Hyper Aadi: జనసేన ఎమ్మెల్సీగా హైపర్ ఆది.. క్లారిటీ ఇచ్చిన జబర్దస్త్ స్టార్ కమెడియన్

సినిమాలు, టీవీషోల సంగతి పక్కన పెడితే.. హైపర్ ఆది పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు వీరాభిమాని. ఈ కారణంతోనే 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన తరఫున విస్తృత ప్రచారం నిర్వహించాడీ స్టార్ కమెడియన్. కేవలం పిఠాపురంలో మాత్రమే కాకుండా జనసేన అభ్యర్థులు పోటీ చేసిన పలు చోట్ల పర్యటించారు.

Hyper Aadi: జనసేన ఎమ్మెల్సీగా హైపర్ ఆది.. క్లారిటీ ఇచ్చిన జబర్దస్త్ స్టార్ కమెడియన్
Hyper Aadi, Pawan Kalyan
Follow us
Basha Shek

|

Updated on: Jul 24, 2024 | 10:03 PM

ఓవైపు సినిమాల్లోనూ..మరోవైపు టీవీషోలతోనూ ఫుల్ బిజిబిజీగా ఉంటున్నాడు స్టార్ కమెడియన్ హైపర్ ఆది. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ వంటి టీవీ షోలతో బుల్లితెర ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్విస్తోన్న ఈ ట్యాలెంటెడ్ యాక్టర్ ఇటీవల విశ్వక్ సేన్ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో కీలక పాత్ర పోషించాడు. సినిమాలు, టీవీషోల సంగతి పక్కన పెడితే.. హైపర్ ఆది పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు వీరాభిమాని. ఈ కారణంతోనే 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన తరఫున విస్తృత ప్రచారం నిర్వహించాడీ స్టార్ కమెడియన్. కేవలం పిఠాపురంలో మాత్రమే కాకుండా జనసేన అభ్యర్థులు పోటీ చేసిన పలు చోట్ల పర్యటించారు. పవన్ కల్యాణ్ తో పాటు జనసేన అభ్యర్థులకు గెలిపించాలని ఓటర్ల కోరారు. ఈ నేపథ్యంలో హైపర్ ఆది కి సంబంధించిన ఒక ఆసక్తికర వార్త వినిపిస్తోంది. అదేంటంటే.. జనసేన తరఫున ఆదికి ఎమ్మెల్సీ పదవి ఇస్తారని లేకపోతే ఏదో ఒక కార్ఫొరేషన్ ఛైర్మన్ పదవి బాధ్యతలు ఇస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరగుతోంది. తాజాగా ఇదే విషయంపై హైపర్ ఆది స్పందించాడు. ఓంకార్ సోదరుడు అశ్విన్ బాబు హీరోగా నటించిన శివం భజే ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న అతను పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

‘నాకు వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. అందుకే ఆయన కోసం వెళ్లి ప్రచారం చేశాను. నేను సినిమాలు, టీవీ షోలు మానేసి పవన్ కల్యాణ్ కోసం ఎన్నికల్లో ప్రచారం చేశాను. ఇప్పుడు ఆయన గెలిచారు. రూలింగ్ కూడా చేస్తున్నారు. నాకు ఎమ్మెల్సీ పదవి లాంటి వాటిపై మక్కువ లేదు. అలాంటి ఆశ కూడా లేదు. పవన్ కల్యాణ్ ఆనందంగా ఉంటే దూరంగా ఉండి చూడడం ఇష్టం. బాధతో ఉంటే దగ్గరికి వెళ్లి చూసుకోవడం ఇష్టం. అంతకుమించి నేను ఏమీ ఆశించడం లేదు’ అని హైపర్ ఆది స్పష్టం చేశారు. ప్రస్తుతం అతని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

పవన్ కల్యాణ్ తో హైపర్ ఆది..

ఎన్నికల ప్రచారంలో పవన్ కల్యాణ్ తో హైపర్ ఆది..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
డెడ్ బాడీ ఇంటికి డోర్ డెలివరీ కేసులో కీలక విషయాలు
డెడ్ బాడీ ఇంటికి డోర్ డెలివరీ కేసులో కీలక విషయాలు
ఓ యువ రైతు వినూత్న ఆలోచన.. విద్యుత్ కాంతుల మధ్య చామంతి సాగు..
ఓ యువ రైతు వినూత్న ఆలోచన.. విద్యుత్ కాంతుల మధ్య చామంతి సాగు..
పుష్ప 2 మూవీ క్లైమాక్స్.. థియేటర్‌లోకి పోలీసుల ఎంట్రీ! ఆ తర్వాత
పుష్ప 2 మూవీ క్లైమాక్స్.. థియేటర్‌లోకి పోలీసుల ఎంట్రీ! ఆ తర్వాత
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
సఫల ఏకాదశి వ్రతం మహత్యం.. పూజ శుభ సమయం? విధానం ఏమిటంటే..
సఫల ఏకాదశి వ్రతం మహత్యం.. పూజ శుభ సమయం? విధానం ఏమిటంటే..
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లక్ష్యంగా తెంబా మాస్టర్ ప్లాన్..!
టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లక్ష్యంగా తెంబా మాస్టర్ ప్లాన్..!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో