AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jasmin Bhasin: కళ్లకు కాంటాక్ట్ లెన్స్ వాడుతున్నారా? టాలీవుడ్ యంగ్ హీరోయిన్‌కు ఏం జరిగిందో తెలుసా?

లెన్స్ సరిగ్గా ఉపయోగించకపోతే ఒక్కోసారి కంటి చూపు పోయే పరిస్థితి కూడా వస్తుంటుంది. తాజాగా టాలీవుడ్ యంగ్ హీరోయిన్ కు ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. లెన్స్ సరిగ్గా ఉపయోగించకపోవడం వల్ల ఇప్పుడు తనకు కళ్లు కనిపించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది.

Jasmin Bhasin: కళ్లకు కాంటాక్ట్ లెన్స్ వాడుతున్నారా? టాలీవుడ్ యంగ్ హీరోయిన్‌కు ఏం జరిగిందో తెలుసా?
Jasmin Bhasin
Basha Shek
|

Updated on: Jul 21, 2024 | 1:43 PM

Share

దృష్టి సమస్యలు అధిగమించేందుకు, చూపు స్పష్టంగా ఉండేందుకు చాలా మంది కళ్లద్దాలు ఉపయోగిస్తుంటారు. అయితే చాలా మంది గ్లాసెస్ ను ధరించడానికి ఇష్టపడరు. వీటి బదులు లేటెస్ట్ ట్రెండ్ కాంటాక్ట్ లెన్స్ వాడుతారు. అయితే వీటిని ఉపయోగించడం అంత సులభమేమీ కాదు. వీటి నిర్వహణలో నిత్యం జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలి. వైద్యులు కూడా లెన్స్ ఉపయోగించడంపై తరచూ పలు జాగ్రత్తలు సూచిస్తారు. లెన్స్ సరిగ్గా ఉపయోగించకపోతే ఒక్కోసారి కంటి చూపు పోయే పరిస్థితి కూడా వస్తుంటుంది. తాజాగా టాలీవుడ్ యంగ్ హీరోయిన్ కు ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. లెన్స్ సరిగ్గా ఉపయోగించకపోవడం వల్ల ఇప్పుడు తనకు కళ్లు కనిపించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది. బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన జాస్మిన్ బాసిన్ తెలుగు వారికి కూడా సుపరిచితమే. తెలుగులో ‘దిల్లున్నోడు’ ‘వేట’, ‘లేడీస్ & జెంటిల్మన్’ మూవీస్ లో నటించిందీ అందాల తార. అలాగే పలు కన్నడ, మలయాళ, తమిళ సినిమాల్లోనూ నటించి అక్కడి ప్రేక్షకుల మెప్పు పొందింది. అంతకు ముందు హిందీ బిగ్ బాస్ 14, ఖత్రోంకి ఖిలాడీ తదితర రియాలిటీ షోల్లోనూ పాల్గొని గుర్తింపు తెచ్చుకుంది.

ఇదిలా ఉంటే లెన్స్ ఉపయోగించడం కారణంగా ప్రస్తుతం తీవ్ర ఇబ్బందులు పడుతోంది జాస్మిన్ బాసిన్. ‘జూలై 17న ఒక ముఖ్యమైన పని కోసం ఢిల్లీలో ఉన్నాను. ప్రోగ్రాంకు రెడీ అవుతున్న టైంలో కళ్లకు లెన్స్ పెట్టుకోగానే ఎందుకో చాలా నొప్పిగా అనిపించింది. ఆతర్వాత ఆ నొప్పి మరింత ఎక్కువైపోయింది. దీంతో ఆ ఈవెంట్‌లో సన్ గ్లాసెస్ పెట్టుకుని ఎలాగోలా మేనేజ్ చేశాను. అయితే ఒకానొక సమయంలో నాకేం కనిపించలేదు. అంత చీకటిగా అనిపించింది. ఎలాగోలా కష్టమ్మీద పని పూర్తిచేసి డాక్టర్ దగ్గరికి వెళ్లాను. కార్నియా డ్యామేజ్ అయిందని చెప్పి కళ్లకు బ్యాండేజ్ వేశారు. కానీ ఈ నొప్పి తగ్గడానికి కనీసం 4-5 రోజులు పడుతుందని డాక్టర్స్ చెప్పారు. కానీ నొప్పి మాత్రం భరించలేనంతగా ఉంది. దీని వల్ల సరిగా చూడలేకపోతున్నా, నిద్ర కూడా సరిగా పట్టడం లేదు’ అని జాస్మిన్ బాసిన్ వాపోయింది. ప్రస్తుతం ఆమె కళ్లకు వైట్ బ్యాండేజీతో కనిపిస్తోంది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. వీటిని చూసిన వారు జాస్మిన్ లెన్స్ సరైన రీతిలో ఉపయోగించకపోవడం వల్లే ఇలాంటి ఇబ్బంది కలిగి ఉండొచ్చని కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

జాస్మిన్ బాసిన్ లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ ఫొటోస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.