అంతఃపురంలో సౌందర్య కొడుకుగా చేసిన ఈ చిన్నోడు.. ఇప్పుడు హీరో లుక్‌లోకి మారిపోయాడు

ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో సౌందర్య తన నటనతో ఆకట్టుకున్నారు. అంతఃపురం సినిమాలో సౌందర్య నటనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది పురస్కారాన్ని ప్రకటించింది. జగపతి బాబుకు ఉత్తమ సహాయ నటుడి పురస్కారం లభించింది. అలాగే ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ కూడా తన నటనతో మెప్పించారు. ప్రకాష్ రాజ్ కు స్పెషల్ మెన్షన్ కేటగిరీలో నేషనల్ ఫిల్మ్ అవార్డ్ దక్కింది.

అంతఃపురంలో సౌందర్య కొడుకుగా చేసిన ఈ చిన్నోడు.. ఇప్పుడు హీరో లుక్‌లోకి మారిపోయాడు
Anthapuram
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 21, 2024 | 12:26 PM

టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో ఎన్నో అద్భుతమైన సినిమాలు వచ్చాయి. గులాబి, నిన్నే పెళ్ళాడుతా,సింధూరం, చంద్రలేఖ, ఖడ్గం,మురారి ఇలా ఎన్నో గొప్ప సినిమాలను తెరకెక్కించాడు దర్శకుడు కృష్ణవంశీ. ఆయన తెరకెక్కించిన సినిమాల్లో అంతఃపురం సినిమా ఒకటి. ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో సౌందర్య తన నటనతో ఆకట్టుకున్నారు. అంతఃపురం సినిమాలో సౌందర్య నటనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది పురస్కారాన్ని ప్రకటించింది. జగపతి బాబుకు ఉత్తమ సహాయ నటుడి పురస్కారం లభించింది. అలాగే ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ కూడా తన నటనతో మెప్పించారు. ప్రకాష్ రాజ్ కు స్పెషల్ మెన్షన్ కేటగిరీలో నేషనల్ ఫిల్మ్ అవార్డ్ దక్కింది. కృష్ణవంశీకి బెస్ట్ డైరెక్టర్ గా, సౌందర్యకు ఉత్తమ నటిగా ఫిల్మ్ ఫేర్ అవార్డులు దక్కాయి.

ఇది కూడా చదవండి : Venu Swamy: మరో బాంబ్ పేల్చిన వేణుస్వామి..! ఆ టాలీవుడ్ హీరోయిన్ కూడా విడాకులు తీసుకుంటుందంటూ..

ఈ సినిమాకు లయ రాజు ఇళయరాజా సంగీతం అందించారు. ఈ సినిమాలోని పాటలన్ని సూపర్ హిట్ గా నిలిచాయి. ఇక ఈ సినిమా హిందీలోనూ రీమేక్ చేశారు. 2003 లో షారుఖ్ ఖాన్, కరిష్మా కపూర్ ముఖ్య పాత్రల్లో శక్తి అనే టైటిల్ తో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో సౌందర్య కొడుకుగా నటించిన చిన్నోడు గుర్తున్నాడా.? ఈ బుడ్డోడి కోసమే సినిమా కథ అంతా జరుగుతుంది.

ఇది కూడా చదవండి : వర్షాకాలంలో వేడి పుట్టించే సినిమా..! ఓటీటీని ఊపేస్తున్న రొమాంటిక్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే

చిన్నోడి పేరు కృష్ణ ప్రదీప్. కేవలం రెండేళ్ల వయసులోనే ఈ చిన్నోడు నటనతో ఆకట్టుకున్నాడు.ఈ సినిమా మొత్తం సౌందర్యతో పాటు ఈ చిన్న బాబు ఉంటాడు. అంతఃపురంలో సౌందర్య స్పృహ కోల్పోయిన సమయంలో కర్చీఫ్ నీటిలో తడిపి తుడిచే సీన్ లో తన నటనతో మెప్పించాడు కృష్ణ ప్రదీప్. ఈ సినిమా తర్వాత కృష్ణ ప్రదీప్ సినిమాల్లో నటించలేదు. చదువు నిర్లక్ష్యం కాకూడదని పేరెంట్స్ సినిమాలకి దూరం పెట్టారు. ఇప్పుడు ఈ బుడతడు కుర్రాడిగా ఎదిగాడు. ఇప్పుడు హీరో లుక్ లోకి మారిపోయాడు కృష్ణ ప్రదీప్. హీరోలకు ధీటుగా మంచి ఫిజిక్ తో ఆకట్టుకునేలా ఉన్నాడు ఈ చిన్నోడు. ప్రస్తుతం ది ఇండియా హౌస్ అనే సినిమాలో నటిస్తున్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పెళ్లి చేస్తామని ఇంటికి పిలిచి.. నమ్మకంగా హతమార్చారు!
పెళ్లి చేస్తామని ఇంటికి పిలిచి.. నమ్మకంగా హతమార్చారు!
ఇదెక్కడి షాట్ భయ్యా.. ఇలా కూడా సిక్స్ కొడతారా
ఇదెక్కడి షాట్ భయ్యా.. ఇలా కూడా సిక్స్ కొడతారా
చేపల కోసం రాత్రి వల పెట్టి వెళ్లారు.. ఉదయాన్నే వచ్చి చూడగా షాక్..
చేపల కోసం రాత్రి వల పెట్టి వెళ్లారు.. ఉదయాన్నే వచ్చి చూడగా షాక్..
అన్నా క్యాంటీన్ వద్ద అదో మత్తైన వాసన.. ఏంటా అని చెక్ చేయగా..
అన్నా క్యాంటీన్ వద్ద అదో మత్తైన వాసన.. ఏంటా అని చెక్ చేయగా..
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌ ఇంటర్వ్యూ తేదీలు వెల్లడి.. వివరాలివే
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌ ఇంటర్వ్యూ తేదీలు వెల్లడి.. వివరాలివే
ముచ్చటగా మూడోసారి.. ఎంసీజీలో చరిత్ర సృష్టించనున్న కేఎల్ రాహుల్
ముచ్చటగా మూడోసారి.. ఎంసీజీలో చరిత్ర సృష్టించనున్న కేఎల్ రాహుల్
ఆ ముగ్గురు హీరోలతో సినిమాలు చేయాలనుకున్నా.. డైరెక్టర్ శంకర్
ఆ ముగ్గురు హీరోలతో సినిమాలు చేయాలనుకున్నా.. డైరెక్టర్ శంకర్
విజన్‌ -2047 వైపు తిరుమల అడుగులు.. ఆధునిక టౌన్‌ ప్లానింగ్‌లో..
విజన్‌ -2047 వైపు తిరుమల అడుగులు.. ఆధునిక టౌన్‌ ప్లానింగ్‌లో..
రెండుసార్లు సూసైడ్ అటెంప్ట్.. షన్ను ఎమోషనల్ కామెంట్స్..
రెండుసార్లు సూసైడ్ అటెంప్ట్.. షన్ను ఎమోషనల్ కామెంట్స్..
మరోసారి తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతుందంటే?
మరోసారి తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతుందంటే?