ఉంటుంది. తన పేరు సనూషా సంతోష్.  చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ మొదలుపెట్టిన ఈ చిన్నారి మలయాళంలో దాదాపు 20 సినిమాలకు పైగా నటించింది. ఆ తర్వాత ఏకంగా హీరోయిన్ గా మారిపోయింది. ఈ క్రమంలోనే.. 2012లో మిస్టర్‌ ‘మురుగన్‌’ అనే సినిమాతో హీరోయిన్ గా వెండితెరకు పరిచయం అయ్యింది. తెలుగులో ‘రేణిగుంట’, ‘జీనియస్‌’ వంటి చిత్రాల్లోనూ నటించి మెప్పించింది. అలాగే నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన జెర్సీ సినిమాలో చిన్న పాత్రలో కనిపించి ప్రేక్షకులను మెప్పించింది. అయితే జెర్సీ సినిమా తర్వాత సనూషా సినిమాలకు దూరంగా ఉండిపోయింది. మళ్లీ చదువుపై దృష్టి సారించింది. తాజాగా ఆమె ఎంఎస్సీ పూర్తి చేసింది. స్కాట్లాండ్‌లోని ఎడిన్‌బర్గ్ విశ్వవిద్యాలయంలో గ్లోబల్ మెంటల్ హెల్త్ అండ్ సొసైటీలో మాస్టర్ ఆఫ్ సైన్స్‌ను చదివిన ఆమె లేటెస్ట్ గా గ్రాడ్యుయేషన్ వేడుకకు హాజరై ఎంఎస్సీ డిగ్రీ పట్టా పొందింది. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన సనూష ఒక సుదీర్ఘమైన పోస్ట్ ను షేర్ చేసింది.

‘నేను ఇల్లు కోల్పోయాను, ఎన్నో సార్లు ఏడ్చాను. నిద్రలేని రాత్రులు గడిపాను. ఎన్నో పార్ట్ టైమ్, ఫుల్ టైమ్ జాబ్స్ చేశాను. ఆరోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడి, డిప్రెషన్, ఇలా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. చివరికి సాధించాను. నన్ను కంటికి రెప్పలా కాపాడుతున్నందుకు నా కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు. నాకు అవసరమైనప్పుడల్లా నాకు తోడుగా నిలిచిన నా ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదాలు. ఈ విజయాన్ని మీ అందరికీ అంకితమిస్తున్నాను. నేను యూనివర్శిటీ ఆఫ్ ఎడిన్‌బర్గ్ నుండి MSc గ్రాడ్యుయేట్ పట్టా పొందడం సంతోషంగా, గర్వంగా ఉంది’ అంటూ రాసుకొచ్చింది సనూష. ప్రస్తుతం ఈ పోస్ట్, సనూష ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. మరి పీజీ పట్టా అందుకున్న సనూష మళ్లీ సినిమాల్లోకి వస్తుందేమో చూడాలి.

ఇవి కూడా చదవండి

సనూషా సంతోష్ లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ ఫోటోస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!