AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahanati : మహానటి సినిమాలో చిన్నప్పటి సావిత్రి ఆ స్టార్ నటుడి మనవరాలా? ఇప్పుడెలా ఉందో చూశారా?

దివంగత నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన చిత్రం మహా నటి. 2018లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. అంతేకాదు అవార్డుల పంట పండింది. ఇదే సినిమాకు జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం అందుకుంది కీర్తి సురేశ్. ఈ సినిమాలో ఆమె నటించింది అనడం కన్నా జీవించింది అని చెప్పొచ్చు

Mahanati : మహానటి సినిమాలో చిన్నప్పటి సావిత్రి ఆ స్టార్ నటుడి మనవరాలా? ఇప్పుడెలా ఉందో చూశారా?
Mahanati Child Artist
Basha Shek
|

Updated on: Jul 21, 2024 | 12:34 PM

Share

దివంగత నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన చిత్రం మహా నటి. 2018లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. అంతేకాదు అవార్డుల పంట పండింది. ఇదే సినిమాకు జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం అందుకుంది కీర్తి సురేశ్. ఈ సినిమాలో ఆమె నటించింది అనడం కన్నా జీవించింది అని చెప్పొచ్చు. అంతలా సావిత్రమ్మ పాత్రకు ప్రాణం పోసింది కీర్తి సురేవ్. వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్ పతాకాలపై ప్రియాంక దత్ ఈ సినిమాను నిర్మించారు. సి అశ్వనీదత్ సమర్పకుడిగా వ్యవహరించారు. దుల్కర్ సల్మాన్, సమంత, విజయ్ దేవరకొండ, షాలిని పాండే, మాళవిక నాయర్ కీలక పాత్రలు పోషించగా.. మోహన్ బాబు, నాగ చైతన్య, క్రిష్, తరుణ్ భాస్కర్, సందీప్ రెడ్డి వంగా, సాయి మాధవ్ బుర్రా తదితరులు అతిథి పాత్రల్లో మెరిశారు. కాగా మహానటి సినిమాలో చిన్నప్పటి సావిత్రి, సుశీల పాత్రల్లో ఇద్దరు చిన్నారులు మెరిశారు. ముఖ్యంగా సావిత్రి లాంటి బరువైన పాత్రను పోషించిన పాప అందరినీ ఆకట్టుకుంది. ‘ఆగిపో బాల్యమా.. నవ్వులో నాట్యమా సరదా సిరిమువ్వలవుదాం’సాంగ్‌తో పాటు పలు సీన్లలో ఆ పాప అభినయం, హావా భావాలు అందరినీ కట్టి పడేశాయి. ఇంతకీ ఆ పాప ఎవరో తెలుసా.? ప్రముఖ స్టార్ హీరో, నవ్వుల రేడు రాజేంద్ర ప్రసాద్ మనవరాలు సాయి తేజశ్విని.

మహానటి సినిమాలో చిన్నప్పటి సావిత్రి పాత్రలో చాలా చక్కగా నటించింది సాయి తేజశ్విని. అరే సావిత్రి చిన్నప్పుడు ఇలాగే ఉండేదా?అని పించేలా ఎంతో సహజంగా నటించిందీ స్టార్ కిడ్. ఈ సినిమా రిలీజై అప్పుడే 8 ఏళ్లు నిండిపోయాయి. ఇప్పుడీ చిన్నారి మరింత క్యూట్ గా,బబ్లీగా మారిపోయింది. మహానటి తర్వాత బేబీ, సిరివెన్నెల, సరిలేకు నీకెవ్వరు, ఎర్ర చీర తదితర సినిమాల్లో నటించింది సాయి తేజస్విని. గతంలో సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉండేది. అయితే ఇప్పుడు మాత్రం దూరంగా ఉంటోంది. బహుశా సాయి తేజశ్విని ప్రస్తుతం తన చదువుపై పూర్తి దృష్టి పెడుతున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
IRCTC అద్భుత ప్యాకేజీ.. హైదరాబాద్ నుంచి శృంగేరి, మురుడేశ్వర్ ఆలయం
IRCTC అద్భుత ప్యాకేజీ.. హైదరాబాద్ నుంచి శృంగేరి, మురుడేశ్వర్ ఆలయం
తక్కువ పెట్టుబడితో ఇంటి నుంచి ప్రారంభించే వ్యాపారం గురించి తెలుసా
తక్కువ పెట్టుబడితో ఇంటి నుంచి ప్రారంభించే వ్యాపారం గురించి తెలుసా
'గబ్బర్ సింగ్' నటుడికి బ్రెయిన్ స్ట్రోక్.. ఆస్పత్రిలో చికిత్స
'గబ్బర్ సింగ్' నటుడికి బ్రెయిన్ స్ట్రోక్.. ఆస్పత్రిలో చికిత్స
తాజా ICC ర్యాకింగ్స్‌తో బయటపడ్డ టీమిండియా డొల్లతనం!
తాజా ICC ర్యాకింగ్స్‌తో బయటపడ్డ టీమిండియా డొల్లతనం!
మేక vs గొర్రె మాంసం.. జోరు వానల్లో ఏది బెస్ట్..?
మేక vs గొర్రె మాంసం.. జోరు వానల్లో ఏది బెస్ట్..?
-మద్యం ప్రియులకు మస్త్‌ గుడ్‌న్యూస్..అందుబాటులోకి గోల్డ్‌ వోడ్కా!
-మద్యం ప్రియులకు మస్త్‌ గుడ్‌న్యూస్..అందుబాటులోకి గోల్డ్‌ వోడ్కా!
రైతులను రిచ్ చేసే పంట.. పూర్తి వివరాలు మీ కోసం..
రైతులను రిచ్ చేసే పంట.. పూర్తి వివరాలు మీ కోసం..
ఆలయంలో ఎదురుపడ్డ నాగుపాము,పిల్లి.. ఆ తర్వాత జరిగిందిదే..
ఆలయంలో ఎదురుపడ్డ నాగుపాము,పిల్లి.. ఆ తర్వాత జరిగిందిదే..
గర్భవతినని బాస్‌కి మెసేజ్ చేసిన మహిళ.. 3 గంటల్లోనే ఉద్యోగం ఊస్ట్‌
గర్భవతినని బాస్‌కి మెసేజ్ చేసిన మహిళ.. 3 గంటల్లోనే ఉద్యోగం ఊస్ట్‌
తెలంగాణ విద్యార్థులకు అలెర్ట్.. జూలై 24న విద్యాసంస్థల బంద్‌..!
తెలంగాణ విద్యార్థులకు అలెర్ట్.. జూలై 24న విద్యాసంస్థల బంద్‌..!