AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yevam OTT: ఊహించని ట్విస్టులతో మర్డర్ మిస్టరీ.. ఓటీటీలోకి చాందిని చౌదరీ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

ఇటీవలే చాందిని చౌదరి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం యేవమ్. మహిళా ప్రాధాన్యతగా వచ్చిన ఈ మూవీలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించింది. గతనెల 14న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి.. కానీ ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించని ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వస్తుంది.

Yevam OTT: ఊహించని ట్విస్టులతో మర్డర్ మిస్టరీ.. ఓటీటీలోకి చాందిని చౌదరీ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
Yevam Movie
Rajitha Chanti
|

Updated on: Jul 25, 2024 | 6:58 AM

Share

కలర్ ఫోటో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది హీరోయిన్‏ చాందిని చౌదరి. షార్ట్ ఫిల్మ్ ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ.. తనదైన నటనతో ప్రశంసలు అందుకుంది. ఎన్నో సవాళ్లను ఎదుర్కొని కథానాయికగా ఓ గుర్తింపు తెచ్చుకుంది. అలాగే ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూ మెప్పిస్తుంది. ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది ఈ అమ్మడు. ఇటీవలే చాందిని చౌదరి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం యేవమ్. మహిళా ప్రాధాన్యతగా వచ్చిన ఈ మూవీలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించింది. గతనెల 14న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి.. కానీ ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించని ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వస్తుంది.

చాందినీ చౌదరి నటించిన ఈ మర్డర్ మిస్టరీ మూవీ ఈరోజు (జూలై 25) నుంచి మధ్యాహ్నం 12 గంటల నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రముఖ ఓటీటీ ప్లాట్ కు సూపర్ హిట్ అందుకుంది. ఈ విషయాన్ని తమ అధికారిక అకౌంట్ ద్వారా వెల్లడించింది. “నేరస్తుడు ఎవరైనా తప్పించుకోలేరు.. ఇన్‏స్పెక్టర్ సౌమ్య జూలై 25న ఛార్జ్ తీసుకుంటుంది” అనే క్యాప్షన్ తో ఆహా ఓటీటీ యేవమ్ మూవీ స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేసింది. ఈ సినిమాలో వశిష్ట సింహా, జై భారత్, బిగ్ బాస్ ఆషు రెడ్డి ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ప్రకాష్ దంతులూరి దర్శకత్వం వహించగా.. నవదీప్, పవన్ గోపరాజు నిర్మతలుగా వ్యవహరించారు.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం చాందిని చౌదరీ చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. ఈ బ్యూటీ నటించిన రెండు సినిమాలు గత నెలలో ఒకేరోజు విడుదల కావడం విశేషం. యేవమ్ మూవీతోపాటు మ్యూజిక్ షాప్ మూర్తి అనే మరో సినిమా కూడా జూన్ 14న రిలీజ్ కాగా.. ఇప్పటికే మ్యూజిక్ షాప్ మూర్తి సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ చిత్రాన్ని ఈటీవీ విన్, అమెజాన్ ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్ చేస్తున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

చావు దగ్గరపడుతుందని ముందే గ్రహించే జీవి ..శాస్త్రవేత్తలకే షాక్!
చావు దగ్గరపడుతుందని ముందే గ్రహించే జీవి ..శాస్త్రవేత్తలకే షాక్!
టీ20 ప్రపంచ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. రంగంలోకి మరో జట్టు?
టీ20 ప్రపంచ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. రంగంలోకి మరో జట్టు?
పదే పదే కడుపు నొప్పి వస్తున్నా లైట్ తీసుకుంటున్నారా.. ప్రమాదకరమే
పదే పదే కడుపు నొప్పి వస్తున్నా లైట్ తీసుకుంటున్నారా.. ప్రమాదకరమే
ఏడు జన్మలలో ఒకే వ్యక్తి భర్తగా ఉండగలరా..? ఎలా సాధ్యమో తెలుసుకోండి
ఏడు జన్మలలో ఒకే వ్యక్తి భర్తగా ఉండగలరా..? ఎలా సాధ్యమో తెలుసుకోండి
మందుబాబులకు పూనకాలే.. దేశంలోనే బెస్ట్ బార్ల లిస్ట్ వచ్చేసింది
మందుబాబులకు పూనకాలే.. దేశంలోనే బెస్ట్ బార్ల లిస్ట్ వచ్చేసింది
శుక్రుడి ఎఫెక్ట్ :అదృష్టం కలిసి వచ్చే రాశులివే.. మరి మీ రాశి ఉందా
శుక్రుడి ఎఫెక్ట్ :అదృష్టం కలిసి వచ్చే రాశులివే.. మరి మీ రాశి ఉందా
ఆధార్ కార్డు ఉన్నవారికి అదిరిపోయే న్యూస్..కేంద్రం నుంచి రూ.90వేలు
ఆధార్ కార్డు ఉన్నవారికి అదిరిపోయే న్యూస్..కేంద్రం నుంచి రూ.90వేలు
టీవీ9 నెట్‌వర్క్ ఆధ్వర్యంలో ఆటో 9 అవార్డులు..
టీవీ9 నెట్‌వర్క్ ఆధ్వర్యంలో ఆటో 9 అవార్డులు..
మతిమరుపు వేధిస్తోందా? ఫోకస్ కుదరట్లేదా?
మతిమరుపు వేధిస్తోందా? ఫోకస్ కుదరట్లేదా?
చేతిలో ఉన్న వస్తువు కిందపడిపోతే భవిష్యత్తుకు సంకేతమా? శాస్త్రంలో.
చేతిలో ఉన్న వస్తువు కిందపడిపోతే భవిష్యత్తుకు సంకేతమా? శాస్త్రంలో.