- Telugu News Photo Gallery Cinema photos Anchor Anasuya beautiful look in green sleeveless bodycon dress with curly hair
Anasuya: కర్లీ హెయిర్‌తో హాలీవుడ్ బ్యూటీలా అనసూయ.. రంగమ్మత్త లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ప్రస్తుతం చేతి నిండా టీవీ షోలు, సినిమాలతో బిజీ బిజీగా ఉంటోంది స్టార్ యాంకర్ అనసూయ. అలాగే సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. నిత్యం తన గ్లామరస్ ఫొటోస్, వీడియోలను అందులో షేర్ చేస్తుంటుంది. అలా తాజాగా అనసూయ షేర్ చేసిన కొన్ని ఫొటోలు ఇప్పుడు నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటున్నాయి.
Updated on: Jul 21, 2024 | 11:56 AM

ప్రస్తుతం చేతి నిండా టీవీ షోలు, సినిమాలతో బిజీ బిజీగా ఉంటోంది స్టార్ యాంకర్ అనసూయ. అలాగే సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. నిత్యం తన గ్లామరస్ ఫొటోస్, వీడియోలను అందులో షేర్ చేస్తుంటుంది. అలా తాజాగా అనసూయ షేర్ చేసిన కొన్ని ఫొటోలు ఇప్పుడు నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటున్నాయి.

తాజాగా గ్రీన్ కలర్ స్లీవ్‌లెస్ డ్రెస్సులో కర్లీ హెయిర్‌తో భిన్నంగా కనిపించింది అనసూయ భరద్వాజ్. వీటిని చూసిన అభిమానులు, నెటిజన్లు 'అచ్చం హాలీవుడ్ బ్యూటీలా ఉన్నావు' అంటూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

ఓ ప్రముఖ ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న కామెడీ షోకు జడ్జ్‌గా వ్యవహరిస్తోంది యాంకర్ అనసూయ. ఇప్పుడు ఆ షో కోసం ఇలా అందంగా రెడీ అయ్యిందీ స్టార్ యాంకర్.

ఈ షో కోసం ప్రతివారం తన లుక్ తో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసేస్తోంది అనసూయ . ఇటీవల ఈ షోలోనే కోటు విప్పి రచ్చ చేసిందీ అందాల తార.

ఇప్పుడు కూడా కర్లీ హెయిర్ లో గ్రీన్ కలర్ స్లీవ్‌లెస్ డ్రెస్సులో బ్యూటిఫుల్ గా దర్శనమిచ్చింది అనసూయ. ప్రస్తుతం ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.

ప్రస్తుతం అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్ లో వస్తోన్న పుష్ప2 లో నటిస్తోంది అనసూయ. దీంతో పాటు ఇంకా చాలా ఆఫర్స్ ఈ ముద్దుగుమ్మ చేతిలో ఉన్నాయి.