Tollywood Movies: ఈ వారం ఓటీటీలోకి వచ్చే సినిమాలు ఇవే.. థ్రిల్ ఇచ్చే వెబ్ సిరీస్‏లు..

కోలీవుడ్ హీరో ధనుష్ నటించిన రాయన్ చిత్రం ఈ శుక్రవారం విడుదల కానుంది. అలాగే యంగ్ హీరో రాజ్ తరుణ్ నటించిన పురుషోత్తముడు, మరికొన్ని సినిమాలు రిలీజ్ కానున్నాయి. అలాగే అటు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో సస్పెన్స్ థ్రిల్లర్, హారర్ కామెడీ చిత్రాలు, వెబ్ సిరీస్ సినీ ప్రియులను ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యాయి. అందుకే ఈ వారం ఓటీటీలోకి వచ్చే సినిమాలు, వెబ్ సిరీస్ ఏంటో తెలుసుకుందామా.

Tollywood Movies: ఈ వారం ఓటీటీలోకి వచ్చే సినిమాలు ఇవే.. థ్రిల్ ఇచ్చే వెబ్ సిరీస్‏లు..
Ott Movies
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 25, 2024 | 10:58 AM

పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద ఇప్పటికీ కల్కి 2898 ఏడి హవానే కొనసాగుతుంది. ఇప్పటికే రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ సినిమా సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఇక ఇప్పుడిప్పుడే మరిన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాయి. కోలీవుడ్ హీరో ధనుష్ నటించిన రాయన్ చిత్రం ఈ శుక్రవారం విడుదల కానుంది. అలాగే యంగ్ హీరో రాజ్ తరుణ్ నటించిన పురుషోత్తముడు, మరికొన్ని సినిమాలు రిలీజ్ కానున్నాయి. అలాగే అటు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో సస్పెన్స్ థ్రిల్లర్, హారర్ కామెడీ చిత్రాలు, వెబ్ సిరీస్ సినీ ప్రియులను ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యాయి. అందుకే ఈ వారం ఓటీటీలోకి వచ్చే సినిమాలు, వెబ్ సిరీస్ ఏంటో తెలుసుకుందామా.

రాజు యాదవ్.. జబర్దస్త్ కమెడియన్ గెటప్ శ్రీను హీరోగా నటించిన సినిమా రాజు యాదవ్. కృష్ణమాచారి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అంకిత కారాట్ కథానాయికగా నటించింది. ప్రస్తుతం ఈ మూవీ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.

భయ్యా జీ.. బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్ పాయ్ ప్రధాన పాత్రలో అపూర్వ సింగ్ కర్కి దర్శకత్వం వహించిన సినిమా భయ్యా జీ. మనోజ్ బాజ్ పాయ్ కెరీర్ లో 100వ సినిమాగా వచ్చిన ఈ చిత్రం శుక్రవారం నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది.

బ్లడీ ఇష్క్.. టాలీవుడ్ హీరోయిన్ అవికా గోర్, వర్దన్ పూరి జంటగా నటించిన హారర్ థ్రిల్లర్ బ్లడీ ఇష్క్. విక్రమ్ భట్ తెరకెక్కించిన ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ కానుంది.

నెట్ ఫ్లిక్స్.. అట్లాస్.. హాలీవుడ్ మూవీ.. జూలై 26 డ్రాగన్ ప్రిన్స్ సీజన్ 6.. హాలీవుడ్ వెబ్ సిరీస్.. జూలై 26 ఎలైట్ సీజన్ 8.. హాలీవుడ్ వెబ్ సిరీస్.. జూలై 26 ది డెకామెరాన్.. హాలీవుడ్ వెబ్ సిరీస్.. జూలై 25

అమెజాన్ ప్రైమ్ వీడియో… ది మినిస్ట్రీ ఆఫ్ అన్ జెంటిల్ మాన్లీ వార్ ఫేర్.. హాలీవుడ్.. జూలై 25

ఆహా.. యేవమ్.. తెలుగు.. జూలై 25 భరతనాట్యం.. తెలుగు.. జూలై 27

హాట్ స్టార్.. చట్నీ సాంబార్.. తమిళం.. జూలై 26 ది కర్దాషియన్స్ సీజన్ 5.. హాలీవుడ్ వెబ్ సిరీస్.. జూలై 25

జియో సినిమా.. విచ్ బ్రింగ్స్ మీ టూ యూ .. హాలీవుడ్.. జూలై 26