Tollywood: పవన్ కల్యాణ్, చిరంజీవిల మధ్య ఉన్న ఈ పోలీసమ్మను గుర్తు పట్టారా? అసలు ఊహించలేరు

ఇదిలా ఉంటే చిరంజీవి, పవన్ కల్యాణ్‌ లకు సంబంధించిన ఒక ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ ఫొటో స్పెషాలిటీ ఏంటంటే.. ఈ మెగా బ్రదర్స్ మధ్యన ఒక పోలీసమ్మ కూడా ఉంది. ఇది సినిమా సెట్ లో ఫొటోనే. పైగా ఈ ముగ్గురి గెటప్స్ చూస్తుంటే ఇది చాలా ఏళ్ల నాటి క్రితం ఫొటోనే అని ఇట్టే అర్థమవుతోంది. దీనిని చూసిన వారందరూ ఆశ్చర్యూపోతున్నారు

Tollywood: పవన్ కల్యాణ్, చిరంజీవిల మధ్య ఉన్న ఈ పోలీసమ్మను గుర్తు పట్టారా? అసలు ఊహించలేరు
Pawan Kalyan, Chiranjeevi
Follow us
Basha Shek

|

Updated on: Jul 20, 2024 | 1:33 PM

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ప్రత్యేక స్థానం ఉంది. ప్రస్తుతం ఈ ఫ్యామిలీ నుంచి సుమారు అరడజనకు పైగానే హీరోలు టాలీవుడ్ కు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్ చరణ్, నాగ బాబు, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్.. ఇలా అందరూ తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి వారసత్వాన్ని కొనసాగిస్తూ మొదట ఆయన తమ్ముడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. తనదైన ఫైట్స్, డ్యాన్సులు, యాక్టింగ్ తో అభిమానుల్లో సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎంగా రాజకీయాల్లోనూ సత్తా చాటారు. ఇదిలా ఉంటే చిరంజీవి, పవన్ కల్యాణ్‌ లకు సంబంధించిన ఒక ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ ఫొటో స్పెషాలిటీ ఏంటంటే.. ఈ మెగా బ్రదర్స్ మధ్యన ఒక పోలీసమ్మ కూడా ఉంది. ఇది సినిమా సెట్ లో ఫొటోనే. పైగా ఈ ముగ్గురి గెటప్స్ చూస్తుంటే ఇది చాలా ఏళ్ల నాటి క్రితం ఫొటోనే అని ఇట్టే అర్థమవుతోంది. దీనిని చూసిన వారందరూ ఆశ్చర్యూపోతున్నారు. ఎందుకంటే చిరంజీవి, పవన్ కల్యాణ్ ల మధ్య ఉన్నది మరెవరో కాదు పొలిటికల్ ఫైర్ బ్రాండ్, నటి రోజా. ఈ ముగ్గురు ఎప్పుడు, ఎక్కడ, ఏ సందర్భంలో కలిసి దిగారో కానీ ప్రస్తుతం ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది.

కాగా సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి- రోజాలది హిట్ కాంబినేషన్. వీరి కాంబినేషన్ లో పలు సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. అయితే ఆ తర్వాతి కాలంలో రోజా రాజకీయల్లోకి అడుగు పెట్టారు. వైఎస్ జగన్ ‘వైఎస్సార్ సీపీ’లో కీలక నేతగా ఎదిగారు. మరోవైపు పవన్ కల్యాణ్ కూడా క్రియాశీల రాజకీయాల్లో బిజీగా మారిపోయారు. జనసేన పార్టీని స్థాపించిన ఆయన 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. ఏకంగా 21 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించారు. అయితే   ఎలక్షన్లకు ముందు పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్శలు చేశారు రోజా. వీటికి జనసేన నాయకులు కూడా గట్టిగానే కౌంటర్లు ఇచ్చారు.  రాజకీయల సంగతి పక్కన పెడితే.. చిరంజీవి ఫ్యామిలీతో రోజాకు మంచి సంబంధాలే ఉన్నాయి. గతంలో పలు సందర్భాల్లో తన ఫ్యామిలీతో కలిసి చిరంజీవి ఇంటికి వెళ్లారు రోజా. అలాగే ప్రముఖ ఛానెల్ లో చిరంజీవిని ప్రత్యేకంగా ఇంటర్వ్యూ కూడా చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు