Pallavi Prashanth: రైతుబిడ్డా యాడున్నావ్? అన్నదాతలకు ఇస్తానన్న పైసలేవి? పల్లవి ప్రశాంత్‌ను ఏకిపారేశాడుగా!

బిగ్ బాస్ తెలుగు ఏడో సీజన్ ముగిసి సుమారు ఏడెనిమది నెలలు అవుతుంది. అప్పుడే ఎనిమిదో సీజన్ సన్నాహకాలు కూడా ప్రారంభమయ్యాయి. ఇందుోసం కంటెస్టెంట్ల వేట కూడా పెద్ద ఎత్తున కొనసాగుతోందని తెలుస్తోంది. అయితే 'రైతు బిడ్డ ' ట్యాగ్ తో బిగ్ బాస్ ఏడో సీజన్ విజేతగా నిలిచిన పల్లవి ప్రశాంత్ మాత్రం అన్నదాతలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతున్నాడని సామాజిక మాధ్యమాల్లో విమర్శల వర్షం కురుస్తోంది

Pallavi Prashanth: రైతుబిడ్డా యాడున్నావ్? అన్నదాతలకు ఇస్తానన్న పైసలేవి? పల్లవి ప్రశాంత్‌ను ఏకిపారేశాడుగా!
Pallavi Prashanth
Follow us
Basha Shek

|

Updated on: Jul 20, 2024 | 11:59 AM

బిగ్ బాస్ తెలుగు ఏడో సీజన్ ముగిసి సుమారు ఏడెనిమది నెలలు అవుతుంది. అప్పుడే ఎనిమిదో సీజన్ సన్నాహకాలు కూడా ప్రారంభమయ్యాయి. ఇందుోసం కంటెస్టెంట్ల వేట కూడా పెద్ద ఎత్తున కొనసాగుతోందని తెలుస్తోంది. అయితే ‘రైతు బిడ్డ ‘ ట్యాగ్ తో బిగ్ బాస్ ఏడో సీజన్ విజేతగా నిలిచిన పల్లవి ప్రశాంత్ మాత్రం అన్నదాతలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతున్నాడని సామాజిక మాధ్యమాల్లో విమర్శల వర్షం కురుస్తోంది. రైతు బిడ్డ ఇచ్చిన మాటను గట్టు మీద పెట్టేశాడని, షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్, టీవీషోలతో అతను తీరిక లేనంత బిజీగా మారిపోయాడని ట్రోల్ చేస్తున్నారు. తాజాగా ఇదే విషయంపై బిగ్ బాస్ విన్నర్ ను ఏకి పారేశారు ప్రముఖ యూట్యూబర్ యువ సామ్రాట్ రవి. బిగ్ బాస్ ఎనిమిదో సీజన లో యువ సామ్రాట్ రవి కూడా కంటెస్టెంట్ గా వస్తాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. తాజాగా ఇదే విషయంపై స్పందించిన ఆయన.. గత సీజన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ పై విమర్శల వర్షం కురిపించాడు. ల్లవి ప్రశాంత్ ఆడిన డ్రామాలు.. రైతుల్ని మోసం చేసిన తీరు చూస్తుంటే అలు బిగ్ బాస్ కు వెళ్లాలనే ఇంట్రెస్ట్ పోయిందంటూ సంచలన కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది.

‘నాకు కూడా బిగ్ బాస్‌కి వెళ్లాలని ఉండేది. కానీ లాస్ట్ సీజన్ చూశాక ఇక బిగ్ బాస్‌కి వెళ్లాలనే ఆసక్తి పయిది. ఎందుకంటే లాస్ట్ సీజన్ లో చాలా పెద్ద డ్రామా నడిచింది. ముఖ్యంగా రైతు బిడ్డ పేరుతో హౌజ్ లోకి వచ్చిన పల్లవి ప్రశాంత్ సింపథీ డ్రామా మామూలుగా ఆడలేదు. ‘ నేను రైతు బిడ్డనమ్మా.. విజేతగా నిలిస్తే పేద రైతులకే మొత్తం పైసలిస్తానమ్మా’ అని డప్పాలు కొట్టాడు. బాగా డ్రామాలు ఆడి విజేతగా నిలిచాడు. కానీ ఇప్పుడు శుభ్రంగా ఆ డబ్బుతో ఎంజాయ్ చేస్తున్నాడు. కారు కూడా కొనుకున్నాడు. రైతు బిడ్డ కారు కొనుక్కోవచ్చు. అందులో తప్పేం లేదు. కానీ రైతుల పేరు చెప్పుకుని కాదు. రైతుకి ఇస్తానన్న డబ్బులైనా ఇవ్వాలి కదా. ఈ రైతుబిడ్డ కన్నింగ్ డ్రామాలు చూసిన తరువాత.. బిగ్ బాస్‌ హౌజ్ కు వెళ్లాలనే ఇంట్రెస్ట్ చచ్చిపోయింది’ అంటూ పల్లవి ప్రశాంత్ ను ఒక ఆట ఆడుకున్నాడు యువ సామ్రాట్ రవి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

ఇవి కూడా చదవండి

శుభశ్రీ రాయగురు బర్త్ డే వేడుకల్లో పల్లవి ప్రశాంత్..

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా