AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss :ఈ ద్వేషాన్ని తట్టుకోలేకపోతున్నాను.. నా భర్తతో విడిపోతాను.. బిగ్‏బాస్ కంటెస్టెంట్..

ఈషోలోకి యూట్యూబర్ అర్మాన్ మాలిక్ తన ఇద్దరు భార్యలు పాయల్, కృతికతో కలిసి హౌస్ లోకి అడుగుపెట్టాడు. అయితే ముందు నుంచి అర్మాన్ గురించి అనేక విమర్శలు వచ్చాయి. ఇటీవలే తోటి కంటెస్టెంట్ పై అర్మాన్ చేయి చేసుకోవడంపై నెటిజన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఇప్పుడు అర్మాన్ మొదటి భార్య పాయల్ విడాకులు తీసుకోవడానికి రెడీ అయ్యింది.

Bigg Boss :ఈ ద్వేషాన్ని తట్టుకోలేకపోతున్నాను.. నా భర్తతో విడిపోతాను.. బిగ్‏బాస్ కంటెస్టెంట్..
Armaan Malik
Rajitha Chanti
|

Updated on: Jul 20, 2024 | 2:57 PM

Share

బిగ్‏బాస్ రియాల్టీ షోకు ఉండే ఆదరణ గురించి చెప్పక్కర్లేదు. కానీ ఈ షో ఎప్పుడూ వివాదాలతోనే వార్తలలో నిలుస్తుంటుంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ ఇలా అన్ని భాషల్లోనూ ఈ షోకు మంచి రెస్పాన్స్ వచ్చినప్పటికీ.. చాలా సందర్భాల్లో ఈ షో వివాదాస్పదమవుతుంటుంది. ఈ షో వల్ల ప్రేమజంటలు విడిపోయిన సందర్భాలు ఉన్నాయి. అలాగే విడాకుల వరకు వెళ్లిన జంటలు ఉన్నాయి. ఇప్పుడు మరో జంట విడిపోయేందుకు రెడీ అయ్యింది. ప్రస్తుతం హిందీలో బిగ్‏బాస్ సీజన్ 3 ఓటీటీలో ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. ఈషోలోకి యూట్యూబర్ అర్మాన్ మాలిక్ తన ఇద్దరు భార్యలు పాయల్, కృతికతో కలిసి హౌస్ లోకి అడుగుపెట్టాడు. అయితే ముందు నుంచి అర్మాన్ గురించి అనేక విమర్శలు వచ్చాయి. ఇటీవలే తోటి కంటెస్టెంట్ పై అర్మాన్ చేయి చేసుకోవడంపై నెటిజన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఇప్పుడు అర్మాన్ మొదటి భార్య పాయల్ విడాకులు తీసుకోవడానికి రెడీ అయ్యింది.

ఈ విషయంపై పాయల్ తన యూట్యూబ్ ఛానల్లో ఓ వీడియో పోస్ట్ చేసింది. “నేను ఈ డ్రామా, ద్వేషంతో చాలా విసిగిపోయాను. ఒక వ్యక్తికి ఇద్దరు భార్యలు ఉండడం తప్పులా చూస్తున్నారు. అందరూ నిందిస్తున్నారు. ఈ విమర్శలు వల్ల ఒత్తిడికి గురవుతున్నాను. ఈ ట్రోలింగ్ చాలా దారుణంగా ఉంది. ఈ నెగిటివిపై నాకు అభ్యంతరం లేదు.. కానీ ఇది నా పిల్లలపై ప్రభావితం చూపిస్తుంది. నేను అర్మాన్ కు దూరంగా ఉండాలనుకుంటున్నాను. అతడు కృతికతో ఉండడంతో నాకు ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. నా పిల్లలను నేను చూసుకుంటాను. నేను నా ముగ్గురు పిల్లలతో ఎక్కడికైనా వెళ్తాను. నేను ఇంతకంటే ఎక్కువ ద్వేషాన్ని ఎప్పుడూ ఎదుర్కోలేదు. నా నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు. నా పిల్లలు దీని లక్ష్యం కాకూడదు. దీన్ని ఏ తల్లిదండ్రులూ సహించరు” అంటూ చెప్పుకొచ్చింది.

అర్మాన్ మాలిక్ 2011లో పాయల్‌ను పెళ్లాడాడు. ఆ తర్వాత అర్మాన్ కూడా 2018లో పాయల్ స్నేహితురాలు కృతికను పెళ్లి చేసుకున్నాడు. పాయల్‌కి ముగ్గురు పిల్లలు, కృతికి ఒక బిడ్డ. బిగ్‏బాస్ నుంచి తొలివారమే బయటకు వచ్చిన పాయల్.. ప్రస్తుతం పిల్లల సంరక్షణ చూసుకుంటుంది. ప్రస్తుతం పాయల్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?