- Telugu News Photo Gallery Cinema photos Tollywood heroines like Sreeleela Neha Shetty Anupama Parameswaran got dual movie chances
రండి బాబూ రండి.. తెలుగు హీరోయిన్స్‌కి క్రేజీ ఆఫర్స్.. ఇంతకీ స్టోరీ ఏంటనే కదా ??
రండి బాబూ రండి.. ఆలోచించిన ఆశాభంగం.. ఒకటి కొంటే ఒకటి ఉచితం అంటూ డిస్కౌంట్ మేళా నడుస్తుంటుంది కదా..? ఇప్పుడు మన హీరోయిన్లకు కూడా ఇలాంటి ఆఫర్సే ఇస్తున్నారు నిర్మాతలు. ఏంటి నమ్మరా.. ఒక్కరో ఇద్దరో అయితే కో ఇన్సిడెన్స్ అనుకోవచ్చు. ప్రతీ హీరోయిన్‌కు ఇదే జరుగుతుంటే ఎందుకు నమ్మరు..? కావాలంటే చూడండి.. ఆ 1+1 ఆఫర్ ఎవరెవరికి అప్లై అయిందో..?
Updated on: Jul 21, 2024 | 2:11 PM

రండి బాబూ రండి.. ఆలోచించిన ఆశాభంగం.. ఒకటి కొంటే ఒకటి ఉచితం అంటూ డిస్కౌంట్ మేళా నడుస్తుంటుంది కదా..? ఇప్పుడు మన హీరోయిన్లకు కూడా ఇలాంటి ఆఫర్సే ఇస్తున్నారు నిర్మాతలు. ఏంటి నమ్మరా.. ఒక్కరో ఇద్దరో అయితే కో ఇన్సిడెన్స్ అనుకోవచ్చు. ప్రతీ హీరోయిన్‌కు ఇదే జరుగుతుంటే ఎందుకు నమ్మరు..? కావాలంటే చూడండి.. ఆ 1+1 ఆఫర్ ఎవరెవరికి అప్లై అయిందో..?

ఓ ప్రొడక్షన్ హౌజ్‌లోకి ఎవరైనా హీరోయిన్ ఎంట్రీ ఇచ్చిందంటే కనీసం రెండు మూడు సినిమాలకు సైన్ చేయిస్తున్నారు నిర్మాతలు. గతేడాది ఆదికేశవలో నటిస్తున్నపుడే శ్రీలీలకు గుంటూరు కారంలో ఆఫర్ ఇచ్చారు సితార ఎంటర్‌టైన్మెంట్స్. అలాగే మీనాక్షి చౌదరికి గుంటూరు కారంలో ఛాన్స్ ఇచ్చాక.. అదే సితారలో నిర్మిస్తున్న లక్కీ భాస్కర్‌లో దుల్కర్ సల్మాన్‌కు జోడీగా తీసుకున్నారు.

వరుణ్ తేజ్‌తో మట్కా సినిమాను నిర్మిస్తున్న SRT ఎంటర్‌టైన్మెంట్స్.. నెక్ట్స్ విశ్వక్ సేన్‌తో చేయబోయే సినిమాలోనూ మీనాక్షిని తీసుకున్నారు. ఇక సితార ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మించిన డిజే టిల్లులో నేహా శెట్టి నటిస్తే.. అదే బ్యానర్‌లో ఇప్పుడు విశ్వక్‌తో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో జోడీ కట్టారు. అలాగే పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో వరసగా కార్తికేయ 2, ఈగల్ సినిమాలు చేసారు అనుపమ పరమేశ్వరన్.

సితార ఎంటర్‌టైన్మెంట్స్‌లో టిల్లు స్క్వేర్ కంటే ముందే.. అ..ఆ, ప్రేమమ్ సినిమాలు చేసారు అనుపమ పరమేశ్వరన్. అలాగే సరిలేరు నీకెవ్వరు తర్వాత రష్మిక మందనను వారసుడులోనూ రిపీట్ చేసారు దిల్ రాజు. మైత్రి మూవీ మేకర్స్‌లోనూ డియర్ కామ్రేడ్ తర్వాత పుష్ప ఫ్రాంచైజీలో నటిస్తున్నారు ఈ భామ. అలాగే సంయుక్త మీనన్‌కు భీమ్లా నాయక్, సార్‌లో ఛాన్సిచ్చారు సితార ఎంటర్‌టైన్మెంట్స్.

డివివి ఎంటర్‌టైన్మెంట్స్‌లోనూ హీరోయిన్స్ రిపీట్ అవుతుంటారు. గతంలో భరత్ అనే నేను, వినయ విధేయ రామలో కియారా అద్వానీ నటిస్తే.. తాజాగా ఓజి, సరిపోదా శనివారంలో ప్రియాంక మోహన్ నటిస్తున్నారు. RC16లో జాన్వీ కన్ఫర్మ్ అయ్యారు. మైత్రి మూవీ మేకర్స్‌లోనే వస్తున్న పుష్ప 2లో స్పెషల్ సాంగ్ చేస్తున్నారు ఈ భామ. బేబీ తర్వాత అదే బ్యానర్‌లో మరో సినిమా చేస్తున్నారు వైష్ణవి చైతన్య.




