Venu Swamy: మరో బాంబ్ పేల్చిన వేణుస్వామి..! ఆ టాలీవుడ్ హీరోయిన్ కూడా విడాకులు తీసుకుంటుందంటూ..

సినిమా వాళ్లు కూడా వేణు స్వామితో ప్రత్యేక పూజలు కూడా చేయించుకుంటుంటారు. సమంత నాగ చైతన్య విడాకుల గురించి ముందే చెప్పి పాపులర్ అయ్యారు. అలాగే స్టార్ హీరోల ఆరోగ్యం పై కూడా కామెంట్స్ చేశారు వేణు స్వామి. అలాగే ప్రభాస్ ఇక పై హిట్స్ అందుకోలేడు అని చెప్పారు. కానీ ప్రభాస్ సలార్, కల్కి సినిమాలతో భారీ హిట్స్ అందుకున్నాడు.

Venu Swamy: మరో బాంబ్ పేల్చిన వేణుస్వామి..! ఆ టాలీవుడ్ హీరోయిన్ కూడా విడాకులు తీసుకుంటుందంటూ..
Venu Swamy
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 21, 2024 | 7:37 AM

వేణు స్వామీ.. తెలుగు ప్రేక్షకులు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. ప్రముఖ జ్యోతిష్యుడు అయిన ఈయన సెలబ్రెటీల జాతకాలు చెప్తూ ఫెమాస్ అయ్యారు. అబ్బో ఈయన చెప్పినవన్నీ నిజం అవుతాయని చాలా మంది నమ్ముతుంటారు. సినిమా వాళ్లు కూడా వేణు స్వామితో ప్రత్యేక పూజలు కూడా చేయించుకుంటుంటారు. సమంత నాగ చైతన్య విడాకుల గురించి ముందే చెప్పి పాపులర్ అయ్యారు. అలాగే స్టార్ హీరోల ఆరోగ్యం పై కూడా కామెంట్స్ చేశారు వేణు స్వామి. అలాగే ప్రభాస్ ఇక పై హిట్స్ అందుకోలేడు అని చెప్పారు. కానీ ప్రభాస్ సలార్, కల్కి సినిమాలతో భారీ హిట్స్ అందుకున్నాడు. ఇక వేణు స్వామి రష్మిక మందన్న, డింపుల్ హయతి, నిధి అగర్వాల్ లాంటి స్టార్ హీరోయిన్స్ దగ్గర నుంచి అషు రెడ్డి, ఇనాయ సుల్తానా లాంటి బుల్లితెర నటుల వరకు అందరికి స్పెషల్ పూజలు చేస్తూ ఉంటారు.

ఇది కూడా చదవండి : వర్షాకాలంలో వేడి పుట్టించే సినిమా..! ఓటీటీని ఊపేస్తున్న రొమాంటిక్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే

ఇదిలా ఉంటే తాజాగా వేణు స్వామి ఓ స్టార్ హీరోయిన్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. పెళ్లి తర్వాత ఆ హీరోయిన్ కు అంతగా కలిసి రాదు అని చెప్పి షాక్ ఇచ్చారు వేణుస్వామి. ఆ హీరోయిన్ మరెవరో కాదు టాలీవుడ్ టాప్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. ఈ ముద్దుగుమ్మ ఇటీవలే బాలీవుడ్ నటుడు, నిర్మాత అయినా జాకీ జాకీ భగ్నానీ‌‌ని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈజంట చాల హ్యాపీగా ఉన్నారు. వీరి గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో వేణు స్వామి షాకింగ్ కామెంట్స్ చేశాడు.

ఇది కూడా చదవండి : నన్ను చూసి తట్టుకోలేవు.. నువ్వు రావొద్దు అన్నాడు.. కన్నీళ్లు పెట్టుకున్న బ్రహ్మానందం

రకుల్ ప్రీత్ సింగ్ కు పెళ్లి అచ్చిరాదు అని అన్నారు. అలాగే నేను చెప్పినట్టే ఆమె భర్త నష్టపోయాడు. రకుల్ భర్త దాదాపు 500కోట్లు నష్టపోయాడు. నాకు తెలిసి మరో ఆరు నెలల్లో ఆమె విడాకులు తీసుకుంటుంది. అది జరుగుతుంది. అది జరిగితే నా పై ట్రోల్ చేసిన వారిని చెప్పుతో కొట్టినట్టే అవుతుంది అని అన్నారు వేణు స్వామి. అలాగే తన పై వచ్చే ట్రోల్స్ ను పెద్దగా పట్టించుకోను అని అన్నారు. నేను చెప్పినవి 90 శాతం నిజం అయ్యాయి. ఒక 10శాతం ఫెయిల్ అయ్యుంటాయి. కానీ ఆ 90శాతం గురించి ఎవ్వరూ మాట్లాడటం లేదు అని అన్నారు వేణు స్వామి. నన్ను కావాలనే ట్రోల్ చేస్తున్నారు అని అన్నారు. రకుల్ పెళ్లి , విడాకులు గురించి చెప్పిన వేణు స్వామి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

View this post on Instagram

A post shared by Rakul Singh (@rakulpreet)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.